పాల కంటే బీరు బెటర్.. పెటా ఆసక్తికర ప్రకటన..

Beer Benefits : రోజూ గ్లాసు పాలు తాగితే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తూ ఉంటారు. కానీ, పాల కంటే బీరు చాలా బెటర్ అంటోంది పెటా. హార్వర్డ్ మెడికల్ స్కూల్ అధ్యయనంలో ఈ నిజం వెల్లడైందని చెబుతోంది.

news18-telugu
Updated: December 6, 2019, 7:01 PM IST
పాల కంటే బీరు బెటర్.. పెటా ఆసక్తికర ప్రకటన..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
రోజూ గ్లాసు పాలు తాగితే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తూ ఉంటారు. కానీ, పాల కంటే బీరు చాలా బెటర్ అంటోంది పెటా. హార్వర్డ్ మెడికల్ స్కూల్ అధ్యయనంలో ఈ నిజం వెల్లడైందని చెబుతోంది. పెటా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ట్రాకీ రేమన్ మాట్లాడుతూ.. మనం పాలు తాగడం కోసం కోట్లాది ఆవులు ఇబ్బంది పడుతున్నాయని, అదే బీరు తాగితే అలాంటి ఇబ్బందులు ఎదురవవని వెల్లడించారు. డెయిరీ ఉత్పత్తుల వల్ల.. గుండె సంబంధిత వ్యాధులు, ఉబకాయం, మధుమేహం, కేన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయని వివరించింది. అదే బీరు వల్ల ఇవేవీ రావని, పైగా.. ఎముకలు పెళుసుగా మారకుండా చూస్తాయని స్పష్టం చేశారు. ఈ ప్రకటన మందు బాబులకు భళే ఉత్సాహాన్ని ఇస్తోంది. ఇంకేముంది ఎవరైనా వచ్చి పాలు తాగాలని చెబితే.. పెటా ప్రకటన చూపించి బీరు తాగాలని రిటర్న్ సలహా ఇస్తారేమో..!

First published: December 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>