రెగ్యులర్‌గా ఈ ఎగ్‌మాస్క్ వేసుకుంటే అందం మీ సొంతం..

Beauty Tips | గుడ్డు తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటాం. ఇది హెల్దీ పాయింట్.. అయితే.. గుడ్డు తెల్ల,పచ్చ సొనలు రాయడం వల్ల అందంగా మారుతాం కూడా.. కేవలం ముఖానికే కాదు.. జుట్టుకి కూడా గుడ్డులోని పోషకాలు ఎంతో మెరుపునిస్తాయి..

Amala Ravula | news18-telugu
Updated: May 22, 2019, 1:57 PM IST
రెగ్యులర్‌గా ఈ ఎగ్‌మాస్క్ వేసుకుంటే అందం మీ సొంతం..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
గుడ్డు తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటాం. ఇది హెల్దీ పాయింట్.. అయితే.. గుడ్డు తెల్ల,పచ్చ సొనలు రాయడం వల్ల అందంగా మారుతాం కూడా.. కేవలం ముఖానికే కాదు.. జుట్టుకి కూడా గుడ్డులోని పోషకాలు ఎంతో మెరుపునిస్తాయి.. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం...

ముఖం కోసం..
* గుడ్డులోని తెల్ల సొనలో అరటిపండు గుజ్జు, ముల్తానీ మట్టి కలిపి ముఖానికి రాయాలి.. 15 నిమిషాల తర్వాత కడిగితే మెరుపు మీ సొంతమవుతుంది. ముడతలు రాకుండా ఈ ప్యాక్ చక్కగా పనిచేస్తుంది.

* తెల్లసొనలో తేనె, నిమ్మరసం, దోసరసం రాయడం వల్ల ముఖం మీది మచ్చలు, కంటికింద నల్లని వలయాలు తగ్గుతాయి.
* అలానే పచ్చసొనలో తేనె కలిపి రాయడం వల్ల చర్మం కొత్తకాంతిని సంతరించుకోవడమే కాకుండా.. ముడతలను తగ్గిస్తుంది.


* పచ్చసొనలో కాస్త ఆల్మండ్ ఆయిల్, అలోవేరా జెల్ కలిపి రాయాలి. ముఖ్యంగా డ్రైస్కిన్ వారికి ఈ ప్యాక్ ఎంతో బాగా పనిచేస్తుంది.
జుట్టు కోసం..
Loading...
* చాలా సందర్భాల్లో జుట్టు డ్రైగా మారుతుంటుంది. అలాంటి సమయంలో గుడ్డులోని తెల్లసొన రాయాలి.. అరగంట అనంతరం గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా 15 రోజులకోసారి చేస్తే జుట్టు పట్టుకుచ్చులా మారడం ఖాయం.
* జుట్టు పెరగాలని భావించే మహిళలు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి.. రెండు గుడ్లలోని పచ్చ, తెల్లసొనలో.. రెండు టేబుల్ స్పూన్స్‌ల ఆలివ్ ఆయిల్, రెండు టేబుల్ స్పూన్స్ తేనె కలపాలి.. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకి రాసి 70శాతం ఆరాక కేవలం నీటితోనే కడిగేయాలి.
First published: May 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...