Home /News /life-style /

BENEFITS OF VITAMIN E IN SKINCARE UMG GH

vitamin E: మీ స్కిన్ తళతళ మెరిసిపోవాలా..? అయితే, ఈ విటమిన్ తీసుకోండి..!

: విటమిన్-E తో ఎన్నో ప్రయోజనాలు.. రోగనిరోధక శక్తిని పెంచే పోషకం..

: విటమిన్-E తో ఎన్నో ప్రయోజనాలు.. రోగనిరోధక శక్తిని పెంచే పోషకం..

విటమిన్ E అనేది కొవ్వులో కరిగే విటమిన్. దీని ప్రాథమిక విధి శరీరానికి యాంటీ ఆక్సిడెంట్‌గా పని చేయడం. ఇది శరీరంలోని కణాలను రక్షిస్తుంది. విటమిన్ Eని స్థిరంగా, క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల వైరస్, అనారోగ్యంతో పోరాడటానికి శరీరంలో పటిష్టమైన రక్షణ ఉంటుంది.

ఇంకా చదవండి ...
విటమిన్ Eతో శరీరానికి అనేక ప్రయోజనాలు అందుతాయి. ముఖ్యంగా రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. విటమిన్ E అనేది కొవ్వులో కరిగే విటమిన్. దీని ప్రాథమిక విధి శరీరానికి యాంటీ ఆక్సిడెంట్‌గా పని చేయడం. ఇది శరీరంలోని కణాలను రక్షిస్తుంది. విటమిన్ Eని స్థిరంగా, క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల వైరస్, అనారోగ్యంతో పోరాడటానికి శరీరంలో పటిష్టమైన రక్షణ ఉంటుంది. విటమిన్ E స్కిన్‌ ఎలాస్టిసిటీ, స్కిన్‌ రిపేర్‌, స్కిన్ టోన్‌ పెంచడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. ఇది UV కిరణాలు, ధూళి కణాలు వంటి కాలుష్య కారకాలకు వ్యతిరేకంగా సహాయపడుతుంది. విటమిన్ E సమృద్ధిగా ఉన్న ఉత్పత్తులను ఉపయోగించడం వల్ల అకాల వృద్ధాప్యం రాకుండా ఉంటుంది. శరీరం మొత్తం పనితీరు మెరుగవుతుంది. దీని మరిన్ని బెనిఫిట్స్ చూద్దాం.

* స్కిన్‌ కోసం
విటమిన్ E స్కిన్‌ను రాడికల్ డ్యామేజ్ నుంచి రక్షిస్తుంది. ఈ యాంటీ ఇన్ఫ్లమేషన్ ఏజెంట్‌కు నేచురల్ హీలింగ్‌ లక్షణాలు ఉండటంతో.. విటమిన్‌ E గాయాలను వేగంగా నయం చేయగలదు. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. చర్మం మెరిసిపోయేలా, మృదువుగా, కాంతివంతంగా ఉండేలా పని చేస్తుంది. విటమిన్ Eని స్థిరంగా తీసుకుంటే స్కిన్‌ నాణ్యత సమూలంగా మారుతుంది. అకాల వృద్ధాప్యం దూరమవుతుంది.

* జుట్టు కోసం
విటమిన్ E మాడుపై రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది జుట్టు రాలడాన్ని నియంత్రిస్తుంది. జుట్టు నాణ్యతను మెరుగుపరుస్తుంది. ఇప్పుడు చాలా ప్రొడక్ట్‌లు విటమిన్ E తో తయారవుతున్నాయి. ఈ విటమిన్ సప్లిమెంట్లు జుట్టు పెరుగుదలను పెంచడమే కాకుండా చిక్కులు పడకుంగా కాపాడుతుంది. దెబ్బతిన్న హెయిర్ ఫోలికల్స్‌కు క్లియర్ చేస్తుంది. విటమిన్ E కొవ్వు అధికంగా ఉండే నూనెగా ఉండటం వల్ల, జుట్టు మెరిసేలా చేస్తుంది.

 ఇదీ చదవండి: గేమింగ్ లవర్స్ కు పెద్ద షాక్.. మరో గేమ్ ను బ్యాన్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ !


* విటమిన్ E సాధారణ ప్రయోజనాలు
విటమిన్ E రోగనిరోధక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. వ్యాధులతో పోరాడటంలో శరీరానికి సాయం చేస్తుంది. విటమిన్ E అనేక హృదయ సంబంధ వ్యాధులతో పోరాడటానికి మన శరీరానికి సహాయపడుతుంది. గుండెపోటు, రక్తస్రావం ప్రమాదాన్ని తగ్గిస్తుంది. క్యాన్సర్‌పై పోరాటంలో ఉపయోగించే అనేక మందుల లక్షణాలు ఇందులో ఉన్నాయి. శరీరం రోగనిరోధక వ్యవస్థ స్వయంగా పనిచేయడంలో విటమిన్‌ E ఉపయోగపడుతుందని తేలింది. కంటిశుక్లం ఏర్పడే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.



విటమిన్ E మొత్తం శరీరానికి ఉపయోగపడుతుంది. వ్యాధులతో పోరాడుతుంది. చర్మం, జుట్టును మెరుగుపరుస్తుంది. ఇది యువకులలో చాలా కీలకంగా పని చేస్తుంది. విటమిన్ E వినియోగం స్కిన్‌ నాణ్యతను బాగా ప్రభావితం చేస్తుంది. యాంటీ ఏజింగ్‌లో సహాయపడుతుంది. స్కిన్‌ కేర్‌, జుట్టు సంరక్షణలో చాలా కీలకంగా పని చేస్తుంది.
Published by:Mahesh
First published:

Tags: Beauty, Hair styling, Skin care, Vitamins

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు