మోకాలు, మోచేతులపై నలుపుదనం తగ్గించే చిట్కాలు..

చాలామందికి మోకాలి, మోచేతులపై నలుపు ఎక్కువగా ఉంటుంది. దాంతో బ్యూటీ పార్లర్స్ చుట్టూ తిరుగుతూ నలుపుదనాన్ని పోగొట్టుకోవాలని ప్రయత్నిస్తుంటారు. అలాంటివారి కోసం ఈ చిట్కాలు..

చాలామందికి మోకాలి, మోచేతులపై నలుపు ఎక్కువగా ఉంటుంది. దాంతో బ్యూటీ పార్లర్స్ చుట్టూ తిరుగుతూ నలుపుదనాన్ని పోగొట్టుకోవాలని ప్రయత్నిస్తుంటారు. అలాంటివారి కోసం ఈ చిట్కాలు..

 • Share this:
  కొందరి శరీరం తళతళా మెరుస్తుంటుంది. కానీ మోచేతులు, మోకాళ్ల వద్ద మాత్రం నలుపు ఉంటుంది.  బ్యూటీపై శ్రద్ద పెట్టేవారు ఆ నలుపును పోగొట్టుకునేందుకు  బ్యూటీ పార్లర్స్ చుట్టూ తిరుగుతారు. ఏవేవో క్రీమ్స్ వాడుతుంటారు. అయినా సరే ఫలితం కనిపించదు. అయితే సహజసిద్ధమైన చిట్కాల ద్వారా మోకాలి, మోచేతులపై ఉండే నలుపుదనాన్ని పోగొట్టవచ్చు.
  పాలు, బేకింగ్ సోడా : బేకింగ్ సోడాలో కాసిన్ని పాలు కలపాలి. ఈ మిశ్రమాన్ని మోకాళ్లు, మోచేతులపై అప్లై చేయాలి. ఈ మిశ్రమాన్ని రాసేముందు కాసేపు ఫ్రిజ్‌లో పెడితే మంచి ఫలితం ఉంటుంది.
  శనగపిండి, పెరుగు : కాసింత శనగపిండిలో పెరుగు కలిపి పేస్ట్‌లా చేయాలి. ఇది చర్మంపై ఎక్స్‌ఫోలియేట్‌లా పనిచేస్తుంది. వీటిని మోచేతులు, మోకాళ్లపై అప్లై చేయాలి. కాస్త ఆరాక కాసిన్ని నీళ్లు చల్లి క్లీన్ చేస్తే నలుపుదనం తగ్గుతుంది.
  నిమ్మరసం : నిమ్మరసం కూడా నలుపుదనం తగ్గించడంలో ఉపయోగపడుతుంది. కాబట్టి నిమ్మరసం తీసుకుని అందులో కాస్త రోజ్‌వాటర్ కలిపి అప్లై చేస్తే నలుపుదనం తగ్గుతుంది.
  కొబ్బరినూనె : కొబ్బరినూనె రాయడం వల్ల కూడా శరీరంపై ఉండే నలుపుదనం తగ్గిపోతుంది. స్నానం చేశాక.. కొబ్బరినూనెని మోచేతులు, మోకాలిపై రోజూ అప్లై చేస్తే.. మెల్లిగా నలుపుదనం తగ్గుతుంది.
  అలోవేరా : అలోవెరా జెల్ రాయడం వల్ల ఒంటిపై ఉండే నలుపుదనం తగ్గుతుంది. కాబట్టి.. అలోవేరాలో.. కాస్త బియ్యంపిండి కలిసి మోచేతులు, మోకాలిపై అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
  First published: