Brown rice: బరువు తగ్గాలనుకుంటున్నారా..? అయితే, ఇది కచ్చితంగా ట్రై చేయండి
బ్రౌన్ రైస్‌తో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
బ్రౌన్‌రైస్‌తో (Brown rice) ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. వీటిద్వారా శరీరానికి అవసరమయ్యే పోషకాలు అందుతాయి. అందుకే బ్రౌన్ రైస్‌ను కేవలం బరువు తగ్గించే (weight loss) ఏజెంట్‌గా మాత్రమే పరిగణించకూడదు. దీని విస్తృత ప్రయోజనాల (benefits)తో లబ్ధి పొందేందుకు, వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది.
మన దేశంలో లైఫ్‌స్టైల్ వ్యాధుల బారిన పడుతున్న వారి సంఖ్య ఏటా పెరుగుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. తీరికలేని, ఉరుకుల పరుగుల జీవితమే ఇందుకు కారణమని చెప్పుకోవచ్చు. బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా చాలామంది బయటి తిండికి అలవాటుపడి ఊబకాయంతో బాధపడుతున్నారు. వ్యాయామం చేసే తీరిక కూడా లేకపోవడంతో ఇతర అనారోగ్యాలను కూడా ఎదుర్కొంటున్నారు. అయితే ఆహారంలో చేసుకునే కొద్దిపాటి మార్పులతో ఆరోగ్యంగా ఉండొచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో బ్రౌన్ రైస్ వాడకాన్ని పెంచాలని సిఫార్సు చేస్తున్నారు.
బ్రౌన్‌రైస్‌తో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. వీటిద్వారా శరీరానికి అవసరమయ్యే పోషకాలు అందుతాయి. అందుకే బ్రౌన్ రైస్‌ను కేవలం బరువు తగ్గించే ఏజెంట్‌గా మాత్రమే పరిగణించకూడదు. దీని విస్తృత ప్రయోజనాలతో లబ్ధి పొందేందుకు, వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది. వీటిని వైట్ రైస్ మాదిరిగా ప్రాసెస్ చేయరు. బ్రౌన్ రైస్‌లో బ్రాన్ (ఊక), జెర్మ్ (బీజము) ఉంటాయి. ఇవి పోషకాలతో నిండిన ఆరోగ్యకరమైన ఆహారమని నిపుణులు చెబుతున్నారు. వైట్ రైస్ వాడకాన్ని తగ్గించి బ్రౌన్ రైస్ వినియోగాన్ని పెంచాలని సూచిస్తున్నారు.
ఆహారంలో బ్రౌన్ రైస్ చేర్చుకోవడం వల్ల ప్రయోజనాలు
ముడి బియ్యానికి శరీరంలోని ప్రమాదకరమైన LDL కొలెస్ట్రాల్‌ను తగ్గించే శక్తి ఉంటుంది. LDL కొలెస్ట్రాల్‌ను చెడు కొలెస్ట్రాల్ అంటారు. దీనివల్ల గుండె సమస్యలు ఎదురవుతాయి. బ్రౌన్ రైస్ ఈ కొలెస్ట్రాల్ స్థాయిలను గణనీయంగా తగ్గించగలదు. ముడి బియ్యంలో ఉండే సహజ నూనెకు ఈ శక్తి ఉంటుంది.
బ్రౌన్ రైస్ గట్ హెల్త్‌ను మెరుగుపరుస్తాయి. ముడి బియ్యంలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది పేగుల్లోని కదలికను మెరుగుపరుస్తుంది. ఇలా పేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది.
మధుమేహం ఉన్నవారికి బ్రౌన్ రైస్ బెస్ట్, హెల్దీ ఫుడ్ ఆప్షన్. ముడి బియ్యంలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. దీంతో ఇది శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది.. ఆహారం ఎంత వేగంగా లేదా నెమ్మదిగా జీర్ణం అవుతుందో సూచిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలపై ఇది చూపుతుంది.
బరువు తగ్గాలనుకునే వారు ముడి బియ్యం వినియోగం పెంచితే చాలు. బ్రౌన్ రైస్‌లో మాంగనీస్ ఉంటుంది. ఇది కొవ్వులను విచ్ఛిన్నం చేయడం ద్వారా బరువు తగ్గేలా చేస్తుంది. అలాగే ఇందులోని పీచుపదార్థాలు పొట్ట నిండిన భావన కల్పిస్తాయి. దీంతో అతిగా తినాలనే కోరిక కలగదు.
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో బ్రౌన్ రైస్ కీలక పాత్ర పోషిస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ముడి బియ్యం కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంతో పాటు రక్తప్రవాహంలో ఎలాంటి అడ్డంకులు ఏర్పడకుండా నివారిస్తుంది. ఫలితంగా హృదయనాళాల పనితీరుతో పాటు గుండె ఆరోగ్యం మెరుగవుతుంది.
Published by:Mahesh
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.