రెగ్యులర్‌గా శృంగారం చేయకపోతే ఎంత ప్రమాదమో తెలుసా...?

శరీరంలో ఎన్నో మేలు చేసే హార్మోన్స్ స్త్రీ పురుషులిద్దరిలో శృంగారం చేసే సమయంలో విడుదల అవుతాయి. ఆ హార్మోన్స్ శారీరక, మానసిక ఆరోగ్యానికి అత్యంత అవసరమైనవి మరి సెక్స్ కి దూరమైతే ఆ హార్మోన్స్ ఇక శరీరంలో విడుదల అవ్వవు. ఫలితంగా శారీరక, మానసిక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.

news18-telugu
Updated: July 22, 2019, 8:21 PM IST
రెగ్యులర్‌గా శృంగారం చేయకపోతే ఎంత ప్రమాదమో తెలుసా...?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మనిషి జీవితంలో తిండి, నిద్ర ఎంత అవసరమో, శృంగారం కూడా అంతే అవసరం అంటున్నారు పరిశోధకులు. ప్రకృతికి విరుద్ధంగా శృంగార జీవితానికి దూరంగా ఉంటే మాత్రం ప్రమాదం కొని తెచ్చుకున్నట్లే అంటున్నారు శాస్త్రవేత్తలు. ముఖ్యంగా శరీరంలో ఎన్నో మేలు చేసే హార్మోన్స్ స్త్రీ పురుషులిద్దరిలో శృంగారం చేసే సమయంలో విడుదల అవుతాయి. ఆ హార్మోన్స్ శారీరక, మానసిక ఆరోగ్యానికి అత్యంత అవసరమైనవి మరి సెక్స్ కి దూరమైతే ఆ హార్మోన్స్ ఇక శరీరంలో విడుదల అవ్వవు. ఫలితంగా శారీరక, మానసిక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. శృంగార జీవితానికి దూరంగా ఉంటే వచ్చే ఇబ్బందులు ఇలా ఉన్నాయి.

డిప్రెషన్ పెరగడం: శృంగారం తరచూ చేసే వారిలో ఒత్తిడి తగ్గి శారీరికంగానూ, మానసికంగానూ ఆరోగ్యంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా శృంగారం చేసే వారిలో రక్తపోటు నియంత్రణలో ఉండటంతో పాటు మెదడు చెందిన కణాలు సైతం చురుగ్గా ఉంటాయి. అలాగే శరీరంలో ఆక్సిటోసిన్‌ హార్మోన్‌ విడుదల అవుతుంది. ఈ హార్మోన్ వల్ల వ్యక్తి ఆనందంగా ఉంటాడు. అలాగే ఒత్తిడి నుంచి దూరంగా ఉండవచ్చు.

జననాంగాల్లో లోపాలు : సడెన్ గా శృంగారం మానివేసే జంటల్లో జనానంగ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ముఖ్యంగా శృంగారం దూరమైన స్త్రీలలో చిరాకు, ఉద్రేకం, కోపం కలుగుతుంటాయి. ఇందుకు జననాంగాల్లో స్రవించే ద్రవాలు ఆగిపోవడమే అని పరిశోధనలు వెలువడ్డాయి. అంతేకాదు స్త్రీ జననాంగాల్లో స్రవాలు ఊరకపోతే యోనిలో ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఆ జనానాంగాల్లో స్రవించే స్రవాల వల్ల యోనిలో బ్యాక్టీరియా వృద్ధి చెందకుండా ఉంటుంది. అయితే శృంగారం మానివేస్తే మాత్రం బ్యాక్టీరియా ప్రమాదం పొంచి ఉంది.

రోగ నిరోధక శక్తి తగ్గడం : శృంగారం తరచూ చేసేవారిలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుందని పరిశోధనలు వెల్లడించాయి. ముఖ్యంగా రెగ్యులర్ గా సెక్స్ చేసేవారిలో ఇమ్యూనిటీ పెరుగే ఛాన్స్ ఎక్కువ. శృంగారం వల్ల చక్కటి వ్యాయామం శరీరానికి మిస్ అవుతుంది. ఫలితంగా ఒబేసిటీ, గుండె సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

First published: July 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు