హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Blood Pressure in Children: పిల్లల్లో బీపీ వస్తుందా? ఎలా కొలుస్తారు? లక్షణాలేంటి?

Blood Pressure in Children: పిల్లల్లో బీపీ వస్తుందా? ఎలా కొలుస్తారు? లక్షణాలేంటి?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

చిన్నవయసులోనే క్యాన్లర్లు వచ్చిన పిల్లలు, ఫిట్స్‌తో బాధపడేవారు, మగతగా ఉన్నట్లు కనిపించే పిల్లలు, తరచుగా తలనొప్పులతో బాధపడే పిల్లలు, చూపు సమస్యలు ఉన్న పిల్లల బీపీని జాగ్రత్తగా పరిశీలిస్తూ, మెడికల్ చెకప్ చేయించుకోవాలి. వారిని తరచుగా పరీక్షించి, బీపీ సాధారణ స్థాయిలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Andhra Pradesh | Telangana | Karnataka | Maharashtra

పిల్లల్లో బీపీని పెద్దలకు కొలిచినట్టు కొలవరు. ఎందుకంటే చిన్నారుల భుజాలకు స్పిగ్మో మానోమీటర్ పరికరాల పట్టీలు సరిపోవు. అందువల్ల పాదరసం లేని అనరాయిడ్ మానోమీటర్, డైనామ్యాప్ పరికరంతో చిన్నారుల రక్తపోటును కొలుస్తారు. పెద్దల్లో బీపీని కచ్చితమైన సంఖ్యతో సూచిస్తాం. బీపీ 120/80 లోపు ఉంటే నార్మల్‌ బీపీగా పరిగణిస్తారు. అయితే పిల్లల్లో ఇలాంటి సంఖ్యలను కొలమానంగా తీసుకోరు. సాధారణంగా అప్పుడే పుట్టిన శిశువు దగ్గర్నుంచి 13 ఏళ్లలోపు పిల్లల వరకు ఒక ఏజ్ గ్రూప్‌గా, 13-18 ఏళ్ల వారిని మరో ఏజ్ గ్రూప్‌గా విభజించి చూస్తారు. 13 ఏళ్లు నిండిన వారికి పెద్దవాళ్లకు వర్తించే బీపీ రికార్డులే వర్తిస్తాయి. కానీ 13 ఏళ్లలోపు వారిలో మాత్రం.. పిల్లల లింగ బేధం, వయసు, ఎత్తు,  బరువులను బట్టి రక్తపోటు నిష్పత్తిని పర్సంటైల్స్‌లో ప్రామాణికంగా తీసుకుంటారు. 

ఈ పర్సంటైల్‌ 90 కన్నా తక్కువగా ఉంటే నార్మల్‌ బీపీగా భావిస్తారు. పర్సంటైల్‌ 90-95 వరకు ఉంటే ముందస్తు రక్తపోటు దశ అంటారు. దీన్ని 120/80 లేదా అంతకన్నా ఎక్కువ అనుకోవచ్చు. పర్సంటైల్‌ 95-99 వరకు ఉంటే.. మొదటి దశ అధిక రక్తపోటుగా భావిస్తారు. ఇది 99 కన్నా మించిపోయి, రక్తపోటు 12 ఎంఎంహెచ్‌జీ దాటితే రెండో దశ హై బీపీగా భావిస్తారు. ఇది చాలా ప్రమాదకరమైన దశ.

Top 10 Cancer Hospitals in India: ఇండియాలో టాప్ 10 క్యాన్సర్ ఆస్పత్రులు ఏవి? ఎక్కడున్నాయి? వాటి వివరాలు



పిల్లలకు కూడా హై బీపీ సమస్య ఎదురవుతుందా?

