Home /News /life-style /

BEWARE THESE SYMPTOMS ON FOOT ALSO LEADS TO DIABETES RNK

Diabetes symptoms: జాగ్రత్త! పాదాలపై ఈ లక్షణాలు కనిపిస్తే కూడా మధుమేహం సంకేతమే కావచ్చు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Symptoms of diabetes: శరీరంలో ఎలాంటి లక్షణాలు కనిపించినా వెంటనే వైద్య సలహా తీసుకుని, చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం

Diabetes symptoms: మారుతున్న లైఫ్ స్టైల్, పౌష్టికాహారం, వ్యాయామం లేకపోవడం, ఒత్తిడి తదితర కారణాల వల్ల మధుమేహం (Diabetes) వస్తుంది. దీని బారిన పడిన వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. భారతదేశంలో అత్యధికంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. ఇది ఒక క్లిష్టమైన ,తీవ్రమైన వ్యాధిగా పరిగణిస్తున్నారు. డయాబెటిస్ గుండె, మూత్రపిండాలు, నరాల, కంటి ,ఇతర రుగ్మతలకు దారి తీస్తుంది. అందుకే ఈ వ్యాధిలో సకాలంలో రోగ నిర్ధారణ ,చికిత్స ముఖ్యమైనవి. డయాబెటిస్ నిర్ధారణ అయిన తర్వాత రక్తంలో చక్కెర (Blood sugar) ను నియంత్రించాలి. మధుమేహాన్ని నియంత్రించడానికి పోషకమైన ,క్రమమైన ఆహారం, వ్యాయామం అవసరం. చూపు మందగించడం, శుక్లాలు, గాయాలు త్వరగా మానకపోవడం, అలసట, తరచుగా తలనొప్పి, రోగనిరోధక శక్తి బలహీనపడడం, హృదయ స్పందన రేటు నిరంతరం పెరగడం, తరచుగా మూత్రవిసర్జన చేయడం మధుమేహం లక్షణాలు. ఇప్పుడు, కొత్త పరిశోధన ప్రకారం, కాళ్ళపై 3 రకాల లక్షణాలు ఉంటే అది కూడా మధుమేహానికి సంకేతంగా అయి ఉండవచ్చు. ఎలాంటి లక్షణాలు కనిపించినా వెంటనే వైద్య సలహా తీసుకుని, చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం.

ఇది కూడా చదవండి: Summer hacks: వేసవిలో మీ ఇంటిని చల్లగా ఉండేలా చేసే బడ్జెట్ హక్స్...



మధుమేహం అనేది జీవితాంతం మీ వెంటే ఉండే వ్యాధి. డయాబెటిస్‌ ఉన్నప్పుడు శరీరం తగినంత ఇన్సులిన్‌ను తయారు చేయదు లేదా శరీరం ఇన్సులిన్‌ను ఉపయోగించదు. మధుమేహం అత్యంత సాధారణ లక్షణాలు బాగా తెలిసినవి. ఇప్పుడు పాదాల్లో కూడా మధుమేహం లక్షణాలు కనిపిస్తున్నాయని పరిశోధనల్లో తేలింది. మధుమేహం ఉన్న రోగులు కోతలు, బొబ్బలు, ఎర్రటి మచ్చలు, వాపు ,గోళ్ళపై శ్రద్ధ వహించాలి. ఎందుకంటే ఇవి మధుమేహం లక్షణాలను కూడా అయి ఉండవచ్చు. టైప్ 1 డయాబెటిస్‌లో ప్యాంక్రియాస్ ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయదు. టైప్ 2 డయాబెటిస్‌లో శరీరంలోని కణాలు ఇన్సులిన్ నిరోధకతను కలిగి ఉంటాయి. అందువల్ల, రక్తంలో చక్కెర స్థాయిలను సాధారణంగా ఉంచడానికి ఎక్కువ ఇన్సులిన్ అవసరం. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోకపోతే అది ప్రాణాంతకం కావచ్చు.

ఇది కూడా చదవండి: 7 tips for kids healthy hair: మీ పిల్లల జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి 7 చిట్కాలు..



NHS ప్రకారం మీరు ఇంట్లోనే మధుమేహాన్ని తగ్గించుకోవాలంటే మీ రక్తంలో చక్కెర భోజనానికి ముందు 4 -7 mmol/ l ఉండాలి. భోజనం తర్వాత రెండు గంటల తర్వాత 8.5 -9 mmol / l కంటే తక్కువగా ఉండాలి. పాదాలపై కూడా మధుమేహం లక్షణాలు కనిపిస్తాయని పరిశోధనల్లో తేలింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డయాబెటిస్ అండ్ డైజెస్టివ్ అండ్ కిడ్నీ డిసీజ్ ప్రకారం మధుమేహం ఉన్న ప్రతి రోగి పాదాలను జాగ్రత్తగా చూసుకోవాలి. కాళ్లలో ఏవైనా మార్పులను గమనించినట్లయితే మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. పాదాలపై ఎరుపు, లేదా పాదాలలో వాపు ఉంటే దీర్ఘకాలిక అనియంత్రిత రక్తంలో చక్కెర లేదా అధిక రక్తంలో చక్కెరకు సంకేతం. చార్కోట్స్ ఫుట్ అనే వ్యాధి వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది . అందువల్ల, ఈ పరిస్థితికి కారణాన్ని తెలుసుకోవడానికి వెంటనే వైద్య సలహా తీసుకోవడం చాలా ముఖ్యం.
Published by:Renuka Godugu
First published:

Tags: Diabetes

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు