Home /News /life-style /

BEST HEALTH INSURANCE POLICY FOR SENIOR CITIZEN UMG GH

Health Insurance: సీనియర్ సిటిజన్స్‌కు హెల్త్ ఇన్సూరెన్స్ కావాలా..? బెస్ట్ పాలసీకి మంచి ఆప్షన్స్ ఇవే..!

సీనియర్ సిటిజన్స్‌కు హెల్త్ ఇన్సూరెన్స్ కావాలా..?

సీనియర్ సిటిజన్స్‌కు హెల్త్ ఇన్సూరెన్స్ కావాలా..?

కరోనా విపత్తు తర్వాత చాలా మంది హెల్త్‌ ఇన్సూరెన్స్‌(Health Insurance) పాలసీల అవసరాన్ని గుర్తించారు. కొన్ని నివేదికల ప్రకారం.. కరోనా తర్వాత హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలు తీసుకొనే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
కరోనా విపత్తు తర్వాత చాలా మంది హెల్త్‌ ఇన్సూరెన్స్‌(Health Insurance) పాలసీల అవసరాన్ని గుర్తించారు. కొన్ని నివేదికల ప్రకారం.. కరోనా తర్వాత హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలు తీసుకొనే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. సాధారణంగా ఉద్యోగులకు తాము పనిచేసే సంస్థలు హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలను అందిస్తాయి. చాలా మంది ఆ పాలసీలు చాలని భావిస్తున్నారు. అయితే వైద్య ద్రవ్యోల్బణం, ప్రస్తుతం జీవిస్తున్న అనిశ్చిత కాలాలను పరిగణనలోకి తీసుకుంటే.. రూ.3 లక్షలు అంత కంటే తక్కువ కవరేజీని అందించే హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలు సరిపోవు. పెరుగుతున్న వైద్య ద్రవ్యోల్బణాన్ని తట్టుకోవడానికి కనీసం రూ.10 లక్షల హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ అయినా ఉండాలి.

పాలసీని తీసుకొనే ముందు దాని ద్వారా లభిస్తున్న ప్రయోజనాలు, చెల్లించాల్సిన ప్రీమియం, ఇతర షరతుల గురించి పూర్తిగా తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పూర్తి వివరాలు తెలుసుకోకుండా వ్యవహరిస్తే పాలసీ క్లెయిమ్‌ చేసే సమయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. వృద్ధులకు ఆరోగ్య పరమైన సమస్యలు ఎక్కువగా ఎదురవుతుంటాయి. వారే తరచూ ఆస్పత్రులకు వెళ్లి రావాల్సి ఉంటుంది. అలాంటి వారు హెల్త్‌ ఇన్సూరెన్స్‌లకు ప్రీమియం కూడా ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి సీనియర్‌ సిటిజన్లకు ఎలాంటి పాలసీలు సరిపోతాయనే అంశాలపై నిపుణుల సూచనలు ఇవే..

ఇదీ చదవండి: షాకింగ్ న్యూస్.. ఆ ఫోన్‌లు ఇండియాలో బ్యాన్..? ఇక బడ్జెట్ మొబైల్స్ కష్టమే.. ప్రభుత్వం ఏం చెబుతుంది అంటే..!


