Health Tips : డయాబెటిస్‌కి వేపతో చెక్... ఇలా చెయ్యండి

Blood sugar level : వ్యాధులు చెప్పి రావు. ఎప్పుడోకప్పుడు వ్యాధి సోకినా... ఆ విషయం తెలుసుకోవడానికి టైమ్ పడుతుంది. తీరా నిజం తెలిశాక బాధ ఆవహిస్తుంది. డయాబెటిస్ అలాంటిదే. దాని అంతు చూడటానికి వేప ఆకులతో ఏం చెయ్యవచ్చో తెలుసుకుందాం.

Krishna Kumar N | news18-telugu
Updated: September 24, 2019, 9:16 AM IST
Health Tips : డయాబెటిస్‌కి వేపతో చెక్... ఇలా చెయ్యండి
డయాబెటిస్‌కి వేపతో చెక్... ఇలా చెయ్యండి
  • Share this:
Diabetes Control : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మందికి మూడు రకాల వ్యాధులు వస్తున్నాయి. అవి కాన్సర్, డయాబెటిస్, హార్ట్ ఎటాక్. వీటిలో అత్యంత వేగంగా ఎక్కువ మందికి వస్తున్నది డయాబెటిస్. ఇలా ఎందుకు జరుగుతోందో మనకు తెలుసు. ఆహార అలవాట్లు, నిద్రలేమి, ఒత్తిళ్లు, జన్యుపరమైన లోపాలు... రకరకాల కారణాలు. ప్రపంచ ఆరోగ్య సంస్థ - WHO ప్రకారం... ఏడాదికి 16 లక్షల మంది డయాబెటిస్ వల్ల చనిపోతున్నారు. ఎంత దారుణమంటే... ఈ మధ్య పుట్టే పిల్లలకు కూడా ఈ వ్యాధి వచ్చేస్తోంది. 2030 నాటికి ప్రపంచంలో అత్యంత ఎక్కువగా మనుషుల్ని చంపేసేవాటిలో డయాబెటిస్ ఏడో స్థానంలో ఉటుందని WHO అంటోంది. ఇలాంటి డయాబెటిస్‌కి వేపాకులతో చెక్ పెట్టొచ్చు. బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చెయ్యొచ్చు. వేపాకులు మన శరీరంలోని విష వ్యర్థాల్ని బయటకు తరిమికొడతాయి కూడా.

బ్లడ్‌లో షుగర్ లెవెల్స్ ఎక్కువైతే డయాబెటిస్ వస్తుంది. దాన్ని తేలిగ్గా తీసుకుంటే... క్రమంగా గుండెం, రక్త నాళాలు, కళ్లు, కిడ్నీలు, నరాలు దెబ్బతింటాయి. ఈ వ్యాధి ఉన్నవారు ఏం తినాలన్నా జాగ్రత్తపడాలి. తినే ఆహారంలో ఫైబర్ (పీచు పదార్థం) ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. అలాగే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అన్నీ ఉండే ఆహారం తీసుకోవాలి.

వేపాకులు ఎలా డయాబెటిస్‌ని తగ్గిస్తాయి : వేప చెట్లు (Neem) దాదాపు ప్రతీ వీధిలో ఉంటాయి. వాటిలో యాంటీసెప్టిక్, వ్యాధుల్ని తరిమికొట్టే గుణాలుంటాయి. అందుకే ఇండియా, చైనా మందుల తయారీలో వేపను ఎక్కువగా వాడుతున్నారు. వేప చెట్టులోని ఆకులు, పువ్వులు, గింజలు, పండ్లు, బెరడు అన్నింటిలోనూ ఔషధ గుణాలున్నాయి. శరీర మంటలు, ఇన్ఫెక్షన్లు, జ్వరం, చర్మ వ్యాధులు, నోటి సమస్యలు, ఇలా అన్నింటికీ వేప ఔషధంగా పనిచేస్తోంది. వేప డయాబెటిస్‌ని పూర్తిగా నయం చెయ్యలేదు. కానీ... వ్యాధి తీవ్రతను తగ్గించగలదు. వ్యాధి వేగంగా పెరగకుండా చెయ్యగలదని పరిశోధనల్లో తేలింది.

మీకు డయాబెటిస్ ఉంటే, మీరు రోజూ వేప షర్బత్ తాగాలి. లేదంటే కొన్ని వేపాకులను నమలాలి. ఇలా చేసేముందు... డాక్టర్‌ని కలిసి... ఎంత షర్బత్ తాగొచ్చో, ఎన్ని వేపాకులు తీసుకోవాలో కనుక్కోవాలి. వేపాకుల్లో ఫ్లేవనాయిడ్స్, ట్రిటెర్పెనాయిడ్, యాంటీ వైరల్ గుణాలుంటాయి. అవి బ్లడ్‌లో గ్లూకోజ్ లెవెల్స్ పెరగకుండా చేస్తాయి.వేప షర్బత్ ఇలా తయారుచేసుకోండి : 20 వేపాకులను 5 నిమిషాలపాటూ ఉడికించాలి. వేపాకులు మెత్తబడినట్లు మారగానే... ఆ నీరు పచ్చ (green) కలర్‌లోకి మారుతుంది. ఆ నీటిని వడగట్టి... కంటైనర్‌లో పోసి... రోజుకు రెండుసార్లు తాగాలి. టీ లాగా వేడిగా తాగినా, చల్లారిన తర్వాత తాగినా పర్వాలేదు.

 

ఇవి కూడా చదవండి :

Health Tips : డయాబెటిస్ ఉందా... మీరు తినదగ్గ 10 బేక్‌ఫాస్ట్స్ తెలుసుకోండి


Health Tips : కొబ్బరి పాలతో హెయిర్ స్పా... ఇలా చెయ్యండి

Peanut Butter Fruit : ఈ ఫ్రూట్ విశేషాలు తెలుసా మీకు?
First published: September 24, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>