బ్లడ్ ప్రెజర్ లేదా రక్తపోటు సమస్యలు పెద్దవాళ్లకే పరిమితమని చాలామంది భావిస్తారు. అయితే పిల్లల్లోనూ రక్తపోటు హెచ్చుతగ్గులకు గురికావచ్చు. చిన్న పిల్లలకు కూడా హైబీపీ వచ్చే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ శాతం హై బీపీ వచ్చేది పెద్దల్లోనే అయినా, పిల్లలకు ఈ సమస్య రాదని ఎవరూ చెప్పలేరు. అయితే చిన్నారుల్లో ఇందుకు అవకాశం తక్కువ అని చెప్పవచ్చు. అమెరికాలోని పిల్లల్లో పది శాతం మందికి హైబీపీ ఉన్నట్టు సర్వేల్లో తేలింది. అలాగే మనదేశంలో దాదాపు ఏడు శాతం మంది పిల్లలకు హైబీపీ ఉండే అవకాశం ఉన్నట్టు కొన్ని పరిశోధనలు విశ్లేషించాయి. సాధారణంగా పిల్లల్లో వచ్చే హై బీపీ రెండు రకాలుగా ఉంటుంది. అవి ప్రైమరీ హైపర్ టెన్షన్, సెకండరీ హైపర్ టెన్షన్. 

Pre-diabetes: మీకు 18 ఏళ్లు దాటాయా..? అయితే, వెంటనే షుగర్ పరీక్ష చేయించుకోండి.. లేకపోతే, పెద్ద ప్రమాదమే..


ప్రైమరీ హైపర్ టెన్షన్ ఆరేళ్లు దాటిన పిల్లల్లోనే కనిపిస్తుంది. ఇది రావడానికి ప్రత్యేకమైన కారణాలంటూ ఏవీ ఉండకపోవచ్చు. కొంతమంది చిన్నారుల్లో ఇది వారసత్వంగా రావచ్చు. ఉప్పు ఎక్కువగా తినడం,  కొలెస్ట్రాల్ పెరగడం, శారీరక శ్రమ లేకపోవడం, ఊబకాయం వంటి కారణాల వల్ల ఈ పరిస్థితి ఎదురుకావచ్చు. సెకండరీ హైపర్ టెన్షన్ అనేది ఆరేళ్లలోపు పిల్లల్లో కనిపిస్తుంది. ఇది పిల్లల్లో వ్యాధులతో ముడిపడి ఉంటుంది. రక్త నాళాలు, కిడ్నీ సంబంధ వ్యాధులతో పోరాడుతున్న చిన్నారుల్లో బీపీ పెరగడాన్ని సెకండరీ హైపర్ టెన్షన్ అంటారు. పుట్టుకతోనే గుండె జబ్బులు ఉన్న చిన్నారులకు రక్తపోటు సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 

Easy weight loss tips: బరువు తగ్గాలని ఎన్నిరోజులుగా ప్రయత్నించినా కావడం లేదా? అయితే ఈ టిప్స్​ మీ కోసమే..


బీపీ హెచ్చుతగ్గులను ఎలా నిర్ధారణ చేయాలి?

పిల్లల్లో బీపీ సమస్యలు ఉన్నాయని భావిస్తే, బీపీ రీడింగులను కచ్చితంగా నిర్ధారణ చేయాలి. వారికి కేవలం ఒకసారి బీపీ టెస్ట్ చేసి రీడింగ్ తీస్తే చాలదు. కనీసం రెండు సార్లయినా పరీక్షించి, రెండుసార్లూ బీపీ ఎక్కువగా ఉంటేనే అధిక రక్తపోటు ఉందని భావించాలి. ఇలా వేర్వేరు రోజుల్లో కనీసం రెండు, మూడు సార్లు రీడింగ్ తీసి బీపీ కొలవాలి. అవసరమైతే ఆంబులేటరీ పరికరంతో రోజంతా బీపీ చెక్ చేయాలి.

Sleep tips: హాయిగా నిద్ర పట్టాలా? అయితే పడుకునే ముందు ఇలా చేయండి..



పిల్లల్లో హైబీపీ లక్షణాలు.. 

పెద్దల్లో కొన్ని లక్షణాల ద్వారా హై బీపీని గుర్తించవచ్చు. కానీ పిల్లల్లో లక్షణాలు గుర్తించడం కష్టం. హై బీపీ ఉన్న చిన్నారుల్లో ఛాతీలో నొప్పి, గుండె దడ, తిల తిప్పడం, పడుకుని లేచాక తలనొప్పి రావడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. కానీ వీటిని పిల్లలు తల్లిదండ్రులకు చెప్పగలగాలి. కనీసం ఏడాదికి కనీసం రెండుసార్లు పిల్లలకు బీపీ టెస్ట్ చేయించడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. సాధారణంగా పిల్లల్లో హైబీపీని గుర్తించినా.. వారికి మందులు ఇవ్వరు. ఆహార నియమాలు, వ్యాయామం, ఇతర జీవనశైలి మార్పులను సూచిస్తూ వారి బీపీని కంట్రోల్‌లో ఉంచమని చెబుతారు. అయితే ఏదైనా ఇతర అనారోగ్యం కారణంగా హైబీపీ వస్తే మాత్రం, దానికి తగిన చికిత్స అందిస్తారు.

Women Health: మొదటిసారి మెన్‌స్ట్రువల్ కప్‌ని ఉపయోగిస్తున్నప్పుడు మీరు అనుసరించాల్సినవి.. సంబంధించిన వీడియో..



పిల్లలకు బీపీ సమస్యలు రాకుండా పాటించాల్సిన జాగ్రత్తలు

తల్లిదండ్రులు తమ పిల్లలకు కూడా కొన్ని జీవనశైలి మార్పులను అలవాటు చేయాలి. పిల్లలకు ఇచ్చే ఆహారాల్లో ఉప్పు చాలా తక్కువగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉప్పు, చక్కెరలు, మసాలాలు ఎక్కువగా ఉండే ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్, చిప్స్ వంటివి పిల్లలకు అలవాటు చేయకూడదు. పిల్లలు అందించే ఆహారంలో తాజా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పొట్టుతీయని ఆహారధాన్యాలతో చేసే పదార్థాలు ఇవ్వాలి. వేపుళ్లు, మిఠాయిలను పరిమితంగా ఇవ్వాలి.

హై బీపీ ఉన్న పిల్లలకు చిరుతిళ్లు ఇవ్వడం ఆపేసి, రోజూ వ్యాయామం, యోగా వంటివి ప్రాక్టీస్ చేయిస్తే.. 90 శాతం మందికి మందుల అవసరం ఉండదు. ఆహారంలో మార్పులు చేస్తూ వ్యాయామం అలవాటు చేసినా పిల్లల్లో బీపీ అదుపులోకి రాకపోతే.. కొద్దిరోజుల తర్వాత మళ్లీ టెస్ట్ చేస్తారు. ఆ సమయంలో కూడా బీపీ ఎక్కువగానే ఉంటే, వైద్యులు కొన్ని రకాల మందులు సూచిస్తారు. ఈ మెడిసిన్‌తో పాటు ఆహార నియమాలు, వ్యాయామాలు సైతం తప్పనిసరిగా పాటించాలి. ఇలా ఆరు వారాల పాటు పరిశీలించి అవసరమైతే మందుల మోతాదు మారుస్తారు. మూడు నెలల తర్వాత మళ్లీ బీపీ కొలిచి, మందుల మోతాదు తగ్గించుకుంటూ వస్తారు. 

Diabetes: మధుమేహం ఎలా వస్తుంది? డయాబెటిస్​ పేషెంట్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?


వీరి విషయంలో అప్రమత్తత అవసరం

నెలలు నిండకముందే పుట్టిన పిల్లలు, తక్కువ బరువుతో పుట్టినవారు, పుట్టుకతోనే గుండెజబ్బులు ఉన్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాలి. చిన్నవయసులోనే క్యాన్లర్లు వచ్చిన పిల్లలు, ఫిట్స్‌తో బాధపడేవారు, మగతగా ఉన్నట్లు కనిపించే పిల్లలు, తరచుగా తలనొప్పులతో బాధపడే పిల్లలు, చూపు సమస్యలు ఉన్న పిల్లల బీపీని జాగ్రత్తగా పరిశీలిస్తూ, మెడికల్ చెకప్ చేయించుకోవాలి. వారిని తరచుగా పరీక్షించి, బీపీ సాధారణ స్థాయిలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. 

First published:

Tags: Blood pressure

ఉత్తమ కథలు