హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Health Tips: గొంతు నొప్పి, యూరినరీ ఇన్‌ఫెక్షన్‌లకు రేగు ఆకులతో చెక్.. ఇలా వాడండి

Health Tips: గొంతు నొప్పి, యూరినరీ ఇన్‌ఫెక్షన్‌లకు రేగు ఆకులతో చెక్.. ఇలా వాడండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Health Tips: గొంతునొప్పి, యూరినరీ ఇన్ఫెక్షన్లతో పాటు అనేక రకాల అనారోగ్య సమస్యలకు రేగు ఆకులు ప్రయోజనకరంగా ఉంటాయి. రేగు ఆకులను డికాక్షన్ రూపంలో లేదంటే పేస్ట్ రూపంలో కూడా ఉపయోగించవచ్చు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  రేగు పళ్ల గురించి గ్రామీణ ప్రాంతాలలో ఉండే వారికి బాగా తెలుసు. పల్లెల్లో చాలా విరివిగా లభిస్తాయి. సంక్రాంతి సీజన్‌లో ఎక్కువగా దొరుకుతాయి. రోడ్ల వెంబడి, పంట పొలాల్లో ఎక్కడపడితే అక్కడ ఈ చెట్లు కనిపిస్తాయి. పట్టణాల్లో కూడా తోపుడు బండ్లపై వీటిని విక్రయిస్తారు. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. పొటాషియం, ఫాస్పరస్, ఐరన్, జింక్, మాంగనీస్, విటమిన్ సి, యాంటీ యాక్సిడెంట్లు పుష్కలంగా ప్లంలో ఉన్నాయి. రేగు పండ్ల తింటే వృద్ధాప్య ప్రభావం తగ్గుతుంది. ఫ్రీ రాడికల్స్ దెబ్బతినకుండా రక్షిస్తుంది. కేవలం పండ్లు మాత్రమే కాదు రేగు చెట్టు ఆకులతో కూడా ఎన్నో ప్రయోజనాలున్నాయి.  ఈ ఆకుల్లో ఔషధ గుణాలున్నందున ఆయుర్వేదంలో వినియోగిస్తారు. గొంతునొప్పి, యూరినరీ ఇన్ఫెక్షన్లతో పాటు అనేక రకాల అనారోగ్య సమస్యలకు రేగు ఆకులు ప్రయోజనకరంగా ఉంటాయి. రేగు ఆకులను డికాక్షన్ రూపంలో లేదంటే పేస్ట్ రూపంలో కూడా ఉపయోగించవచ్చు. మరి రేగు ఆకుల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

  Home Remedies: మీ చర్మంపై పగుళ్లు వస్తున్నాయా..? ఈ టిప్స్‌తో మృదువుగా మార్చుకోండి..

  రేగు ఆకులతో ప్రయోజనాలు:

  1. మీకు గొంతు నొప్పి సమస్య ఉంటే రేగు ఆకులు చక్కగా పనిచేస్తాయి. ఈ ఆకులతో కషాయం చేసి తాగాలి. రేగు ఆకులను తీసుకొని మిక్సీలో వేసి పేస్ట్‌లా చేయాలి. దానిని నీటిలో వేసి కాసేపు మరిగించాలి. ఆ తర్వాత ఓ గ్లాస్‌లో వడగట్టి.. చిటికెడు ఉప్పు, మిరియాల పొడిని కలిపాలి. ఈ రేగు ఆకుల కషాయం తాగితే గొంతు నొప్పి తగ్గుతుంది.

  2. మూత్ర సంబంధ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. యూరిన్ ఇన్ఫెక్షన్, యూరిన్‌లో మంటగా అనిపించడం వంటి సమస్యలకు ఇవి బాగా పనిచేస్తాయి. గోరువెచ్చని నీటిలో జుజుబీ ఆకుల రసాన్ని కలిపి తాగవచ్చు.

  Hair Care tips: ఇంట్లోనే ఇలా హెయిర్ కేర్ తీసుకోండి.. జుట్టు మెరిసిపోతుంది

  3.బరువును అదుపులో ఉంచుకోవచ్చు. మీరు లావుగా ఉండి.. బరువు తగ్గాలని అనుకుంటే.. రేగు ఆకులను తీసుకోండి. రేగు ఆకులను మెత్తగా నలగ్గొట్టి.. వాటిని రాత్రంతా నీటిలో ఉంచాలి. ఈ నీటిని ఉదయం వడగట్టి ఖాళీ కడుపుతో తాగాలి. ఈ నీటిని కొన్ని రోజులు క్రమం తప్పకుండా తాగడం వల్ల బరువు అదుపులో ఉంటుంది. శరీరం నాజూగ్గా మారుతుంది.

  4. గాయాలు మానడంలో రేగు ఆకులు దోహదపడతాయి. మీకు శరీరంలో ఏ భాగంలోనైనా గాయం అయితే.. రేగు ఆకులను మెత్తగా రుబ్బుకోవాలి. ఆ పేస్ట్‌ను గాయం ఉన్న ప్రదేశంలో రాయాలి. ఇలా చేయడం వల్ల వాపు సమస్య నయమై గాయం తొందరగా మానుతుంది.

  5. కంటి మొటిమలను తగ్గిస్తుంది. మీ కళ్లలో మొటిమలు లేదా కావిటీస్ ఉంటే మీరు రేగు ఆకులను ఉపయోగించవచ్చు. ఈ సమస్య నుంచి బయటపడాలంటే రేగు ఆకుల రసాన్ని కంటి బయటి భాగంలో రాయండి. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రేగు ఆకుల రసం నేరుగా కంటి లోపలికి వెళ్లకూడదని గుర్తుంచుకోవాలి.

  (Disclaimer: ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. వీటిని అమలుచేసే ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం.)

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Health, Health Tips, Life Style, Lifestyle

  ఉత్తమ కథలు