హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Hibiscus Tea: ఎర్రటి మందార టీతో అదిరిపోయే లాభాలు.. చక్కని ఆయుర్వేద ఔషధం

Hibiscus Tea: ఎర్రటి మందార టీతో అదిరిపోయే లాభాలు.. చక్కని ఆయుర్వేద ఔషధం

మందార టీ

మందార టీ

Hibiscus Tea: ఈ ఎర్రటి చాయ్ తాగితే అందంతో పాటు ఆరోగ్యం కూడా బాగుంటుంది. మందార టీలో విటమిన్ సీ, విటమిన్ ఏతో పాటు జింక్, ఇతర ఖనిజ లవణాలు పుష్కలముగా ఉంటాయి.

  మందార పువ్వు.  ఎరుపు రంగులో చాలా అందంగా ఉంటే ఈ పువ్వు.. చాలా విరివిరిగా లభిస్తుంది. అందరి ఇళ్లల్లోనూ కనిపిస్తుంది. ఆడవారికి మరింత సౌందర్యానిచ్చే మందారలో అద్భుతమైన ఔషధ గుణాలున్నాయి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పూర్వకాలం నుంచే ఎన్నో ఆయుర్వేద మందుల్లో మందారను వాడుతున్నారు. చైనీస్ మందుల్లోనూ శతాబ్ధాలుగా వినియోగిస్తున్నారు. ఐతే ఈ మందార పువ్వుతో టీ చేసుకోవచ్చని తెలుసా? ఈ ఎర్రటి చాయ్ తాగితే అందంతో పాటు ఆరోగ్యం కూడా బాగుంటుంది. మందార టీలో విటమిన్ సీ, విటమిన్ ఏతో పాటు జింక్, ఇతర ఖనిజ లవణాలు పుష్కలముగా ఉంటాయి.  ఇందులో ఉండే యాంటీ యాక్సిడెంట్లు, విటమిన్ సీ జట్టుకు ఎంతో మేలు చేస్తాయి. ఇవే కాదు మందారతో ఇంకా ఎన్నో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేంటో చూడండి.

  నిత్యం మందార టీని తాగుతుండడం వల్ల అధిక బరువు సమస్య నుంచి బయటపడవచ్చు.  న్రూట్రియెంట్స్, ఫ్లేవనాయిడ్స్, మినలర్స్ ఎక్కువగా ఉండే మందారతో ఒంట్లో కొవ్వు తగ్గుతుంది. యాంటీ యాక్సిడెంట్లు ఎక్కువగా ఉండడం వలన మెటబాలిజం పెరిగి ఊబకాయం తగ్గుతుంది.

  మందారలో ఉండే యాంటీ యాక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లామెటరీ గుణాల వల్ల బీపీ నియంత్రణలో ఉంటుంది. యూరినేషన్ పెరుగుతుంది. తద్వారా రక్తపోటు అదుపులో ఉంటుంది.

  హిబిస్కస్ యాంటీ డిప్రసెంట్‌గా పనిచేస్తుంది. మానసిక ఒత్తిడి, కుంగుబాటు వంటి సమస్యలను తగ్గిస్తుంది. ఇందులలో ఫ్లేవనాయిడ్స్ మనలో ఉండే నెగెటివ్ థింకింగ్‌ను దూరం చేస్తుంది. బాధలో ఉన్నప్పుడు గానీ, ఒత్తిడిలో ఉన్నా గానీ.. కప్పు మందార టీ తాగితే రిలాక్స్‌గా ఉంటుంది.

  మందార టీలో విటమిన్ సీ ఎక్కువగా ఉంటుంది. తద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఫ్లూ లాంటి సమస్యలు దరి చేరవు. ఇందులో ఉండే యాంటీ యాక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లామెటరీ గుణాల కారణంగా ఆయుర్వేదంలో ఇది ఎంతో విలువైన ఔషధం.

  మందారలో ఉండే ఎమినో యాసిడ్స్ జుట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మందార టీని క్రమం తప్పకుండా తాగితే వెంట్రుకలు  ఊడడం వంటి సమస్యలు తగ్గుతాయి. జుట్టు ఒత్తుగా బాగా పెరుగుతుంది. చుండ్రు, తెల్ల వెంట్రుకలు కూడా తగ్గుతాయి.

  అతినీలలోహిత కిరణాలు, కాలుష్యం నుంచి చర్మానికి రక్షణ ఇస్తుంది. శరీరంపై ముడతలను తగ్గించి నిత్య యవ్వనంగా ఉంచుతుంది. ఏటేటా మీ వయసు తగ్గుతుందే గానీ పెరగదు.

  మందార టీని ఇలా తయారు చేసుకోండి:

  మందార పువ్వులను ఎండలో ఆరబెట్టి ఇంట్లో నిల్వచేసుకోవాలి. 2 లేదా 3 టీ స్పూన్‌లో ఎండిన మందార రేకులను 2 కప్పుల నీటిలో వేసి 5 నిమిషాల పాటు మరిగించాలి. వడగట్టిన తర్వాత రుచి కోసం కాస్త తేనె, నిమ్మరసం కలుపుకోవాలి. వేడి వేడి తాగితే..చాలా అద్భుతంగా ఉంటుంది. చక్కని ఆరోగ్యం మీ సొంతమవుతుంది.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Ayurveda health, Health, Health Tips, Life Style

  ఉత్తమ కథలు