పంటినొప్పిని కేవలం 5 నిమిషాల్లోనే .. వంటింటి వస్తువులతో ఇలా తగ్గించుకోండి!

Dental problems

పళ్లు వదులుగా మారడం, చిగుళ్లవాపు, దంతాక్షయం ఇలా ఎన్నో దంత సమస్యలను వెంటాడతాయి. పంటిపై ఒత్తిడి కలిగించే కొన్ని రకాల ఆహార పదార్థాలు తిన్నా.. పంటి నొప్పికి దారితీస్తుంది.

  • Share this:
పంటినొప్పి బాధ భారించలేనిది. ఇంకా పంటి చుట్టూ వాచి వచ్చే నొప్పి అయితే వర్ణాణాతీతం. ఇలాంటి సమయంలో కచ్ఛితంగా వైద్యుల సలహాలు తీసుకోవాలి. కానీ, అన్నిసార్లు కుదరకపోవచ్చు. ఇటువంటి సమయంలో మనకు ఇంట్లో లభించే పదార్థాలతోనే పంటి నొప్పి సమస్యకు కాస్త ఉపశమనం కలుగుతుంది. అవేంటో తెలుసుకుందాం.

  • ఐస్‌ ముక్క ఓ క్లాత్‌లో తీసుకుని వాటిని నొప్పి ఉన్న ప్రాంతంలో సున్నితంగా రుద్దాలి. ఇలా చేయడంతో ఆ ప్రాంతంలో రక్తనాళాలు, రక్త ప్రసరణ మెరుగుపడి నొప్పి, మంటను తగ్గిస్తుంది. ముఖ్యంగా వాపు కారణంగా వచ్చే పంటినొప్పికి ఇది మంచి చిట్కా.
  • కొన్నిసార్లు ఇన్ఫెక్షన్‌ కారణంగా పంటినొప్పి ఎక్కువవుతుంది. అలాంటి సమయంలో వేడినీటిలో చిటికెడు ఉప్పు వేసి ఆ నీటిని పదినిమిషాలపాటు పుకిలించి ఉంచాలి అంటారు. ఇలా రోజులో వీలైన
    నన్నిసార్లు చేయాలి. దీంతో పంటి చుట్టూ ఇన్ఫెక్షన్‌కు కారణమైన క్రిములు నశిస్తాయి. ఏదైన ఆహార పదార్థం పళ్ల మధ్యలో ఇరుక్కుపోయినా.. బయటకు వచ్చేస్తుంది. తద్వారా పంటి నొప్పి సమస్య తీరిపోతుంది.
  • భరించలేని పంటినొప్పితో బాధపడేవారికి వెల్లుల్లి బాగా పనిచేస్తుంది. ఇందులో శక్తివంతమైన యాంటీ బ్యాక్టిరియల్‌ గుణాలు ఉంటాయి. విపరీతమైన పంటి నొప్పి ఉన్నవారు వెల్లుల్లిని దంచి దాన్ని కాస్త ఉప్పు లేదా మిరియాల పొడితో కలిపి పంటి నొప్పి ఉన్న ప్రాంతంలో రాయాలి. ఇలా చేస్తే.. తక్షణమే పంటి నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
  • అయితే, వెల్లుల్లిని కచ్ఛితంగా దంచాలి. ముక్కలుగా కోయడం వల్ల ఉపయోగం ఉండదు. అలా కుదరకపోతే వెల్లుల్లిని కనీసం పంటితో నమిలే ప్రయత్నం చేయాలి. ఈ చిట్కాలు తాత్కాలికంగా ఉపశమనం కలిగించినా.. ఒకటి రెండు రోజుల కంటే ఎక్కువ రోజులు పంటి నొప్పి వేధిస్తే.. వెంటనే వైద్యులను కలిసి చికిత్స తీసుకోవాలి. అలాగే పంటినొప్పి సమస్య ఉన్నవారు ఎక్కువగా చక్కెర ఉన్న పదార్థాలను తీసుకోకూడదు.

Published by:Renuka Godugu
First published: