Health Tips : బీపి కరెక్ట్‌గా ఎంత ఉండాలో తెలుసా..

బీపీ చెకప్ చేసుకుంటారు. ఆ మెజర్‌మెంట్ ఎంత ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్లో చాలామందికి తెలియదు.. డాక్టర్స్ చెబితే తప్పా.. అలా కాకుండా హైబీపీ, లోబీపీ గురించి మీరే తెలుసుకోండి..

Amala Ravula | news18-telugu
Updated: June 16, 2019, 10:15 AM IST
Health Tips : బీపి కరెక్ట్‌గా ఎంత ఉండాలో తెలుసా..
లో బీపీకి చిట్కాలు
Amala Ravula | news18-telugu
Updated: June 16, 2019, 10:15 AM IST
ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్, మామూలుగా జనరల్ చెకప్‌కి వెళ్లగానే హాస్పటల్స్‌లో మొదటగా చేసేది బీపీ చెకప్. ఈ బీపీ ఆధారంగానే మనకు మిగతా టెస్టులుంటాయి. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే చాలామంది లోబీపీ అయింది అందుకే కళ్ళు తిరుగుతున్నాయి.. ఎవరైనా అరిస్తే హైబీపీ అంటుంటారు. సాధారణంగా 120/80 బీపీ ఉంటే నార్మల్ బీపీ అంటారు. ఈ మెజర్‌మెంట్‌కంటే ఎక్కువగా ఉన్నా.. తక్కువగా ఉన్నా ఆరోగ్యసమస్యలు తప్పవు. దీంతో బీపీ కంట్రోల్‌లో ఉంచుకునేందుకు ప్రయత్నించాలి. క్రమం తప్పకుండా బీపీ చెకప్ చేసుకుంటుండాలి.

అదేవిధంగా 140/90 ఉంటే హైపర్ టెన్షన్ ముందు దశ అంటారు. 140/90 కంటే ఎక్కువగా ఉంటే హైబీపీ ఉన్నట్లుగా అర్థం చేసుకోవాలి. బీపీ ఎప్పుడూ నార్మల్‌గా ఉండేలా చూసుకోవాలి. తక్కువైనా ఎక్కువైనా ఆరోగ్య సమస్యలు తప్పవు. బీపీ తక్కువగా ఉంటే కళ్ళు తిరగడం, చెమటలు పట్టడం, అలసటగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. అదేవిధంగా బీపీ ఎక్కువగా ఉంటే.. హార్ట్ స్ట్రోక్స్ ఇతర సమస్యలు వస్తాయి. కాబట్టి ఎప్పుడు కూడా బీపీ కంట్రోల్‌లో ఉంచుకోవాలి.

First published: June 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...