సెలెనియం పోషకాన్ని ఎక్కువగా కలిగివున్న బ్రెజిల్ నట్స్ వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇవి మన శరీరంలో మంటలు, వాపులు, నొప్పులను తగ్గిస్తాయి. వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. గుండెను కాపాడతాయి. చర్మానికి రక్షణ కల్పిస్తాయి. అధిక బరువును తగ్గిస్తాయి. టెన్షన్ నుంచీ ఉపశమనం కలిగిస్తాయి. వీటిని తింటే జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. మగాళ్లలో స్పెర్మ్ కౌంట్ పెరిగేందుకు కూడా ఇవి దోహదపడతాయి. బ్రెజిల్ నట్స్‌ని సైంటిఫిక్‌గా బెర్థోల్లెషియా ఎక్సెల్సా అని పిలుస్తున్నారు. వీటిలో పోషకాలు చాలా ఎక్కువ. తినేందుకు మంచి రుచి కలిగివుంటాయి. దక్షిణ అమెరికాలోని బ్రెజిల్ అడవుల్లో ఓ జాతి చెట్టు నుంచీ వీటిని పండిస్తున్నారు. అందుకే వీటిని బ్రెజిల్ నట్స్ (బ్రెజిల్ గింజలు లేదా బ్రెజిల్ పప్పులు) అని పిలుస్తున్నారు. ప్రస్తుతం వీటిని బ్రెజిల్‌తోపాటూ... దక్షిణ అమెరికాలోని వెనిజులా, కొలంబియా, పెరూలో కూడా పండిస్తున్నారు. మిగతా ఖండాల్లో కూడా వీటిని పండించే ప్రక్రియ మొదలైంది.
బ్రెజిల్ నట్స్ తింటే ఆరోగ్య ప్రయోజనాలు :
1. బ్రెజిల్ నట్స్‌లో ఉండే సెలెనియం అనే పోషకం... మన శరీరానికి ఎంతో అవసరం. దాని వల్ల విషపూరిత వ్యర్థాలు మన శరీరంలోకి రాకుండా ఉంటాయి. బాడీని చల్లగా ఉంచడంలో సెలెనియం ఉపయోగపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మంది సెలెనియం కొరతతో బాధపడుతున్నారు.
2. బ్రెజిల్ నట్స్ చెడు కొలెస్ట్రాల్ అంతు చూసి... మంచి కొవ్వును పెంచి, గుండెను కాపాడతాయి. మనకు ఎంతో అవసరమైన ఒమేగా-3 ఫ్యాట్టీ యాసిడ్స్ ఈ పప్పుల్లో ఉంటాయి. ఈ గింజల్లో ఉండే మెగ్నీషియం, విటమిన్ E కూడా కొలెస్ట్రాల్‌ను బ్యాలెన్స్ చేస్తాయి.
3. బ్రెజిల్ నట్స్‌లో ఉండే ఎల్లాజిక్ యాసిడ్... శరీరంలోని వేడి, మంటలు, నొప్పులు, వాపుల్ని తగ్గిస్తాయి. విష వ్యర్థాల్ని తరిమికొడతాయి.
4. బ్రెజిల్ నట్స్‌లో ఉండే సెలెనియం సంతాన భాగ్యాన్ని కలిగిస్తుంది. మగాళ్లలో స్పెర్మ్ కౌంట్ పెరిగేందుకు ఇది సూపర్‌ఫుడ్‌లా పనిచేస్తుంది.
5. మనకు రకరకాల వ్యాధులు రాకుండా అడ్డుకునే శక్తి బ్రెజిల్ నట్స్‌కి ఉంది. వివిధ కాలాల్లో వచ్చే వ్యాధుల నుంచీ ఈ గింజలు మనల్ని కాపాడతాయి.
6. మూడ్ బాగోని వాళ్లు, టెన్షన్‌తో ఉండేవాళ్లు బ్రెజిల్ నట్స్ ఓ నాలుగు తింటే చాలు... బ్రెయిన్‌లో సెరొటోనిన్ కెమికల్ చక్కగా పనిచేసేలా చేస్తాయి. అంతే బ్రెయిన్ చురుగ్గా మారి... టెన్షన్, తలనొప్పి, ఆందోళన వంటివి మాయమవుతాయి. చక్కటి నిద్ర పడుతుంది కూడా.
7. థైరాయిండ్ గ్రంథి బాగా పనిచేసేలా చేస్తుంది. మన శరీరంలో హార్మోన్లు సరిగ్గా ఉత్పత్తి అవ్వాలంటే ఆ థైరాయిడ్ గ్రంథి చక్కగా ఉండాలి.
8. బ్రెజిల్ నట్స్‌లో ఉండే సెలెనియం, ఒమేగా-3 ఫాట్టీ యాసిడ్స్, విటమిన్ సీ, ఈ, మన చర్మం మెరిసేలా, సాగేలా చేస్తుంది. మృదువైన కోమలమైన స్కిన్ వచ్చేస్తుంది. ఈ గింజలు ముసలితనం రాకుండా మాగ్జిమం ట్రైచేస్తాయి.
