Health Tips : చిన్నపిల్లలకు ఈ ఫుడ్ తినిపించండి..

పుట్టిన సంవత్సరం నుంచి పప్పుతో చేసిన వంటకాలు తినిపించవచ్చు. వారానికి రెండు సార్లు చేపలు.. వీలైతే వారానికి ఓసారి మటన్‌ సూప్‌, చికెన్‌ సూప్‌ వంటివి అలవాటు చేయాలి..

Amala Ravula | news18-telugu
Updated: June 30, 2019, 11:49 AM IST
Health Tips : చిన్నపిల్లలకు  ఈ ఫుడ్ తినిపించండి..
ప్రతీకాత్మక చిత్రం
Amala Ravula | news18-telugu
Updated: June 30, 2019, 11:49 AM IST
అప్పుడే పుట్టిన పిల్లల నుంచి కాస్తా పెద్దవాడై స్కూల్‌కు వెళ్లేవరకు ఎలాంటి ఆహారాన్ని అందించాలో అనే ఆలోచన ప్రతి తల్లికి వస్తుంది. అలాంటి వారు కింది విషయాలను తప్పకుండా తెలుసుకోండి. పిల్లలకు అమ్మపాలే అమృతం. ఎదిగే పిల్లలకు అమ్మపాలతో పాటు పాలతో తయారైన ఆహార పదార్థాలు ఇవ్వడం ఆరు నెలల తర్వాత ప్రారంభించాలి. బియ్యం, బార్లీ, గోధుమలు, ఓట్స్‌ వంటివి ఒక సంవత్సరం నుంచి మెల్లమెల్లగా మొదలుపెట్టాలి. పెరిగే పిల్లలకు కొద్దికొద్దిగా కోడిగుడ్డు, చేపలు ఇవ్వడం మొదలెట్టాలి. పాలు, చీజ్‌, పెరుగును తప్పకుండా పిల్లల డైట్‌లో చేర్చాలి. ఇవి పిల్లల్లో ఎముకల బలాన్ని మరింత పెంచుతాయి.

పుట్టిన సంవత్సరం నుంచి పప్పుతో చేసిన వంటకాలు తినిపించవచ్చు. వారానికి రెండు సార్లు చేపలు.. వీలైతే వారానికి ఓసారి మటన్‌ సూప్‌, చికెన్‌ సూప్‌ వంటివి అలవాటు చేయాలి. పండ్లను పంచదార కలపని జ్యూస్‌ రూపంలో, లేదంటే చిన్న చిన్న ముక్కలుగా ఇవ్వాలి.

సంవత్సరం పాటు వైద్యుల సలహా మేరకు ఆహారాన్ని ఇస్తూ ఉండాలి. తల్లిపాలు కనీసం నాలుగు నెలలైనా ఇవ్వాలి. తద్వారా పిల్లలు ఆరోగ్యంగా పెరుగుతారు. ఆరో నెల నుంచి ఉడికించిన బంగాళదుపం, క్యారెట్‌, ఆపిల్‌, అరటి పండు వంటివి ఇవ్వాలి. ఆ తర్వాత బాగా మిశ్రమం చేసిన పప్పుతో కలిపిన అన్నం, చికెన్‌ వంటివి అందించాలి. మాంసాహారాన్ని రాత్రిపూట ఇవ్వకూడదు. రాత్రి ఇడ్లీల వంటి తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని అందించాలి.

ఈ వీడియో కూడా చూడండి..



First published: June 30, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...