మీ పిల్లలకు పసితనం నుండే మంచి పోషకాహారం అందించినట్లయితే అది మంచి ఆరోగ్యం మరియు అభివృద్ధికి సహకరిస్తుంది. సరైన పోషకాహారం అందించడం లేదా పోషకాహార లోపాలను సరిచేయడం అనేది చాలా ముఖ్యం, ఎందుకంటే పిల్లలకు మంచి లక్షణాలు నేర్పించడాకి ఇదే మంచి సమయం. పెద్దవారి మాదిరిగానే, పిల్లలు కూడా తమకు ఇస్టమైన అహారం తినడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కొన్నిసార్లు వారు అత్యంత ప్రీతితో ఎంచుకున్న ఆహారం, మిగతావాటికంటే అంత ఆరోగ్యకరమైనది కాకపోవచ్చు. పిలల్లు కూరగాయలు తింటున్నప్పటికీ, సమతుల్య ఆహారానికి సరిపడే పదార్థాలన్ని అందులో ఉండకపోవచ్చు. కేవలం సమయానికి సరైన ఆహారాన్ని అందించటమే కాకుండా, వారిలో మంచి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తూ, దీర్ఘకాలికంగా వారికి మంచి ఆహారపు అలవాట్లను, ఆరోగ్యాన్ని అందించే బాధ్యత తల్లిదండ్రులుగా మరియు సంరక్షకులుగా మీకు మాత్రమే ఉంటుంది.
ఇది స్వల్పకాలికంగా అనారోగ్యాలు, అంటువ్యాధులను సమర్థవంతంగా ఎదుర్కునే రోగనిరోధక శక్తిని కలిగి ఉంటూ, స్థిరమైన మనోభావాలను, శరీరానికి మంచి శక్తి-సామర్థ్యాలను అందిస్తుంది. అలాగే దీర్ఘకాలికంగా, పిల్లలు తగినంత పొడవు పెరగడానికి, మంచి BMI ఇండెక్సెస్, అద్భుతమైన జ్ఞాపకశక్తి మరియు చదువులో కూడా ముందుండడానికి ఉపయోగపడుతుంది.
మంచి పోషణ అంటే ఏమిటి?
పుట్టినప్పటి నుండి యుక్తవయస్సు వచ్చే వరకు, పిల్లల శరీరాలు ఎప్పటికప్పుడూ వేగంగా మారుతూనే ఉంటాయి. దానితో పాటు, వారికి కావలసిన మాక్రోన్యూట్రియెంట్స్ (కార్బోహైడ్రేట్, ప్రోటీన్ మరియు కొవ్వు) మరియు మైక్రోన్యూట్రియెంట్స్ (విటమిన్లు మరియు మినరల్స్) వంటి అవసరాలు కూడా మారుతాయి. తగినంత పోషకాహారం, వారి శరీరానికి పనిచేయడానికి అవసరమైన శక్తి, ఆహారపానీయాల సమతుల్యతను అందిస్తుంది. పిల్లల ఆహారంలో ఎక్కువగా బయటి చిరుతిళ్ళు , చల్లటి పానీయాలు మరియు మిఠాయిలు ఉంటే, మీ పిల్లల బుజ్జి కడుపు నిడడం సుళువే కాని శరీరానికి కావలసిన పోషకాల లోటు మాత్రం అలాగే ఉంటుంది. వారు తినే ఆహారంలో పదార్థాలు అన్ని ఇలాగే ఉంటే వారికి మాత్రం బహుశా ఏం తెలుస్తుంది వారికి తగినన్ని పోషకాలు అందుతున్నాయా లేదా అని?
అన్స్ప్లాష్ లో Johnny McClung ఫోటో
తగినంత పోషణ అందుతుందని ఎలా నిర్ధారించాలి.
మీ కుటుంబం సాధరణంగానే అనేక రకాల పండ్లు మరియు కూరగాయలతో నిండిన సమతుల్య ఆహారాన్ని తీసుకుంటే, మీరు గణనీయమైన మార్పులు చేయవలసిన అవసరం లేదు. కాని ఒకవేళ మీ కుటుంబం ఆహార పద్దతులు మీరు కోరుకున్నంత ఆరోగ్యకరమైనవిగా లేకపోతే కనీసం మీపిల్లల ఆహారపు అలవాట్లను మార్చాలసిన అవసరం ఎంతైనా ఉంది!
మీ పిల్లలను వారి ఆకలి తీరేవరకు తినడానికి ప్రోత్సహించండి, మీ పిల్లల పోషకాహారంలో భాగంగా చక్కెర లేకుండా అదనపు ఆరోగ్య పానీయం వంటి ప్రత్యామ్నాయ ఆహరాన్నీ కూడా అందిస్తూ, ప్రతిరోజూ కొత్తగా ప్రారంభించండి.
పిల్లలు ఆహారంతో సానుకూల సంబంధాన్ని కలిగి ఉన్నట్లయితే, వారు జీవితాంతం ఆహారం తీసుకునే విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఎదురవవు, కానీ సరైనమార్గాన్ని కనుక్కోవడమే పెద్ద ప్రశ్న.
ఎదిగే పిల్లలైన రెండు నుండి ఐదు సంవత్సరాల మధ్యగల వయస్సు వారికోసం ప్రత్యేకంగా రూపొందించిన రుచికరమైన,పుష్కలమైన పోషకాలతో కూడిన vanilla flavour క్రీము గల పాలు NANGROW.
మీ పిల్లల పోషకాహారానికి తోడ్పడే ఆరోగ్యకర పానీయం. Nestle NANGROW అనేది పుష్కలమైన పోషకాలతో కూడిన పానీయం, పిల్లల పెరుగుదలకు మరియు అభివృద్ధికి సహాయపడే అవసరమైన పోషకాలను కలిగి ఉంటుంది.
DHA సాధారణంగా మెదడు అభివృద్ధికి దోహదం చేస్తుంది
ఐరన్ & అయోడిన్ సాధారణ అభిజ్ఞా వికాసానికి తోడ్పడతాయి
విటమిన్ ఎ, సి, ఐరన్, సెలీనియం వంటి రోగనిరోధక పోషకాలు సాధారణ రోగనిరోధక వ్యవస్థ పనితీరుకు సహాయపడతాయి
సులభంగా జీర్ణమై, గ్రహించబడే అన్ని ముఖ్యమైన అమైనో ఆమ్లాలకు ప్రోటీన్ మూలం.
చివరగా అందరు గుర్తుపెట్టుకోవలసిన అంశం ఏమిటంటే, చిన్నతనంలోనే మంచి పోషకవిలువలు ఎంపిక చేసి, వాటి ప్రాముఖ్యతను పిల్లలకు తెలియజేసే వారి పిల్లలు పూర్తి ఆరోగ్యాన్ని కలుగి ఉండడమే కాకుండా వారికి ఆకాశమే హద్దుగా ఉంటుంది.
పెరిగే పిల్లల కోసం రుచికరమైన క్రీము గల vanilla పాల పానీయం : Nestlé NANGROW
గురించి మరింత చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
ఇది భాగస్వామ్య పోస్ట్.
మూలాలు:
https://novakdjokovicfoundation.org/importance-nutrition-early-childhood-development/
https://www.nangrow.in/health-nutrition/right-nutrition-kids
https://www.hopkinsmedicine.org/news/articles/childhood-obesity-a-focus-on-hypertension
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.