Home /News /life-style /

BLOATED STOMACH AFTER A BIG MEAL KNOW WAYS HOW TO AVOID IT UMG GH

Bloated Stomach: తిన్న తర్వాత కడుపు ఉబ్బరంగా అనిపిస్తోందా..? అయితే, ఈ పని చేయండి.. వెంటనే రిలీఫ్ వస్తుంది..!

తిన్న తర్వాత కడుపు ఉబ్బరంగా అనిపిస్తోందా..?

తిన్న తర్వాత కడుపు ఉబ్బరంగా అనిపిస్తోందా..?

పేగులలో గ్యాస్ (gas) ఏర్పడినప్పుడు పొత్తికడుపులో ఉబ్బరం ఏర్పడుతుంది. గ్యాస్‌ పేగుల్లో చేరడానికి (Trapped Gas) అనేక కారకాలు ఉన్నాయి. అందులో అతిగా తినడం (over eating), పేగు కదలికలలో మార్పులు, డీహైడ్రేషన్‌, మొదలైనవి ఉన్నాయి. వీటిలో కడుపు ఉబ్బరం (Bloating) అనేది చాలా సాధారణం.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
పేగులలో గ్యాస్ (gas) ఏర్పడినప్పుడు పొత్తికడుపులో ఉబ్బరం ఏర్పడుతుంది. గ్యాస్‌ పేగుల్లో చేరడానికి (Trapped Gas) అనేక కారకాలు ఉన్నాయి. అందులో అతిగా తినడం, పేగు కదలికలలో మార్పులు, డీహైడ్రేషన్‌, మొదలైనవి ఉన్నాయి. వీటిలో కడుపు ఉబ్బరం (Bloating) అనేది చాలా సాధారణం. ఎక్కువగా భోజనం తిన్న తర్వాత చాలా మందికి ఉబ్బరం, తిమ్మిరి, కడుపు నొప్పి, తేన్పు వంటివి ఎదురవుతాయి. మంచి ఆహారపు అలవాట్లలో మార్పులతో ఈ ఇంటర్నల్‌ సమస్యలను పరిష్కరించవచ్చు. ఇలాంటి సమస్యలకు చికిత్స తీసుకొనే ముందు ఉబ్బరానికి నిజమైన కారణాలను అర్థం చేసుకోవడం మంచిది.

* ఉబ్బరాన్ని నివారించే కొన్ని మార్గాలు ఇవే..

కారణం గుర్తించండి
లోపలికి పీల్చుకొనే గాలి, పెద్ద పేగులలో ఆహారం పులియడానికి అవకాశం కల్పించడం వంటి కారణాలతో ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్, మీథేన్ వంటి వాయువులు జీర్ణవ్యవస్థలోకి చేరుతాయి. పెరిగిన గ్యాస్ టెన్షన్, ఉబ్బరానికి దారితీస్తుంది. అధికంగా తినడం, మలబద్ధకం, లాక్టోస్ ఇంటోలరెంట్‌ వంటి వల్ల కూడా కావచ్చు.

ఫైబర్ కంటెంట్‌
భోజనం చేసిన వెంటనే పండ్లు తినడం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్ ఏర్పడుతుంది. అవి శుద్ధి చేసిన ఆహారాల కంటే ఆరోగ్యకరమైనవిగా ప్రచారం జరుగుతున్నా.. పండ్లలో కూడా జీర్ణం కాని కాంపౌండ్స్‌ అధిక మొత్తంలో ఉంటాయి. పండ్లు తిన్న తర్వాత జీర్ణం కాని ఫైబర్, చక్కెర పెద్ద పేగులలో స్టోర్‌ అవుతాయి. అక్కడ బ్యాక్టీరియా వాటిని పులియబెట్టి గ్యాస్ పెరగడానికి దారితీస్తుంది.

ఇదీ చదవండి:  ఈ డ్రింక్ తాగితే మిమ్మల్ని మీరే గుర్తు పట్టలేరు.. బరువు తగ్గుతూ, ఇమ్యూనిటీ పెంచే సూపర్ ఫుడ్..!!


వాటిని పరిమితం చేయాలి..
అధిక కొవ్వు ఉండే ఆహార పదార్థాలను తీసుకొంటే ప్రాసెస్ చేయడానికి సాధారణ ఆహారం కంటే ఎక్కువ సమయం పడుతుంది. కొవ్వు పదార్ధాలు ఎక్కువగా తింటే, పొట్ట సాగడానికి, కడుపులో గ్యాసెస్‌కు, ఉబ్బరానికి దారి తీస్తుంది. ఎలాంటి కొవ్వు పదార్థాలు తీసుకుంటున్నారనే అంశంపై దృష్టి ఉంచాలి. ఎక్కువ ఉప్పు, వేయించిన, శుద్ధి చేసిన ఆహార పదార్థాలు తీసుకోవడం పరిమితం చేయాలి. అవి పొట్టకు ఎక్కువ సమస్యలను తీసుకువస్తాయి.

మలబద్ధకం నుంచి ఉపశమనం
పేలవంగా జీర్ణమయ్యే కాంపౌండ్స్‌ కారణంగా కడుపు ఉబ్బరం ఎదురవుతుంది. కాబట్టి కరిగే ఫైబర్ ఉండే పదార్థాలను ఆహారంలో తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా, నెమ్మదిగా తినడం, తగినంత మొత్తంలో లిక్విడ్స్‌ తాగడం, 18-30 గ్రాముల ఫైబర్ తీసుకోవడం ద్వారా సమస్య తగ్గుతుంది.



గాలి తీసుకోకుండా..
తినేటప్పుడు గాలిని మింగడాన్ని ఏరోఫాగియా అని పిలుస్తారు. ఇలా పీల్చిన గాలి త్వరగా తొలగిపోతుంది లేదా శరీరం గ్రహిస్తుంది. కాబట్టి ఇది ఉబ్బరం కంటే తేన్పును కలిగిస్తుంది. చూయింగ్ గమ్ నమలడం ఒక వ్యక్తి ఎక్కువ గాలిని తీసుకునేలా చేస్తుంది. కాబట్టి నోరు తెరిచి లేదా మాట్లాడేటప్పుడు నమలడం మానుకోండి.

ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం, పేగు కదలికను ప్రోత్సహించడం, లిక్విడ్స్‌ ఎక్కువగా తాగడం, జంక్ లేదా కొవ్వు పదార్థాలను నివారించడం, నెమ్మదిగా నమలడం ఉబ్బరం నివారించడానికి ఉత్తమ మార్గాలు. పరిస్థితి తీవ్రంగా ఉన్న సమయాల్లో వైద్యుడిని సంప్రదించాలి.
Published by:Mahesh
First published:

Tags: Food, Gas, Health, Health care

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు