HealthTips: గ్రీన్ టీ ఏ టైమ్‌లో తాగితే మంచిదంటే..

గ్రీన్ టీ ఆరోగ్యానికి ఎంతో మంచిది. అయితే, ఎప్పుడు పడితే అప్పుడు గ్రీన్ టీ తాగితే ఆరోగ్యం సంగతి అటుంచి.. అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నవారవుతారు. అదెప్పుడో తెలుసుకోండి..

Amala Ravula | news18-telugu
Updated: June 21, 2019, 4:51 PM IST
HealthTips: గ్రీన్ టీ ఏ టైమ్‌లో తాగితే మంచిదంటే..
గ్రీన్ టీ ఏ సమయంలో తీసుకుంటే మంచిదంటే..
Amala Ravula | news18-telugu
Updated: June 21, 2019, 4:51 PM IST
అందరికీ ఈ మధ్యకాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగింది. ఏవి తినాలి? ఏం తాగాలి అంటూ ఆరోగ్య ప్రయోజనాలను వెతికిపట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే గ్రీన్ టీ ఇప్పుడు బాగా పాపులర్ అయింది. దీన్ని తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తేలడంతో ప్రతీ ఒక్కరూ గ్రీన్ టీ తాగుతున్నారు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు, అందమైన చర్మం కావాలనుకునేవారు గ్రీన్ టీని ఇష్టంగా తాగి ప్రయోజనాలు పొందుతున్నారు. అయితే, మంచిది కదా అని ఎప్పుడు పడితే అప్పుడు తాగకూడదు. అలా చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి.

ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగితే అందులోని కెఫీన్, టానిన్స్ జీర్ణక్రియపై తీవ్రప్రభావం చూపుతుంది, గ్యాస్ట్రిక్ సమస్యలు ఏర్పడతాయి. అదే విధంగా పడుకునే ముందు కూడా గ్రీన్ టీ తీసుకోకూడదు.. ఇందులోని అమినో యాసిడ్స్ కండరాలను ఉత్తేజపరిచి నిద్రపోకుండా ప్రేరేపిస్తాయి.
ఇదే కాకుండా రోజుకి 2 కప్పుల మించి గ్రీన్ టీ తాగితే.. అది శరీరంపై నెగెటీవ్ ప్రభావాన్ని చూపిస్తుంది.

గ్రీన్ టీ ఎప్పుడు కూడా భోజనానికి అరగంట ముందు.. భోజనం తర్వాత రెండు గంటల తర్వాత తీసుకోవడం వల్ల చక్కని లాభాలుంటాయని చెబుతున్నారు నిపుణులు. అదే విధంగా, ఎక్సర్‌సైజ్ చేసేవారు.. ముందు తీసుకుంటే వర్కౌట్స్ ఎక్కువసమయం చేస్తారు.



ఇవికూడా చదవండి..

గుడిలో నివేదన సమయంలో దేవుడిని చూడకుండా పరదా ఎందుకు వేస్తారంటే..
First published: June 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...