హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Mission Paani: ప్రపంచాన్ని మార్చేయగల అవార్డ్-విన్నింగ్ వాటర్ కన్జర్వేషన్ ప్రాజెక్ట్‌లు ఇవే

Mission Paani: ప్రపంచాన్ని మార్చేయగల అవార్డ్-విన్నింగ్ వాటర్ కన్జర్వేషన్ ప్రాజెక్ట్‌లు ఇవే

mission phani

mission phani

ఇటీవలి కాలంలో అనేక చిన్న నీటి సంరక్షణ, పరిశుభ్రత ప్రాజెక్టులు సానుకూల ఫలితాలను రాబట్టడంతో పాటు అవార్డ్స్ సాధించి మంచి గుర్తింపు

మనిషి మనుగడకు పరిశుభ్రమైన తాగునీరు అందుబాటులో ఉండటం ఎంతో అవసరం. వర్షాధార దేశమైన భారత్‌లో రుతుపవనాల వర్షపాతంతోనే నీటి అవసరాలు చాలావరకు తీరుతాయి. భారతదేశంలో కురిసే వర్షపు నీరంతా భూగర్భ, ఉపరితల జలాలుగా మారుతుంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాలు వార్షిక వర్షపాతంపైనే ఆధారపడుతుంటాయి. గత కొద్ది సంవత్సరాలుగా తుఫానుల వంటి ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. దాంతో వరదలు పోటెత్తుతున్నాయి. ఫలితంగా నీటి నాణ్యతతో పాటు వాటి శుభ్రత నానాటికీ గణనీయంగా తగ్గుతోంది. భవిష్యత్తులో నీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న వేళ మనమందరం కలిసి నీటిని సంరక్షించడం అత్యావశ్యకంగా మారింది.

అయితే ఇటీవలి కాలంలో అనేక చిన్న నీటి సంరక్షణ, పరిశుభ్రత ప్రాజెక్టులు సానుకూల ఫలితాలను రాబట్టడంతో పాటు అవార్డ్స్ సాధించి మంచి గుర్తింపు దక్కించుకున్నాయి. అలాంటి కొన్ని ప్రాజెక్టులు జల వనరులకు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడంలో బాగా దోహదపడతాయి. ఈ ప్రాజెక్టుల సహాయంతో ప్రజలు కాలానుగుణ వర్షపాతంపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుతం సక్సెస్ ఫుల్ గా నీటిని సంరక్షిస్తున్న ఉత్తమమైన ప్రాజెక్టుల ఏవో చూద్దాం.

1. జల్ సంచాయ్ ప్రాజెక్ట్ (Jal Sanchay Project)

బీహార్‌లోని నలంద జిల్లా అధికారులు జల్ సంచాయ్ ప్రాజెక్ట్ నీటి సంరక్షణ ప్రాజెక్టును చేపట్టారు. ఈ ప్రాంతం కరువు వంటి పరిస్థితులకు బాగా ప్రభావితమయ్యేది. దీనితో వ్యవసాయంపై ఆధారపడే రైతులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. వారి సమస్యలకు ఈ ప్రాజెక్ట్ ఒక స్థిరమైన పరిష్కారంగా జల్ సంచాయ్ ప్రాజెక్ట్ ని బహుముఖ ధోరణిలో ప్రారంభించారు. ఇందులో భాగంగా మరిన్ని చెక్ డ్యామ్‌ల, నీటిపారుదల కాలువలు నిర్మించడంతో సహా సాంప్రదాయ నీటి వనరుల నుంచి సిల్ట్ తొలగించడంపై దృష్టి సారించారు.

అలాగే నీటిని నిల్వ చేయాల్సిన అవసరం ఉందని అందరిలో ఈ స్థాయిలో అవగాహన కల్పించారు. ప్రాజెక్ట్ సంచాయ్ ప్రాజెక్ట్ ని ప్రారంభించిన అధికారులు రైతుల సాధారణ పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని.. శాశ్వత పరిష్కారాన్ని చూపేందుకు మోడ్రన్ టెక్నిక్స్ కూడా వినియోగించారు. కేరళ చొరవతో మొదలైన ఈ ప్రాజెక్టు ఇప్పుడు జనోద్యమంగా మారింది.

2. 100 చెరువులు- 50 రోజులు (100 Ponds 50 Days)

కేరళలోని ఎర్నాకుళంలో 1980 నాటికి దాదాపు 3000 చెరువులు ఉండేవి. 2016లో వాటి సంఖ్య 2300కు తగ్గిపోయింది. ఆ ఏడాదిలోనే జిల్లాలో తొలిసారిగా అత్యంత తీవ్రమైన కరువు వచ్చింది. మరుసటి ఏడాది దీనిని కరువు-పీడిత ప్రాంతంగా పరిగణించారు. నీటి కొరతతో అక్కడి ప్రజలు అది వారి పనులు కూడా చేసుకోలేకపోయారు. అప్పుడే ‘100 చెరువులు- 50 రోజులు’ అనే ప్రాజెక్టును జిల్లా కలెక్టర్ కె. మహ్మద్ వై.సఫిరుల్లా ప్రకటించారు.

ఈ ప్రాజెక్ట్ కి ప్రజల నుండి అపూర్వమైన మద్దతు లభించింది. దాంతో వారు 43 రోజుల్లో 50 చెరువులను శుభ్రం చేయగలిగారు. జిల్లా 60 రోజుల్లో 163 ​​చెరువులను శుభ్రం చేసి ఆశ్చర్యపరిచారు. వ్యవసాయంతో సహా బట్టలు ఉతకడం వంటి కొన్ని ఇంటి పనులకు చెరువు నీటిని ఉపయోగించవచ్చు. సులభంగా సాధించగలిగే స్కీం కాగా దీన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తే గొప్ప ఫలితాలను కచ్చితంగా లభిస్తాయి.

* జీవిత ప్రాజెక్ట్

జమ్మూ కశ్మీర్‌లో వ్యవసాయ జిల్లా అయిన ఉధంపూర్ లోని 80 శాతం ప్రజలు రైతులపై ఆధారపడతారు. చాలా నీటి అవసరం ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే నీటిని రక్షించుకోవాలనే ఉద్దేశంతో జీవిత ప్రాజెక్ట్ ప్లాస్టిక్ ప్రారంభించారు. చెరువు నుంచి పారే శాశ్వత నీటి వనరులను పరిరక్షించేందుకు ప్లాస్టిక్ చెరువును ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకుందీ ప్రాజెక్టు లక్ష్యంగా పెట్టుకుంది. ఈ చెరువులు నీటి నిల్వ నిర్మాణాలుగా పనిచేస్తాయి. వర్షపాతం లేని సమయాల్లో ఇది రైతులందరికీ నీటిని సరఫరా చేస్తుంది. పరిశుభ్రమైన నీరు నిల్వ చేయడం కూడా మన సమిష్టి బాధ్యత.

ఇక న్యూస్ 18, హార్పిక్ ఇండియా కలిసి మిషన్ పానీ అనే ప్రాజెక్టును ప్రారంభించింది. ఇది నీటి సంరక్షణ, ప్రజా పరిశుభ్రత అనే రెండు లక్ష్యాలను చేరుకునే దిశగా పనిచేస్తుంది. https://www.news18.com/mission-paani/ లింక్‌పై క్లిక్ చేసి ఈ కార్యక్రమంలో పొల్గొనవచ్చు.

:

First published:

Tags: Mission paani, Save water

ఉత్తమ కథలు