రోజూ అరటిపండు banana తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్నో. వ్యాయామం చేసే ముందు, ఆ తర్వాత కూడా అరటి పండు తింటారు. దీంతో శక్తిసామర్థ్యాలు పెరుగుతాయి. రోజంతా అలసిపోకుండా ఉండటానికి సహాయపడుతుంది. అరటిలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అందుకే ప్రతిరోజూ ఒక అరటిపండు తింటే, అవి ఆరోగ్యానికి ఎంతో రక్షణ గా పనిచేస్తాయి.
పేగు ఆరోగ్యానికి..
శరీరం ఆరోగ్యంగా ఉండటానికి పేగులు ముఖ్య పాత్ర వహిస్తాయి. 2017 న్యూట్రిషియన్ అధ్యయనం ప్రకారం అరటిలో పేగుకు అవసరమయ్యే కొవ్వు ఆమ్లాల ఉత్పత్తిని పెంచే గుణం ఉంటుంది. అందుకే అరటి మన ఆరోగ్యాన్ని స్థిరంగా ఉంచడానికి సహాయపడతాయి.
బరువు తగ్గడం..
రోజూ అరటిపండు తినడం వల్ల మన బరువును తగ్గించుకోవచ్చు. ఫైబర్, ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. ఒక అరటిపండులో 100 కేలరీల కంటే ఎక్కువగా ఉన్నా ఆరోగ్యాన్ని నిలకడగా ఉంచడానికి దోహదం చేస్తాయి.
చర్మ సంరక్షణకు..
చర్మ సంరక్షణకు కావాల్సిన ముఖ్యమైన ఆహారం ఏదంటే ముందు వరుసలో అరటే ఉంటుంది. బనానాలో విటమిన్లు, మిన రల్స్ ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఇందులో మాంగనీస్ కొల్లాజెన్ స్థాయిని పెంచుతుంది. ఏవైనా చర్మ సమస్యలు ఉంటే.. అరటిపండు తినడం వల్ల మొటిమలు, ముడతలు, డ్రై స్కిన్ సమస్యలు తొలగిపోతాయి.
ఇమ్యూనిటీ బూస్టర్..
వ్యాయామానికి ముందు ఆ తర్వాత అరటిపండు తింటే శక్తి సామర్థ్యాలు పెంచుతాయి. రోజంతా అలసిపోకుండా ఉండటానికి సహాయపడుతుంది. అందువల్ల అరటిపండ్లు తినడం వల్ల శరీరంలో శక్తిని పెంచుతుంది.
అరటిపండును కేశాలకు కూడా మంచి కండిషనర్‌గా పనిచేస్తుంది. దీంతో హెయిర్ డ్రై అయి స్ల్సిట్ ఎండ్స్ రాకుండా ఉంటాయి. దీంతో మీ కేశాలు కూడా ఆరోగ్యవంతంగా ఉంటాయి,
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Banana, Health benefits