మన జీవితానికి ఒక రూపం ఇచ్చే శిల్పి నాన్న.. ఆపద వస్తే కొండంత ధైర్యాన్నిస్తూ, అడగకుండానే అవసరాలు తీర్చే కల్ప తరువు. తప్పు చేస్తే దండించేది నాన్నే.. జీవితానికి అవసరమైన క్రమశిక్షణ నేర్పేది కూడా నాన్నే.. పిల్లల సంతోషం కోసం ఎంత కష్టమైనా భరిస్తాడు.
అందుకే నాన్నే అందరికీ రోల్ మోడల్. అలాంటి నాన్నని గౌరవించడానికే ఏటా జూన్ మూడో ఆదివారాన్ని Fathers Dayగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ సందర్భంగా నాన్నకు ఎలాంటి బహుమతి ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఉన్నారా..? వాచ్, షర్ట్, లేదా మంచి పుస్తకం వంటి వాటిని గిఫ్ట్ గా ఇవ్వడం సర్వసాధారణం. ఇవన్నీ నాన్నకు నచ్చే మంచి బహుమతులు కావచ్చు. నిజానికి అవి అవసరమా? సాంప్రదాయం కంటే భిన్నమైన వాటిని గిఫ్ట్‌గా ఇస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. తండ్రికి ఆర్థిక స్వేచ్ఛను అందించడానికి మీరు పరిగణలోకి తీసుకునే గిఫ్ట్ ఐడియాల జాబితాను ఇప్పుడు పరిశీలిద్దాం.
ఆరోగ్య బీమా
వయస్సుతో పాటు వైద్య పరమైన అవసరాలు పెరుగుతుంటాయి. దీంతో చాలా రోగాలను కవర్ చేసే విస్తృతమైన ఆరోగ్య బీమాను మీ తండ్రికి కల్పించడం ఉత్తమ బహుమతి తప్పక అవుతుంది. కాబట్టి మీరు వృద్ధాప్య సంబంధిత ఆరోగ్య సమస్యలను కవర్ చేసే ఆరోగ్య బీమా పాలసీని పరిగణలోకి తీసుకోండి. ఒక Health Policyని ఖరారు చేసే ముందు, వాటి వివరాలను క్షుణంగా పరిశీలించాలి. ఔట్ పెషంట్ డిపార్ట్ మెంట్ (OPD) ట్రీట్‌మెంట్ వంటి అదనపు ప్రయోజనాలను అందించే పాలసీని ఎంపిక చేసుకోండి.
సెక్యూర్ రిటైర్‌మెంట్
ప్రతి ఒక్కరూ రిటైర్మెంట్ తర్వాతి జీవితం సురక్షితంగా ఉండాలని కలలు కంటారు. ఇది ఆర్థిక భద్రతతో మాత్రమే నెరవేరుతుంది. మీకు స్థిరమైన నగదు ప్రవాహం ఉంటే పదవీ విరమణ అనంతర జీవితం కోసం మీ Father పడే ఆందోళనలకు మీరు పరిష్కారం చూపవచ్చు.
సాంప్రదాయ ఆర్థిక అంశాల కంటే ఎక్కువ లాభదాయకమైన పెట్టుబడుల గురించి మీ తండ్రికి తెలియజేయండి. మీరు అతని కోసం మ్యూచువల్ ఫండ్స్, బాండ్స్ మొదలైన వాటిలో పెట్టుబడిని ప్రారంభించవచ్చు. కొన్ని సంవత్సరాలుగా చిన్న మొత్తాల్లో రెగ్యులర్‌గా పెట్టుబడి పెడితే తక్కువ సమయంలోనే రాబడి వస్తుంది.
ఆర్థిక విషయాలపై అవగాహన కల్పించడం
ఫర్సనల్ ఫైనాన్స్ ఇండస్ట్రీలో కొన్ని సంవత్సరాల నుంచి పరిస్థితులు బాగా మారాయి. అనేక కొత్త సాధనాలు బాగా ప్రాచుర్యం పొందాయి. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల రాకతో, మీ భవిష్యత్తును ఆర్థికంగా సేఫ్ జోన్‌లో ఉంచుకోవడానికి అనేక కొత్త పెట్టుబడి మార్గాలకు ద్వారాలు తెరుచుకున్నాయి.
మీ తండ్రికి సాంప్రదాయ ఆర్థిక అంశాలపై ఎక్కువ నమ్మకం ఉండవచ్చు. కానీ మీరు అతనికి ప్రత్యామ్నాయ పెట్టుబడుల అవకాశాల గురించి అవగాహన కల్పించండి. రిస్క్‌లను తగ్గించడానికి ఎలా వైవిధ్యంగా వ్యవహరించాలో మీరు మీ తండ్రితో చర్చించవచ్చు. మీరు మీ తండ్రికి ఒక ఫైనాన్షియల్ ప్లానర్‌గా ఉండవచ్చు. దీంతో మీ తండ్రి తన పెట్టుబడి లన్నింటిపై సమగ్రమైన నిఘా కోసం మీరు మార్గనిర్దేశంగా ఉండవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Father, Fathers Day, Happy Fathers Day, Health policy