Egg Recipes: గుడ్లతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. ఈ 5 వంటకాలను ఒక్కసారి ట్రై చేయండి..

ప్రతీకాత్మక చిత్రం

గుడ్లు భారతీయ వంటశాలలో కనిపించే అత్యంత సాధారణ ఆహార పదార్థం.

  • Share this:
గుడ్లు భారతీయ వంటశాలలో కనిపించే అత్యంత సాధారణ ఆహార పదార్థం. వీటిలో ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, మంచి కొలెస్ట్రాల్, అమైనో ఆమ్లాలు, ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు వంటి విలువైన పోషక పదార్థాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవన్నీ గుడ్లకు ఎంతో రుచిని అందిస్తాయి. వాస్తవానికి గుడ్లలోని పచ్చసొన భాగంలో లెసిథిన్ ఉంటుంది. ఇది హైడ్రేషన్ను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. అయితే, గుడ్లు కేవలం శారీరక బలానికే కాకుండా.. చర్మానికి కూడా అనేక రకాల ప్రయోజనాలను అందిస్తుంది. గుడ్లలోని తెల్లసొన చర్మం ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి, హానికరమైన చర్మ సమస్యలను దూరం చేయడానికి సహాయపడుతుంది. మాంసం కంటే అత్యంత చౌకగా లభించే గుడ్లతో నోరూరించే ఆహార పదార్థాలే కాదు, సాయంత్ర పూట స్సాక్స్ కూడా తయారు చేసుకోవచ్చు. గుడ్లతో సాధారణంగా చేసే క్రింది 5 సాంప్రదాయ వంటకాలను పరిశీలించండి.

గుడ్డు భజ్జీ
గుడ్డు భజ్జీని తయారుచేయడం చాలా సులభం. మీ ఇంట్లోని కుటుంబ సభ్యుల సంఖ్యను బట్టి, రెండు, మూడు లేదా అంతకంటే ఎక్కువ గుడ్లను ఆ గుడ్లను మధ్యలో కోసి దానిలో జీలకర్ర, కరివేపాకు, తరిగిన ఉల్లిపాయలు, టమోటాలు లేదా క్యాప్సికమ్లను జతచేసి గిన్నెలో వేయించండి. వీటి పైన మసాలా దినుసులు, నల్ల మిరియాలు, తాజాగా తరిగిన కొత్తిమీర, ఉప్పు వేసి తీసుకోండి.

గుడ్డు కూర
ఈ వంటకాన్ని 10 నిమిషాల పాటు ఉడకబెట్టడం ద్వారా తయారు చేస్తారు. గుడ్లను ఉడికించి, సాధారణంగా నూనెలో గోధుమ రంగు వచ్చే వరకు వేయించాలి. వాటిని ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి, టమోటాలు, పసుపు, గ్రౌండ్ మసాలా దినుసుల మిశ్రమంతో ఉడికించిన బాణీలో వేసి కలపాలి. మరింత రుచి కోసం ఉప్పు, చక్కెర కలుపుకోండి.

గుడ్డు ఆమ్లెట్ కూర
ముందుగా గుడ్లను పగలగొట్టి ఒక గిన్నెలోకి తీసుకొని ఆ మిశ్రమంలో ఉల్లిపాయలు, కారం జోడించి కలపాలి. ఆ త్వార్వాత దాన్ని వేయించి ఆమ్లెట్లా తయారు చేయాలి. ఆ ఆమ్లెట్ను సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి. పైన పేర్కొన్న విధంగా గుడ్డు కూరను సిద్ధం చేసి, దానిపై ఈ గుడ్డు ముక్కలను వేయాలి. ఆపై కరివేపాకు ముక్కలను కూడా దీనిలో జోడించండి. ఐదు నిమిషాలు ఉడికించి, తింటే రుచికరమైన గుడ్డు ఆమ్లెట్ కూర సిద్ధమవుతుంది.

గుడ్డు మలైకారి
పసుపు పొడిని జోడించి ఉడికించిన గుడ్లను బంగారు- ఎరుపు రంగు వచ్చేవరకు వేయించాలి. మరో బాణీలో తరిగిన ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, లవంగాలు, టమోటాలు, పచ్చిమిర్చితో పాటు జీలకర్ర పొడి, కొత్తిమీర పొడి, బే ఆకు, సుగంధ ద్రవ్యాలను నూనెలో వేసి వేయించాలి. ఈ మిశ్రమానికి నీరు, కొబ్బరి పాలు, ఉడికించిన గుడ్లు వేసి మరో ఐదు నిమిషాల పాటు ఉడికించాలి. రుచి కోసం కూర మీద కొద్దిగా రోజ్ వాటర్ చల్లాలి. ఇక రుచికరమైన గుడ్డు మలైకారి సిద్ధమవుతుంది.

గుడ్డు బోండా
గుడ్డు బోండాను గుడ్డు బజ్జీ లేదా గుడ్డు పకోరా అని కూడా అంటారు. మొదట గుడ్లను ఉడికించి, వాటిని సగానికి కట్ చేయాలి. దానిలో బియ్యం పిండి, జీలకర్ర, నల్ల మిరియాలు పొడి, తరిగిన మిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, నీరు వంటివి జతచేయాలి. ఈ విశ్రమాన్ని బంగారు గోధుమ రంగులోకి వచ్చే వరకు వేడి నూనెలో బాగా వేయించాలి. దీంతో రుచికరమైన గుడ్డు బోండా సిద్ధమవుతుంది.
Published by:Sumanth Kanukula
First published: