దేశంలో బర్డ్ ఫ్లూ వేగంగా వ్యాప్తి చెందుతుంది. బర్డ్ ఫ్లూ నేపథ్యంలో చికెన్ వినియోగంపై మాంసప్రియులను రకరకాలు ప్రశ్నలు వేధిస్తున్నాయి. ఇలాంటి సమయంలో చికెన్ తినొచ్చా.. చికెన్ తింటే ఏమైనా సమస్యలు వస్తాయా అంటూ ఆరా తీస్తున్నారు. అయితే గుడ్లు, చికెన్, ఇతర పౌల్ట్రీ ఉత్పత్తులను సరిగ్గా ఉడికించి తీసుకుంటే ఎలాంటి ప్రమాదం ఉండదని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (FAO), ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గతంలోనే వెల్లడించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ రకరకాలు ప్రశ్నలు పుట్టుకొస్తునే ఉన్నాయి. అలాంటి వాటిలో మైక్రో ఓవెన్లో వండిన చికెన్ సురక్షితమైనదేనా?, కాదా? అనే ప్రశ్న కూడా ప్రముఖంగా వినిపిస్తోంది.
దీనికి సమాధానం చెబుతున్న నిపుణులు మైక్రో ఓవెన్లో వండిన చికెన్, గుడ్లు తినకపోవడమే మంచిందని అంటున్నారు. మైక్రో ఓవెన్లో మాంసం సరిగా ఉడకకపోవడమే కారణమని వారు అంటున్నారు. గ్యాస్ స్టవ్ మీద సరిగా ఉడికించిన చికెన్‌ను మాత్రమే తినాలని సూచిస్తున్నారు. కేంద్ర పశుసంవర్దక, పాడి పరిశ్రమ శాఖ కూడా ఇదే రకమైన సమధానాన్ని వెల్లడించింది.
"వైరస్‌ను క్రియారహితం చేయడానికి పౌల్ట్రీ ఉత్పత్తులను 70 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద 30 నిమిషాల పాటు ఉండికించాల్సి ఉంటుంది. అప్పుడే గుడ్లు, చికెన్ సరిగా ఉడికి సురక్షితమైనవిగా మారతాయి. మంచి శుభ్రత పాటించి, సరైన విధంగా వండుకుని ఎప్పటిలాగే పౌల్ట్రీ ఉత్పతులును తినొచ్చు. బర్డ్ ఫ్లూ బయటపడ్డ ప్రాంతాల్లో కూడా చికెన్, గుడ్లను సరైన విధంగా ఉడికించి తీసుకుంటే ఎలాంటి వైరస్ సంక్రమించదు"అని కేంద్ర పశుసంవర్థక, పాడిపరిశ్రమ శాఖ తెలిపింది. అలాగే బర్డ్ ఫ్లూ వ్యాప్తి ఉన్న ప్రాంతాల్లో పౌల్ట్రీ ఉత్పత్తులను ముట్టుకున్న వారు తమ చేతులను బాగా శుభ్రపరుచుకోవాలని సూచించింది. పౌల్ట్రీ ఉత్పత్తులతో సంబంధం ఉన్న ఉపరితలాలను జాగ్రత్తగా శుభ్రపరచాలని.. అందుకే వేడి నీరు సరిపోతుందని తెలిపింది. ఇప్పటివరకు ఇండియాలో మనుషుల్లో బర్డ్ ఫ్లూ లక్షణాలు నిర్దారణ కాలేదని వెల్లడించింది.
ప్రజలు ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద పౌల్ట్రీ ఉత్పత్తులను ఉడికించి తీసుకోవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇదివరకే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వం, ఆరోగ్య సంస్థలు ఎన్ని రకాలుగా చెప్పిన కొందరు మాత్రం.. బర్డ్‌ఫ్లూతో ఎందుకొచ్చిన గొడవ అనుకుంటూ చికెన్ జోలికి వెళ్లట్లేదు. దీంతో బర్డ్ ఫ్లూ ప్రభావిత రాష్ట్రాల్లోనే కాకుండా, మిగిలిన రాష్ట్రాల్లో కూడా చికెన్ ధరలు, అమ్మకాలు పడిపోయాయి.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.