* సీనియర్‌ సిటిజన్‌ల కోసం ప్రత్యేక ప్లాన్‌లు
ఉదాహరణకు.. 58 ఏళ్లు ఉన్న వ్యక్తి త్వరలో రిటైర్మెంట్‌ తీసుకోబోతున్నారు. ఇప్పటివరకు అతనికి కార్పొరేట్ ఇన్సూరెన్స్‌ పాలసీ మాత్రమే ఉంది. రానున్న సంవత్సరంలో ఆయన రిటైర్‌ అవుతారు. ఆయన తనకు, తన భార్య(55)కు కలిపి సీనియర్ సిటిజన్స్ కాబట్టి మంచి హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ తీసుకోవాలని భావిస్తున్నారు. ఆయనకు సీనియర్‌ సిటిజన్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన పాలసీలను తీసుకోవాలా? లేదా సాధారణ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలు సరిపోతాయా? అనే కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. ఎలాంటి అంశాలను పరిశీలించాలనే దానిపై కూడా అవగాహన లేదు. ఆయన హార్ట్‌ పేషెంట్‌, భార్య డయాబెటిక్‌తో బాధపడుతున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో 60 ఏళ్ల తర్వాత కొత్త ఇన్నింగ్స్‌ ప్రారంభం అవుతుంది. తమకు, కుటుంబానికి వీలైనంత ఎక్కువ సమయం కేటాయించగలరు. ఎలాంటి బాధ్యతలు ఉండవు. హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ రెగ్యులర్‌గా ఆస్పత్రులకు వెళ్లాల్సిన వారు, వృద్ధులు మాత్రమే తీసుకోవాలని లేదు. ఏ వయసు వారికి అయినా అనుకోని ప్రమాదాల మధ్య ఆర్థిక భద్రత అవసరం. పై ఉదాహరణలో పేర్కొన్న గుండు జబ్బుతో బాధపడుతున్న భర్త, డయాబెటిక్‌ ఉన్న భార్యకు కొన్ని పాలసీలను నిపుణులు సూచించారు. డయాబెటిక్‌ అయిన ఆమెకు ABHI- Activ హెల్త్ ప్లాటినం ఎన్‌హాన్స్‌డ్ క్రానిక్ ప్లాన్, హెచ్‌డీఎఫ్సీ ఎర్గో అందిస్తున్ ప్రైమ్ యాక్టివ్ - మణిపాల్ సిగ్నా & ఎనర్జీ పాలసీని సూచించారు. అదే విధంగా గుండె జబ్బుల కోసం - కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ లేదా స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ నుంచి కేర్ హార్ట్ ప్లాన్- కార్డియాక్ కేర్ పాలసీలను పేర్కొన్నారు.



* ప్రసూతి ప్రయోజనాలతో పాలసీ
తక్కువ వయసు(28) ఉన్న వ్యక్తి పరిస్థితులను ఉదాహరణగా తీసుకొంటే.. 28 ఏళ్ల వ్యక్తికి రూ.3 లక్షల కార్పొరేట్ ఇన్సూరెన్స్‌ పాలసీ ఉంది. అతనికి ఇటీవలే పెళ్లి అయింది. భార్యకు ఎలాంటి హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ లేదు. ఆమె వయస్సు 27 సంవత్సరాలు. ఇద్దరినీ కవర్ చేసే హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ కోసం అతను వెతుకుతున్నాడు.

వైద్య ద్రవ్యోల్బణం, మనం నివసిస్తున్న అనిశ్చిత వాతావరణాన్ని పరిగణనలోకి తీసుకుంటే, రూ.3 లక్షల ఇన్సూరెన్స్‌ మొత్తం చాలా తక్కువని నిపుణులు చెబుతున్నారు. ఇటీవలే వివాహం చేసుకున్నారు కాబట్టి ఏ ప్లాన్‌కు వెళ్లాలో నిర్ణయించేటప్పుడు ప్రసూతి ప్రయోజనాన్ని గుర్తుంచుకోవడం ముఖ్యమని సూచించారు. హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కవరేజీలో ప్రసూతి ప్రయోజనాలు ప్రధానంగా ప్రసవ సమయంలో అయ్యే ఖర్చుల నుంచి రక్షించేందుకు రూపొందించారు. కేర్ హెల్త్ ఇన్సూరెన్స్'-జాయ్ టుడే/జాయ్ టుమారో, నివా బుపా హెల్త్ ప్రీమియా & ఫ్యూచర్ జెనరాలి సూపర్ సేవర్ ప్లాన్ వంటి కొన్ని ప్లాన్‌లను నిపుణులు సూచిస్తున్నారు.
Published by:Mahesh
First published:

Tags: General insurance, Health Insurance, Insurance, Senior citizens

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు