Home /News /life-style /

BIRYANI TOP IN THE LIST OF MOST ORDERED DISH IN 2020 REVEALS ZOMATO SURVEY AK GH

Biryani: ఎవరెన్ని చేసినా.. బిర్యానీనే బాద్ షా.. సర్వేలో వెల్లడి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Most Ordered Dish: 2020 సంవత్సరంలో జొమాటో (Zomato) ప్లాట్‌ఫామ్‌పై ఎక్కువ మంది ఆర్డర్‌ చేసిన వంటకంగా బిర్యానీ నిలిచింది. భారతదేశంలో ప్రతి 20 నిమిషాలకు ఒక బిర్యానీ డెలివరీ జరిగిందని జొమాటో పేర్కొంది.

కరోనావైరస్ (Coronavirus ) మహమ్మారి నియంత్రణలో భాగంగా భారత్తో సహా దాదాపు అన్ని దేశాలు లాక్‌డౌన్ పాటించాయి. దీనితో అన్ని రెస్టారెంట్లు, హోటళ్లు మూతపడ్డాయి. ఒకవైపు కరోనా భయం, మరోవైపు లాక్‌డౌన్ నిబంధనలు వెరసి ఫుడ్డెలివరీ యాప్లను విచ్చలవిడిగా వాడారు ప్రజలు. చికెన్ తింటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. దీంతో కరోనా రాదన్న ప్రచారంతో ప్రజలు చికెన్(chicken) ఎగబడి తిన్నారు. ఇక హైదరాబాద్ నగర ప్రజలు అమితంగా ఇష్టపడే చికెన్ బిర్యానీకి ఆర్డర్లకైతే లెక్కేలేదు. ఈ ఆర్డర్లిప్పుడు కొత్త రికార్డులను సృష్టించాయి. 2020లో ప్రజల ఆహారపు అలవాట్లను అంచనా వేసేందుకు జొమాటో, స్విగ్గీ వంటి ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థల సర్వే చేపట్టాయి.

ఈ సర్వేలో ప్రకారం లాక్‌డౌన్ ప్రారంభంలో అనగా మార్చి 15 నుండి ఏప్రిల్ 16 మధ్య, జోమాటో కస్టమర్ల సంఖ్య 46.3 నుండి 41.7కు పడిపోగా, ఇదే కాలంలో స్విగ్గి కస్టమర్ల సంఖ్య 48.8 నుండి 42.4 వరకు పడిపోయింది. కాగా, కరోనా వైరస్ చుట్టూ ఉన్న భయాందోళనల నేపథ్యంలో స్విగ్గి(Swiggy), జోమాటో(Zomato) సంస్థలు -కాంటాక్ట్ లెస్ డెలివరీ సేవలను అందించాయి. డెలివరి సిబ్బంది కరోనా నిబంధనలకు పాటిస్తూ తమ సేవలను అందించారు. దీంతో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలు క్రమంగా పెరిగాయి.

జోమాటో సర్వే ప్రకారం న్యూఢిల్లీ(Delhi), బెంగళూరు(Bengaluru), పూణే(Pune) వంటి నగరాలకు చెందిన ప్రజలు జోమాటో(Zomato)లో 2.5 మిలియన్ల మోమోలను ఆర్డర్ చేశారు. మోమోలను ఎక్కువగా ఆర్డర్ చేసిన నగరంగా ఢిల్లీ అగ్రస్థానంలో నిలిచింది. అయితే, చైనా వుహాన్(Wuhan)లోని నాన్వెజ్ మార్కెట్లో గబ్బిలాల నుండి కరోనా వైరస్ మహమ్మారి వ్యాపించిందని వార్తలు వచ్చిన నేపథ్యంలోనూ బాట్ సూప్ ఆర్డర్ కోసం దాదాపు 414 మంది సెర్చ్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉండగా 2020 సంవత్సరంలో జొమాటో (Zomato) ప్లాట్‌ఫామ్‌పై ఎక్కువ మంది ఆర్డర్‌ చేసిన వంటకంగా బిర్యానీ నిలిచింది. భారతదేశంలో ప్రతి 20 నిమిషాలకు ఒక బిర్యానీ డెలివరీ జరిగిందని జొమాటో పేర్కొంది. బెంగళూరుకు చెందిన ఒక వ్యక్తి 1,380 చికెన్ బిర్యానీ ఆర్డర్లు ఇచ్చాడని అనగా సదరు కస్టమర్ ప్రతి రోజూ 4 ఆర్డర్లు చేశాడని సర్వే స్పష్టం చేసింది.

స్విగ్గీలో ప్రతి సెకనుకో బిర్యానీ ఆర్డర్..
2020 ఏడాది మొత్తంలో జోమాటో(Zomato)లో అతి ఎక్కువ ఆర్డర్ విలువ రూ.1,99,950కాగా, అతి తక్కువ ఆర్డర్ విలువ రూ.10గా ఉంది. అదేవిధంగా ఈ ఏడాది మొత్తం 1,988,094 వెజ్ బిర్యానీ ఆర్డర్లు వచ్చినట్లు జొమాటో తన నివేదికలో పేర్కొంది. ఇక, జొమాటో లాగే ప్రసిద్ది చెందని ఆన్‌లైన్ డెలివరీ సంస్థ స్విగ్గి కూడా ఈ ఏడాది భారీ ఆర్డర్లను నమోదు చేసింది. స్విగ్గీ(Swiggy )లో ప్రతి సెకనుకు ఒకటి కంటే ఎక్కువ బిర్యానీ(Biryani )లను ఆర్డర్లు వచ్చాయి.

ఈ ఏడాది కొత్తగా లాగిన్ అయిన మూడు లక్షల మంది నూతన కస్టమర్లు తమ తొలి ఆర్డర్ను చికెన్ బిర్యానీ(chicken biryani)గా ఎంచుకోవడం గమనార్హం. "జనవరి, మార్చి నెలల మధ్య వర్కింగ్ అడ్రస్లలో జరిగిన డెలివరీలతో పోలిస్తే 'హోమ్' అడ్రస్లలో డెలివరీలు 5 రెట్లు ఎక్కువగా నమోదయ్యాయి. ఆ సంఖ్య ఏప్రిల్, మే నెలల్లో 9 రెట్లకు పెరిగింది" అని స్విగ్గీ తన నివేదికలో స్పష్టం చేసింది. స్విగ్గీలో బిర్యానీతో పాటు టీ, కాఫీ, పానీపూరీ వంటి వాటికి కూడా భారీగా ఆర్డర్లు వచ్చాయి.
Published by:Kishore Akkaladevi
First published:

Tags: Biryani, Zomato

తదుపరి వార్తలు