news18-telugu
Updated: August 15, 2020, 3:20 AM IST
Health Tips : టైగర్ గ్రాస్ ఉపయోగమేంటి? ఎందుకు వాడాలి? (credit - twitter - Karatica Professional)
Health Benefits of tiger grass : టైగర్ గ్రాస్... ఈ పేరులో రెండు పదాలున్నాయి. టైగర్, గ్రాస్. టైగర్ అంటే పులి కదా... గ్రాస్ అంటే గడ్డి... కానీ... టైగర్ గ్రాస్ అనేది పులి కాదు, గడ్డి కూడా కాదు.... అదో రకమైన మొక్క. పెద్ద పెద్ద ఆకులుంటాయి. ఆ ఆకులే మన చర్మాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. స్కిన్ కేర్ అనేది మనకు చాలా కీలకమైన అంశం. ఎందుకంటే.. మనం ఉండేది... ఉష్ణమండల ప్రదేశంలో. ఎండల నుంచి మనల్ని కాపాడుతున్నది మన స్కిన్‌నే. అందువల్ల దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలంటే... స్కిన్ కేర్ ఉత్పత్తులు వాడాల్సి ఉంటుంది. అలాంటి వాటిలో... టైగర్ గ్రాస్‌తో తయారుచేసే ప్రొడక్ట్స్ చర్మానికి ఎక్కువ మేలు చేస్తాయని స్కిన్ కేర్ స్పెషలిస్టులు చెబుతున్నారు.
నిజానికి మన ఇండియన్స్ స్కిన్ చాలా మంచిది. అది ఎండల నుంచే కాదు... చాలా రకాల వైరస్ల నుంచి మనల్ని కాపాడుతుంది. కాకపోతే... ఒక్కోసారి తీవ్ర ఎండలు, హార్మోన్లలో మార్పులు, తినే ఆహారం, సరిగా పట్టని నిద్ర, టెన్షన్ల వంటివి... స్కిన్ పై ప్రభావం చూపిస్తాయి. చర్మ కణాలను నాశనం చేస్తాయి. ఇలా వీక్‌గా ఉండే కణాల పైనే వైరస్లు దాడి చేస్తాయి. అందువల్ల చర్మ కణాలు బలంగా ఉండేలా చేసుకోవాలి. అందుకోసం టైగర్ గ్రాస్ లాంటివి ఉపయోగపడతాయి.
ఏటా మొక్కలు, మూలికలపై పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. కొత్త ఉత్పత్తులు, స్కిన్ కేర్ ప్రొడక్టులు తయారుచేస్తున్నారు. చర్మం తెల్లబడటానికి ఇప్పుడు బొగ్గు (char coal)తో కూడా ఉత్పత్తులు తయారుచేసి ఫేస్ ప్యాక్‌లు తెచ్చారు. అలా తాజాగా కనిపెట్టిన పవర్ఫుల్ స్కిన్ కేర్ ప్రొడక్టులకు కీలక మూలికగా టైగర్ గ్రాస్ మారింది.
ఇప్పుడు టైగర్ గ్రాస్‌తో తయారయ్యే ఉత్పత్తులు ఆన్లైన్ ఈ-కామర్స్ సైట్లలో లభిస్తున్నాయి. ఈ టైగర్ గ్రాస్ అనేది నల్లటి చర్మాన్ని తెల్లగా, నిగనిగలాడేలా చేసేస్తోందని చాలా మంది దీన్ని కొంటుంటే... రేటు అమాంతం పెరిగిపోయింది. రైతుల దగ్గర కేజీ టైగర్ గ్రాస్‌ను కాస్మొటిక్ కంపెనీలు రూ.80కి కొంటున్నాయి. అలాంటిది... టైగర్ గ్రాస్, ఇతరత్రా పదార్థాలు కలిపి తయారుచేసే... 52 గ్రాముల క్రీమ్ రేటెంతో తెలుసా... రూ.2800కు పైనే. అదీ మరి టైగర్ గ్రాస్‌కి ఉన్న డిమాండ్. కాస్మొటిక్ కంపెనీలు ఇలాంటి ఉత్పత్తులతో దూసుకెళ్తున్నాయి.
అసలేంటి టైగర్ గ్రాస్ అనేది : మన దేశంలో ఆయుర్వేదం ఉంది కదా... చైనాలో మూలికల వాడకం అనాదిగా ఉంది. ఈ టైగర్ గ్రాస్‌తో సంప్రదాయ చైనీయులు మందులు తయారుచేసేవారు. ఎందుకంటే... ఈ టైగర్ గ్రాస్ అనే మొక్క పూర్తిగా ఔషధ గుణాలతో నిండి ఉంటుంది. దీని సైంటిఫిక్ నేమ్ సెంటెల్లా ఎసియాటికా (centella asiatica)
ఈ మొక్క చర్మాన్ని రక్షించే విషయంలో సంజీవని లాంటిదని తెలియడంతో... అమెరికా కంపెనీలు... ఆసియా దేశాల నుంచి ఎగబడి దీన్ని కొనేస్తున్నాయి.
ఇదీ పేరులో దాగివున్న నిజం : ఈ మొక్కకు టైగర్ గ్రాస్ అనే పేరు ఎందుకు పెట్టారంటే... అడవులు బాగా ఉన్న రోజుల్లో... పులులకు గాయాలైతే... అవి తిన్నగా ఈ మొక్కల దగ్గరకు వచ్చి... మొక్కలపై అటూ దొర్లేవి. ఆటోమేటిక్‌గా వాటి గాయాలు నయమయ్యేవి. అదీ మేటర్.
టైగర్ గ్రాస్ అనేది చర్మాన్ని కాపాడటమే కాదు... ముసలితనం రాకుండా కూడా చేస్తుంది. అందుకే మన దేశంలో కూడా ఇప్పుడు టైగర్ గ్రాస్‌తో క్రీములు, లోషన్లు తయారుచేస్తున్నారు. ఈ మొక్కలో ఉండే సాపోనిన్స్... యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగివున్నాయి. అందుకే ఇది ముసలితనానికి చెక్ పెడుతోంది.
Published by:
Krishna Kumar N
First published:
August 15, 2020, 3:15 AM IST