బీర్ ఎక్కువగా తాగుతున్నారా...అయితే మీ సెక్స్ లైఫ్‌కు చెక్ పడే అవకాశం...

యూకేలో 30 జంటలపై సర్వే నిర్వహించగా, అందులో కొన్ని జంటలు బీర్ సేవించి సెక్స్ ఎంజాయ్ చేయగా, మరికొన్ని జంటలు ఏమీ తీసుకోకుండానే సెక్స్ చేశాయి. అయితే బీరు సేవించిన వారికంటే, సేవించని వారే ఎక్కువ సేపు ఎంజాయ్ చేసినట్లు పరిశోధనలో తేలింది.

news18-telugu
Updated: August 20, 2019, 10:47 PM IST
బీర్ ఎక్కువగా తాగుతున్నారా...అయితే మీ సెక్స్ లైఫ్‌కు చెక్ పడే అవకాశం...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
చాలా మంది యూత్ బీర్ అనగానే యమ ఇష్టంగా తాగేస్తుంటారు. పోటీలు పెట్టుకొని మరీ సేవిస్తుంటారు. అయితే బీరు తాగిన తర్వాత మాత్రం సెక్స్ లో ఎంజాయ్ చేయాలంటే మాత్రం కాస్త కష్టమే అంటున్నారు నిపుణులు. తరచూ బీరు సేవిస్తే అది వారి సెక్సువల్ జీవితం మీద ఎఫెక్ట్ చూపిస్తుందని వైద్యులు సెలవిస్తున్నారు. ముఖ్యంగా సెక్స్ చేసే ముందు బీర్ సేవిస్తే అది సామర్థ్యాన్ని తగ్గిస్తుందని చెబుతున్నారు. యూకేలో 30 జంటలపై సర్వే నిర్వహించగా, అందులో కొన్ని జంటలు బీర్ సేవించి సెక్స్ ఎంజాయ్ చేయగా, మరికొన్ని జంటలు ఏమీ తీసుకోకుండానే సెక్స్ చేశాయి. అయితే బీరు సేవించిన వారికంటే, సేవించని వారే ఎక్కువ సేపు ఎంజాయ్ చేసినట్లు పరిశోధనలో తేలింది. ముఖ్యంగా బీరులోని ఫైటో ఈస్ట్రోజన్స్ వల్ల సెక్స్ కోరికలు తగ్గే అవకాశం ఉంది. అంతేకాదు తరచూ బీరు సేవిస్తే స్థూలకాయం కూడా వచ్చే అవకాశం ఉంది. స్థూలకాయం కూడా సెక్స్ కు శత్రువే అని నిపుణులు సెలవిస్తున్నారు.

First published: August 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు