నిమిషాల్లోనే ముఖం మెరవాలంటే ఇలా చేయండి..

చాలా సందర్భాల్లో అప్పటికప్పుడు ఏదో ఫంక్షన్‌కి వెళ్లాల్సి వస్తుంది. అలాంటి సమయంలో వెంటనే బ్యూటీ పార్లర్ వెళ్లలేం కదా.. అందుకని.. నిమిషాల్లోనే అందంగా మారేందుకు ఈ టిప్స్ పాటించండి..

Amala Ravula | news18-telugu
Updated: May 5, 2019, 5:51 PM IST
నిమిషాల్లోనే ముఖం మెరవాలంటే ఇలా చేయండి..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
పార్టీలు, ఫంక్షన్స్‌లో అందంగా కనిపించాలని అందరికీ ఉంటుంది. అలాంటప్పుడు బ్యూటీ పార్లర్స్ చుట్టూ తిరగడమే కాదు.. ఇంట్లోని కొన్ని వస్తువులను కూడా ఉపయోగించి అందంగా తయారవ్వొచ్చు. అందుకోసమే ఈ చిట్కాలు.

* ముందుగా ఏదైనా ఫేస్ వాష్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత మొత్తటి టవల్‌తో తుడుచుకోవాలి.

*  ఇప్పుడు స్క్రబ్ చేయాలి. అంటే ఓ స్పూన్ తేనెలో అంతే చక్కెర కలిపి బాగా రాయాలి.. కావాలంటే నిమ్మరసం 2 చుక్కలు యాడ్ చేయొచ్చు.

తర్వాత ఫేస్ ప్యాక్ వేసుకోవాలి...

* కావాలసిన పదార్థాలు.. శెనగపిండి - ఓ టీస్పూన్, పాలపొడి -టీస్పూన్, పాలు(లేదా) రోజ్ వాటర్- 2 టీస్పూన్స్...
* ముందుగా ఓ బౌల్ తీసుకుని అందులో శనగపిండి, పాలపొడి కలపాలి.
* ఇప్పుడు ఆ మిశ్రమంలో రోజ్ వాటర్ వేసుకుని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి.* ఇలా తయారైన మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి.
* 15 నిమిషాలు అయ్యాక కొన్ని వాటర్ చల్లి నెమ్మదిగా రబ్ చేస్తూ చల్లని నీటితో కడిగేయాలి.
* ఇప్పుడు అలోవేరా జెల్‌ని కాస్తా చేతిలోకి తీసుకుని 2 నిమిషాల్ మసాజ్ చేస్తే సరి..

ఇప్పుడు వచ్చిన తేడాను మీరే గమనించొచ్చు. కేవలం శనగపిండే కాదు.. ముల్తానీ, బియ్యంపిండి ఇలా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. పాలకి బదులు నచ్చిన పండు రసాన్ని కలిపితే అదనపు అందం మీ సొంతం.
First published: May 5, 2019, 5:51 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading