Home /News /life-style /

AYURVEDA TRICK ALOE VERA PACK TO CURE ACNES IN YOUR FACE AND CLICK HERE FOR HOW TO DO THESE PACE PACK PRV GH

Skin care tips: ఈ సీజన్‌లో మొటిమలు వేధిస్తున్నాయా? ఈ ఆయుర్వేద చిట్కాతో సమస్యను దూరం చేసుకోండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

జుట్టు నుంచి చర్మ సమస్యల వరకు ప్రతి సమస్యను పరిష్కరించడంలో ఆయుర్వేద ఔషధాలు ఎంతగానో దోహదపడతాయి. ముఖ్యంగా మొటిమలను కంట్రోల్ చేయడంలో ఆయుర్వేద ఔషధ మొక్క అయిన అలోవెరా (కలబంద) అద్భుతంగా పనిచేస్తుంది.

యుక్త వయస్సులోకి అడుగుపెట్టాకగానే ముఖంపై వచ్చే మొటిమలు తెగ ఇబ్బంది పెడుతుంటాయి. అయితే యవ్వన ప్రాయంలో మొటిమలు (Pimples) రావడం అనేది సర్వసాధారణమే. కానీ వయసుతో సంబంధం లేకుండా పెద్దవారిలో కూడా మొటిమలు వస్తే అది చర్మ (skin) సంబంధిత సమస్యేనని గుర్తించాలి. యుక్త వయసు దాటాక కూడా మొటిమలు వస్తుంటే అది ఏదో ఒక జబ్బుకి సంకేతం అయ్యుండొచ్చు. అందుకే మొటిమల సమస్య (acne problems) గురించి ఎప్పటికప్పుడు డాక్టర్లకు తెలియజేయాలి. జీవన విధానం, పేలవమైన చర్మ సంరక్షణ (skin care tips) అలవాట్లు, వాతావరణ పరిస్థితుల వల్ల మొటిమలు (pimples) వచ్చే ఆస్కారం ఉంది. వీటిని తగ్గించుకోవడానికి కొన్ని ఆయుర్వేద చిట్కాలు (Ayurveda tips) చెబుతున్నారు సౌందర్య నిపుణులు. సమతుల్యమైన జీవనశైలి, మంచి ఆహారపుటలవాట్లు, చురుకుగా ఉండటం, మేలైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ (skin care products), ఆయుర్వేద ఔషధాలు (Ayurveda medicines) వాడటం ద్వారా మొటిమల సమస్యకు చెక్ పెట్టవచ్చని అంటున్నారు.

తక్కువ ధరకే..

జుట్టు నుంచి చర్మ సమస్యల వరకు ప్రతి సమస్యను పరిష్కరించడంలో ఆయుర్వేద ఔషధాలు ఎంతగానో దోహదపడతాయి. ముఖ్యంగా మొటిమలను కంట్రోల్ చేయడంలో ఆయుర్వేద ఔషధ మొక్క అయిన అలోవెరా (కలబంద) అద్భుతంగా పనిచేస్తుంది. తక్కువ ధరకే లభించే అలోవెరా (aloe vera plant)లో యాంటీఆక్సిడెంట్లు, ఎంజైమ్‌లు, ఎ విటమిన్, సి విటమిన్ పుష్కలంగా లభిస్తాయి. ఇందులోని అత్యంత శక్తివంతమైన యాంటీఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు మొహంపైన పొక్కులు, మొటిమలను (pimples) తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి.

చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో..

అలోవెరా (aloe vera plant) చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది. అత్యంత మృదువుగా ఉండే కలబంద గుజ్జు చర్మానికి (for skin) ఎలాంటి హానీ తలపెట్టదు. బ్యాక్టీరియా వ్యాప్తి చెందకుండా నిరోధించగల క్రిమినాశక లక్షణాలు ఇందులో ఉంటాయి. కలబందలో ఉండే పాలీశాకరైడ్లు, గిబ్బరెల్లిన్స్ కొత్త కణాల పెరుగుదలకు దోహదపడతాయి. అలాగే చర్మం వాపు, ఎరుపును తగ్గిస్తాయి. రక్తస్రావ నివారిణిగా పనిచేసే అలోవెరా అధికంగా ఊరే సెబమ్ ను చర్మ రంధ్రాల (skin holes) నుంచి బయటకు పంపించడంలో తోడ్పడుతుంది. ధూళి, సూక్ష్మజీవులను చర్మం నుంచి బయటికి పంపించి ముఖంపై ఉన్న చర్మ రంధ్రాలను కూచించుకుపోయేలా చేస్తుంది. మొటిమలు, కాలిన గాయాలు, పొడి చర్మం వంటి సమస్యలకు అలోవెరాతో చికిత్స చేయవచ్చు.

* మొటిమల సమస్య తగ్గించేందుకు అలోవెరాని ఉపయోగించండిలా..

- కలబంద మొక్క (aloe vera plant) నుంచి ఒక భాగాన్ని తీసుకొని.. సగానికి కట్ చేయండి. దూదిని ఉపయోగించి కలబంద జెల్‌ను నేరుగా మీ మొటిమలపై పూయండి. లేదంటే మీరు ఏదైనా హెల్త్ స్టోర్ నుంచి అలోవెరా జెల్ బాటిల్ ని కొనుగోలు చేయవచ్చు. తరువాత సూచనల ప్రకారం మొటిమలపై అప్లై చేసి సమస్యకు చెక్ పెట్టొచ్చు.

- మొటిమలు తగ్గేందుకు 10-15 రోజులు పాటు ప్రతిరోజూ అలోవెరా జెల్‌ను నేరుగా మీ మొటిమలపై పూయండి. దీనిని మీ దినచర్యలో ఒక భాగంగా చేసుకోండి. కొద్ది రోజుల్లోనే మొటిమలు తగ్గడం మీరే చూస్తారు.

- సహజసిద్ధమైన అలోవెరా వాడడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ (side effects) రావు. కానీ కొందరికి ఇది పడకపోవచ్చు. అందుకే మీకు అలోవెరా అలెర్జీ ఉందా లేదా అనేది ముందస్తుగానే నిర్ధారించుకోవడం శ్రేయస్కరం.
Published by:Prabhakar Vaddi
First published:

Tags: Aloe vera, Ayurvedic medicine, Beauty tips, Skin care

తదుపరి వార్తలు