Migraine pain : మైగ్రేన్(Migraine)అనేది నాడీ సంబంధిత రుగ్మత. ఇది సాధారణంగా మందులు, జీవనశైలి మార్పులతో చికిత్స పొందుతుంది. ఆయుర్వేదం కూడా దీనికి చికిత్సగా( Ayurvedic treatment for migraine)పరిగణించబడుతుంది. ఆయుర్వేదంలో మైగ్రేన్ ట్రీట్మెంట్ మూలికా ఔషధం ఉపయోగించబడుతుంది, ఇది మైగ్రేన్ పెయిన్ లో ఉపశమనాన్ని అందిస్తుంది. ఆయుర్వేదం మనస్సు, శరీరం, ఆత్మను కలిపి ఏ వ్యాధికైనా చికిత్స చేస్తుంది. ఆయుర్వేద నిపుణులు జీవులు గాలి, నీరు, ఆకాశం, అగ్ని, భూమి అనే ఐదు మూలకాలను కలిగి ఉంటారని నమ్ముతారు. ఈ మూలకాలు శరీరం యొక్క శక్తిని, వాత, పిత్త మరియు కఫా సమస్యలను చెక్ చేస్తాయి. ఈ విధంగా శరీరంలోని అన్ని భాగాలు ఒకదానికొకటి అనుసంధానించబడి ఉంటాయి. ఆయుర్వేదంలో మైగ్రేన్ చికిత్సకు ఏ మూలకాలను ఉపయోగిస్తారో తెలుసుకుందాం.
మైగ్రేన్‌కు ఆయుర్వేద చికిత్స
రిలాక్సేషన్ టెక్నిక్స్ -
Healthline.com ప్రకారం,శరీరం, మనస్సుపై ఒత్తిడిని తగ్గించడానికి విశ్రాంతి పద్ధతులు ఉపయోగించబడతాయి. ఈ పద్ధతులు శరీర నొప్పులు, తలనొప్పి, రక్తపోటు, ఒత్తిడిని తగ్గిస్తాయి అలాగే నివారిస్తాయి.
పంచకర్మ థెరపీ
పంచకర్మ థెరపీలో శరీరం శుద్ధి చేయబడి శరీరంలోని విషపదార్ధాలు తొలగిపోతాయి, దీని కారణంగా నొప్పి వంటి తీవ్రమైన సమస్యలు క్రమంగా తగ్గుతాయి.
ఈ రాశి వ్యక్తులు స్నేహితులతో సరదాగా గడపడానికి ఎల్లప్పుడూ రెడీ
యోగా
యోగా అనేది చాలా పురాతనమైన ప్రాక్టీస్. ఇది మనస్సు, శరీరాన్ని రిలాక్స్ చేస్తుంది, తద్వారా శరీరం తేలికగా ఉంటుంది. యోగా భంగిమలు మన రక్త ప్రసరణను పెంచడంలో కూడా సహాయపడతాయి.
రెగ్యులర్ ఎక్సర్ సైజ్
రెగ్యులర్ వ్యాయామం మైగ్రేన్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల మన శరీరం ఎండార్ఫిన్లను విడుదల చేస్తుంది. ఇవి సహజ నొప్పి నివారిణి. భయము,ఒత్తిడికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
పథ్యాది
పథ్యాది అనేది వివిధ మూలికల కలయికతో తయారు చేయబడిన ద్రవ పదార్ధం. మైగ్రేన్ చికిత్స కోసం ఆయుర్వేద మూలికలను పథ్యాదిలో ఉపయోగిస్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ayurvedic, Ayurvedic health tips