9. భగభగ మండే సూర్యుడి ఎండల నుంచీ మనల్ని మనం కాపాడుకోవాలంటే... బ్రెజిల్ నట్స్ తింటూ ఉండాలి.
10. ముఖంపై మచ్చలు, మొటిమల వంటివి తొలగిపోవాలన్నా బ్రెజిల్ నట్స్ ని నోట్లో వేసుకొని కరకర నమలాల్సిందే.
11. మన శరీరానికి ప్రోటీన్లు (మాంసకృత్తులు) అవసరం కదా. ఈ నట్స్ తింటే సరి. కొంతైనా ప్రోటీన్లు అందుతాయి.
12. మన బాడీలో జింక్ సరిపడా లేకపోతే ఆక్రోడెర్మాటిటిస్ ఎంటెరోపాథికా ( Acrodermatitis enteropathica ) అనే వ్యాధి సోకుతుంది. అది రాకుండా ఉండేందుకు మనం బ్రెజిల్ నట్స్ తినాలి.
13. జుట్టును కాపాడేందుకు బ్రెజిల్ నట్స్‌లో L-ఆర్జినిన్ అనే అమైనో యాసిడ్ ఉంది. మగాళ్లకు బట్టతల రాకుండా చేసే లక్షణం దీనికి ఉంది. ఈ గింజలను ఎంత ఎక్కువగా తింటే, అంతలా జుట్టు పెరుగుతుందట.
14. బరువు తగ్గాలంటే... బ్రెజిల్ నట్స్ తినాలి. ఈ గింజల్లోని ప్రోటీన్లు, ఫైబర్ (పీచు పదార్థం) అధిక బరువు అంతు చూస్తాయి.
15. కొంతమందికి మల బద్ధకం సమస్య ఉంటుంది. ఏం తిన్నా జీర్ణం కావు. అలాంటి వాళ్లు రెండో మాట ఆలోచించకుండా బ్రెజిల్ నట్స్ తింటే సరి. జీర్ణ వ్యవస్థకు సంబంధించిన అన్ని సమస్యలూ పరారవుతాయి.
16. కండరాలు సరిగా పనిచేయకపోయినా, నొప్పి వస్తున్నా... బ్రెజిల్ నట్స్ తినేయడమే.
17. ఎముకలకు ఖనిజాలు, ఇతరత్రా కావాల్సిన పదార్థాలు పుష్కలంగా అందాలంటే... బ్రెజిల్ నట్స్‌ని నోట్లో వేసుకొని అలా అలా తింటూ ఉండాలి. వాటిలోని ఐరన్ రక్తంలో కలిసి... ఎముకల్లోకి వెళ్లి... ధృఢంగా మార్చేస్తుంది.
18. మన చుట్టూ కాలుష్య ప్రపంచం. అడ్డమైన వ్యాధులూ సోకే ప్రమాదం. అలాంటప్పుడు మనం సైలెంట్‌గా బ్రెజిల్ నట్స్ తింటూ ఉండాలి. ఆ కాలుష్యం నుంచీ మనల్ని అవి కాపాడుతూ ఉంటాయి.
19. మన శరీర కణాలు పాడవకుండా చేసే లక్షణం బ్రెజిల్ నట్స్‌కి ఉంది. కణాలు పాడైతే వాటిని బాగుచేస్తాయి కూడా. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఈ రోజుల్లో చాలా మందికి కేన్సర్ సోకుతోంది. కారణం కణాలు పాడైపోతుండటమే. ఆ భయంకరమైన వ్యాధి బారిన పడకుండా మనకు ఎంతో మేలు చేస్తాయి ఈ బ్రెజిల్ నట్స్.
20. మన శరీరానికి కావాల్సిన పోషకాలు, మానసికంగా మనం చక్కగా ఎదిగేందుకూ, ఆరోగ్యంగా ఉండేందుకు ఏం కావాలో అవన్నీ బ్రెజిల్ నట్స్‌లో ఉన్నాయి. ప్రస్తుతం వీటి ఉత్పత్తి తక్కువగా ఉండటం వల్ల రేటు కాస్త ఎక్కువే ఉంటున్నాయి. అయినప్పటికీ వీటితో ఉన్న ప్రయోజనాల వల్ల ప్రజలు వీటిని తింటున్నారు.
ఇవి కూడా చదవండి :
Top 10 on Instagram : ఇన్‌స్టాగ్రాంలో టాప్ టెన్ అకౌంట్స్ ఇవే...
సమ్మర్‌లో బీట్ రూట్ జ్యూస్ తాగుతున్నారా... ఈ అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం...
కొత్తిమీర పుదీనా జ్యూస్... వేసవిలో తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు...
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Health, Health Tips, Life Style, Tips For Women, Women health