ఆత్మవిశ్వాసమే ఆమె అందం.. మతి పోగొడుతున్న మరగుజ్జు మోడల్

మోడలింగ్‌లో రాణించాలంటే అందమైన ముఖారవిందం, ఆకట్టుకునే శరీరాకృతి ఉండాలి. లేదంటే ఆ అందాల ప్రపంచంలో రాణించడం కష్టం. కానీ, అదంతా ఉత్తిదేనని, ఆత్మవిశ్వాసం ముందు అవన్నీ దిగదుడుపేనని నిరూపించిస్తోంది ఈ పొట్టి సుందరి.

news18-telugu
Updated: January 23, 2019, 4:17 PM IST
ఆత్మవిశ్వాసమే ఆమె అందం.. మతి పోగొడుతున్న మరగుజ్జు మోడల్
మోడలింగ్‌లో రాణించాలంటే అందమైన ముఖారవిందం, ఆకట్టుకునే శరీరాకృతి ఉండాలి. లేదంటే ఆ అందాల ప్రపంచంలో రాణించడం కష్టం. కానీ, అదంతా ఉత్తిదేనని, ఆత్మవిశ్వాసం ముందు అవన్నీ దిగదుడుపేనని నిరూపించిస్తోంది ఈ పొట్టి సుందరి.
  • Share this:
మోడలింగ్‌లో రాణించాలంటే అందమైన ముఖారవిందం, ఆకట్టుకునే శరీరాకృతి ఉండాలి. లేదంటే ఆ అందాల ప్రపంచంలో రాణించడం కష్టం. కానీ, అదంతా ఉత్తిదేనని, ఆత్మవిశ్వాసం ముందు అవన్నీ దిగదుడుపేనని నిరూపించిస్తోంది ఈ పొట్టి సుందరి. హంస నడకల హొయలతో, మతిపోగొట్టే శరీరాకృతితో బ్యూటీలవర్స్‌ని మెస్మరైజ్ చేస్తుంటారు అందాల భామలు. మోడలింగ్ రంగాన్ని షేక్ చేస్తుంటారు. అలాంటి బ్యూటీ వరల్డ్‌లో ఓ పొట్టి సుందరి సత్తా చాటుతోంది. చూడ్డానికి పొట్టిగానే ఆత్మవిశ్వాసంలో తాను చాలా గట్టిదాన్నని నిరూపిస్తోంది. మోడలింగ్ రంగంలో సంచలనంగా మారింది.

dwarf model dru presta, dru presta hot photo shoot, dru presta photos, modelling, fashion world, ramp walk, photo shoot, మరగుజ్జు మోడల్ డ్రూ ప్రిస్టా, మోడలింగ్, ఫ్యాషన్ వరల్డ్, ర్యాంప్ వాక్, హాట్ ఫొటో షూట్, డ్రూ ప్రిస్టా హాట్ ఫొటో షూట్, డ్రూ ప్రిస్టా ఫొటోస్
మోడల్ డ్రూ ప్రిస్టా

ఈమె పేరు డ్రూ ప్రిస్టా. వయసు 22 సంవత్సరాలు. హైటు మాత్రం 3 అడుగుల 4 అంగుళాలు. లాస్ ఏంజిల్స్‌కు ఈ అమ్మాయి.. అచ్చంగా చెప్పాలంటే ఓ మరగుజ్జు. కానీ, ఆ లోపం ఆమెను మాడలింగ్ రంగంలోకి రాకుండా ఆపలేకపోయింది. ర్యాంప్‌పై హంసనడకల హొయలు ఒలికించకుండా అడ్డుకోలేకపోయింది.

dwarf model dru presta, dru presta hot photo shoot, dru presta photos, modelling, fashion world, ramp walk, photo shoot, మరగుజ్జు మోడల్ డ్రూ ప్రిస్టా, మోడలింగ్, ఫ్యాషన్ వరల్డ్, ర్యాంప్ వాక్, హాట్ ఫొటో షూట్, డ్రూ ప్రిస్టా హాట్ ఫొటో షూట్, డ్రూ ప్రిస్టా ఫొటోస్
మోడల్ డ్రూ ప్రిస్టా

తన హైటు తగ్గట్టు, సైజుకు తగ్గట్టు డ్రెస్సింగ్‌లో, లైఫ్‌స్టైల్‌లో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకుంది ప్రిస్టా. ఇతర మోడలింగ్ భామలకు పోటీగా నిలుస్తోంది. ప్రముఖమైన కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ సత్తా చాటుతోంది.

dwarf model dru presta, dru presta hot photo shoot, dru presta photos, modelling, fashion world, ramp walk, photo shoot, మరగుజ్జు మోడల్ డ్రూ ప్రిస్టా, మోడలింగ్, ఫ్యాషన్ వరల్డ్, ర్యాంప్ వాక్, హాట్ ఫొటో షూట్, డ్రూ ప్రిస్టా హాట్ ఫొటో షూట్, డ్రూ ప్రిస్టా ఫొటోస్
మోడల్ డ్రూ ప్రిస్టా

ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉండే డ్రూ ప్రిస్టా‌కు మంచి ఫాలోయింగే ఉంది. దాదాపు హాఫ్ మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారామెకు. మోడలింగ్ రంగంలో తన విజయాన్ని నమోదు చేసిన డ్రూ.. తనలాంటి ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది.
dwarf model dru presta, dru presta hot photo shoot, dru presta photos, modelling, fashion world, ramp walk, photo shoot, మరగుజ్జు మోడల్ డ్రూ ప్రిస్టా, మోడలింగ్, ఫ్యాషన్ వరల్డ్, ర్యాంప్ వాక్, హాట్ ఫొటో షూట్, డ్రూ ప్రిస్టా హాట్ ఫొటో షూట్, డ్రూ ప్రిస్టా ఫొటోస్
మోడల్ డ్రూ ప్రిస్టా

ఇక, ఆమె ఫొటోషూట్‌లను చూస్తే మతిపోవాల్సిందే. పొడువు తక్కువన్న మాటేగాని, మోడలింగ్‌లో రాణించాలన్న కసి, పట్టుదల అణువణువునా ఆమె పిక్స్‌లో స్పష్టంగా కనిపిస్తుంది. మొహంలో చిరునవ్వుతో, అంతులేని ఆత్మవిశ్వాసంతో కనిపిస్తూ అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది ఈ భామ.

ఇది కూడా చూడండి:

First published: January 23, 2019, 4:16 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading