Chimpanzees: చింపాజీలు మనలాగే ఫ్రెండ్షిప్ చేస్తాయట.. పరిశోధనలో తేలిన ఆసక్తికర విషయాలివే..

Chimpanzees: సాధారణంగా ఒకే వయసు ఉన్న వ్యక్తులతో స్నేహం చేయడానికి మనుషులు ఆసక్తి  చూపుతారు. మగ చింపాంజీలు కూడా తమ వయసుకు తగ్గ జంతువులతోనే స్నేహం చేస్తాయని ఒక అధ్యయనం వెల్లడించింది.

news18-telugu
Updated: October 23, 2020, 3:48 PM IST
Chimpanzees: చింపాజీలు మనలాగే ఫ్రెండ్షిప్ చేస్తాయట.. పరిశోధనలో తేలిన ఆసక్తికర విషయాలివే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
సాధారణంగా ఒకే వయసు ఉన్న వ్యక్తులతో స్నేహం చేయడానికి మనుషులు ఆసక్తి  చూపుతారు. మగ చింపాంజీలు కూడా తమ వయసుకు తగ్గ జంతువులతోనే స్నేహం చేస్తాయని ఒక అధ్యయనం వెల్లడించింది. మిచిగాన్ విశ్వవిద్యాలయానికి చెందిన యానిమల్ సైకాలజిస్ట్ అలెగ్జాండ్రా రోసాటి నేతృత్వంలోని ఈ పరిశోధన చేశారు. ఈ వివరాలను ఒక సైన్స్ జర్నల్‌లో గురువారం ప్రచురించారు. జంతువులు కూడా వయస్సు ఆధారంగా సామాజిక భావనను ప్రదర్శిస్తాయని వారు తేల్చారు. 1995 నుంచి 2016 మధ్య ఉగాండాలోని కిబాలే నేషనల్ పార్క్‌లో చింపాంజీలపై పరిశోధన చేశారు. 78,000 గంటల పాటు వాటిని పరిశీలించి భారీ డేటాసెట్‌ను వారు రూపొందించారు. 15 నుంచి 58 సంవత్సరాల వయసు ఉన్న 21 అడవి మగ చింపాంజీల (పాన్ ట్రోగ్లోడైట్స్) మధ్య సోషల్ ఇంటరాక్షన్ ఎలా ఉందో వారు పరిశోధించారు.

మగవాటినే ఎందుకు ఎంచుకున్నారు?

మగ చింపాంజీలు పుట్టిన గుంపులోనే ఉంటాయి. అందుకే మగవాటినే పరిశోధనకు ఎంచుకున్నారు. ఆడ చింపాంజీలు లైంగికంగా పరిణతి చెందిన తరువాత కొత్త గుంపుల్లోకి వెళ్తాయి. ఈ జంతువులు మనుషులకు దగ్గరి బంధువుల్లా కనిపిస్తాయి. మనుషుల మాదిరిగానే చింపాంజీలు ఎక్కువ కాలం జీవిస్తాయి. కొన్ని 60ఏళ్ల వరకు జీవిస్తాయి. తోటి చింపాంజీల్లో ఎలాంటి వాటితో స్నేహం చేయాలనే అంశంపై విస్తృత స్థాయి అవగాహక కలిగి ఉంటాయి. స్నేహం చేసే మగ చింపాజీలు కలిసి వేటాడుతాయి. మాంసాన్ని పంచుకుంటాయి. సమష్టిగా వాటి భూభాగాల సరిహద్దులను రక్షించుకుంటాయి. సమూహాలలో ఉన్నత స్థాయిని(ర్యాంకులను) కలసికట్టుగా నిర్ణయించుకుంటాయి. వ్యక్తిగత పునరుత్పత్తి విషయంలో ఈ ఎంపిక వాటికి ఉపయోగపడుతుంది.

అసోసియేషన్ ఇండెక్స్ ద్వారా అధ్యయనం
చింపాంజీల గూంపులో ఒకరిదానితో మరొకటి ఎంత అనుబంధంగా ఉంటాయో అధ్యయనం చేయడానికి పరిశోధకులు ఒక "అసోసియేషన్ ఇండెక్స్" ను అభివృద్ధి చేశారు. గుంపులో ఉండే మగ చింపాంజీలు ఇతర జంతువులతో ఎంత దగ్గర సంబంధం కలిగి ఉన్నాయో దీని ద్వారా అంచనా వేశారు. ఇది ఒక గుంపులోని మగ చింపాంజీలు ఎంత తరచుగా మరొక సమూహానికి (ఐదు మీటర్ల లోపు) దగ్గరగా ఉంటాయనే దానిపై ఈ ఇండెక్స్ ఆధారపడి ఉంటుంది.

మూడు వర్గాలుగా ఎంపిక
ఈ బృందం చింపాంజీలను మొత్తం మూడు వర్గాలుగా విభజించింది. మ్యూచువల్ ఫ్రెండ్స్ విభాగంలో రెండు చింపాంజీలు ఒకదానితో ఒకటి కలిసి మెలిసి ఉన్నాయి. వన్ సైడ్ ఫ్రెండ్ విభాగంలో రెండు జంతువుల్లో ఒకటి మాత్రమే స్నేహంగా ఉండేవి. నాన్- ఫ్రెండ్స్ విభాగంలో ఒకదాంతో మరోదానికి ఎలాంటి సంబంధం లేకుండా ప్రవర్తించేవని తెలిపారు. ఎక్కువ వయసుండే మగ చింపాంజీలు చిన్న జంతువులకన్నా మెరుగ్గా జెన్యూన్ ఫ్రెండ్‌షిప్‌ చేస్తాయని పరిశోధన వెల్లడించింది. ఉదాహరణకు.. 15ఏళ్ల చింపాంజీలతో పోల్చినప్పుడు 40 ఏళ్ల మగ చింపాంజీ సగటున మూడు రెట్లు హై క్వాలిటీ ఫ్రెండ్‌షిప్‌ చేస్తుందట.

నిజమైన స్నేహితుల ఎంపిక..
35 ఏళ్లు పైబడిన మగ చింపాంజీలు నిజమైన స్నేహితులను ఎంపిక చేసుకుంటాయి. వయసు పెరుగుతున్నా కొద్దీ అవి గుంపులోని ఇతర చింపాంజీలపై దూకుడు ప్రవర్తనను తగ్గిస్తాయి. పెద్ద వయసున్న చింపాంజీలు, చిన్నవాటి కంటే ఎక్కువ సమయం తమ స్నేహితులతో గడిపేందుకు ఇష్టపడతాయి. వయసు విషయంలో మగ చింపాంజీలు మనుషుల మాదిరిగానే ప్రవర్తిస్తాయని ఈ పరిశోధన ద్వారా తెలిసిందని అరిజోనా స్టేట్ యూనివర్సిటీకి చెందిన జోన్ సిల్క్ చెబుతున్నారు. ఈ పద్ధతి ఇతర ప్రైమేట్లలో కూడా ఉండొచ్చని ఆయన చెప్పారు.
Published by: Nikhil Kumar S
First published: October 23, 2020, 3:45 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading