Egg White: గుడ్డు తెల్లసొనతో ముఖానికి ప్యాక్.. హీరోయిన్‌లా మెరిసిపోతారంతే..

ప్రతీకాత్మక చిత్రం

కరోనా మహమ్మారి సమయంలో మీరు పార్లర్‌కు వెళ్లి తంటాలు తెచ్చుకునే బదులు ఓ నాలుగు గుడ్లు తెచ్చుకుని రెండు మీకు నచ్చినట్టు వండుకుని తినండి. మిగిలిన రెంటిలో ఒకటి తలకు పట్టించండి మరోటి ఓ స్పూనంత తీసుకుని ముఖానికి ప్యాక్‌లా వేసుకోండి.

  • Share this:
అందానికి, ఆరోగ్యానికి కోడిగుడ్డు చాలా మంచిదన్న విషయం మనందరికీ తెలిసిందే. ఫిట్‌గా ఉండాలన్నా, మీ జుట్టు పట్టుకుచ్చులా మెరవాలన్నా అందుకు కోడిగుడ్డు చాలా బాగా ఉపయోగపడుతుంది. తక్కువ ధరలోనే దొరికే కోడిగుడ్డు చేసే వండర్స్ మనందరికీ తెలిసినా ఎందుకో మనం మార్కెట్లో లభించే క్రీములు, లోషన్లు వంటివాటిపైనే ఎక్కువ మనసు పారేసుకుంటున్నాం. వాటి బదులు సహజసిద్ధమైన గుడ్లను ఒంటికి రాసుకుంటే చాలు మీ చర్మం సరికొత్త నిగారింపును సంతరించుకుంటుంది. గుడ్డు పలు రకాల చర్మ సమస్యలు మటుమాయం అయ్యేలా చేస్తుంది. సైడ్ ఎఫెక్ట్స్ లేని ఈ ఎగ్ ప్యాక్ లు చేసుకోవటం చిటికెలో పని. ఏదేమైనా మన వంటింట్లోకి వెళ్తే, ఆరోగ్యానికి, అందానికి కావాల్సిన సామానంతా ఇట్టే దొరికిపోతుంది. దీంతో జుట్టుకు, ముఖానికి ప్యాక్ వేసుకొని చూస్తే చాలు.. మీ ముఖం మెరిసిపోవడం ఖాయం. అందుకే ఈ కరోనా మహమ్మారి సమయంలో మీరు పార్లర్‌కు వెళ్లి తంటాలు తెచ్చుకునే బదులు ఓ నాలుగు గుడ్లు తెచ్చుకుని రెండు మీకు నచ్చినట్టు వండుకుని తినండి. మిగిలిన రెంటిలో ఒకటి తలకు పట్టించండి మరోటి ఓ స్పూనంత తీసుకుని ముఖానికి ప్యాక్‌లా వేసుకోండి. అంతే..

పోషకాలు ఎక్కువ..

గుడ్డులో సహజంగా ఉన్న పోషకాల కారణంగా ఇవి ఏరూపంలో తిన్నా, వీటిని ప్యాక్ లా ఉపయోగించినా చక్కని ప్రయోజనం ఉంటుంది. ముఖ్యంగా ఎగ్ వైట్ లో మొత్తం ప్రొటీన్ ఉండడం వల్ల దాన్ని ముఖానికి, జుట్టుకు పట్టించడం వల్ల అది మీ అందాన్ని రెట్టింపు చేస్తుంది. మన పూర్వికులు కూడా గుడ్లను ఇలా వివిధ రూపాల్లో విస్తృతంగా వాడి వాటి ప్రయోజనాలను మనకు చిట్కాల రూపంలో అందించేందుకు కారణం ఇదే.

యాంటీ-ఏజింగ్..

ఇది వృద్ధాప్య ఛాయలను పోస్ట్ పోన్ చేయటానికి ఎగ్ వైట్ అద్భుతంగా పనిచేస్తుంది. ఒక టీ స్పూన్ ఎగ్ వైట్ తీసుకుని, అందులో 2-3 చుక్కలు ఎసెన్షియల్ ఆయిల్ కలిపి ముఖం, మెడపైన ప్యాక్ లా రాసుకుంటే మీ చర్మం బాగా బిగుతుగా మారుతుంది. దీంతో ముఖంపై వచ్చే ముడతలు, సన్నని లైన్స్ అన్నీ పోయి, తాజాగా కనిపిస్తారు. లేదా ఒక టీ స్పూన్ ఎగ్ వైట్ లోకి సగం టీ స్పూను తేనె రంగరించి రాసినా మీ చర్మంపై ముడతలు మాయం. ఇలా 15 రోజులకు ఒకసారి చేస్తే చాలు.. చర్మానికి మంచి చికిత్స అందినట్టే.

జిడ్డు కారే చర్మంపై..

ఎగ్ వైట్ వాడడం వల్ల మన చర్మంపై ఉన్న మృతకణాలు వంటివి అన్నీ పోయి, చర్మం శుభ్రంగా, స్వచ్ఛంగా మారుతుంది. బ్లాక్ హెడ్స్ కు కూడా ఇది చక్కని విరుగుడుగా పనిచేస్తుంది. ఆయిలీ స్కిన్ వారు ఎగ్ వైట్ తో పాటు నిమ్మ రసం, తేనె కలిపి రాసినా మంచి ప్రయోజనం కనిపిస్తుంది. జిడ్డు కారడం తగ్గటమే కాదు చర్మం రంగు కూడా మెరుగుపడుతుంది. బ్లాక్ హెడ్స్ పదేపదే రాకుండా కూడా గుడ్డులోని తెల్ల సొన నివారిస్తుంది. గుడ్డులోని మినరల్స్, విటమిన్స్, ప్రొటీన్స్ చర్మంపై అద్భుతాలను చేస్తుంది కనుక ఎగ్ వైట్ ను తరచూ లేపనాలుగా వాడండి.

ఇవి కూడా చదవండి:

First time Parents: మొదటిసారి తల్లిదండ్రులు కాబోతున్నారా? ఈ జాగ్రత్తలు  

Healthy Pregnancy: గర్భిణీలు అండర్ వైర్ బ్రాలు ధరిస్తే ప్రమాదమా? ఖచ్చితంగా తెలుసుకోండి
Published by:Shiva Kumar Addula
First published: