• HOME
  • »
  • NEWS
  • »
  • LIFE-STYLE
  • »
  • AVOID THESE SEVEN FOOD ITEMS IF YOU ARE FACING HAIR LOSS PROBLEM HSN GH

Hair loss: జుట్టు రాలుతోందా..? బట్టతల భయమా.. అయితే వీటికి మాత్రం దూరంగా ఉండండి..!

Hair loss: జుట్టు రాలుతోందా..? బట్టతల భయమా.. అయితే వీటికి మాత్రం దూరంగా ఉండండి..!

బట్టతల (ఫైల్ ఫొటో)

జుట్టు రాలుతోందా..? బట్టతల వస్తుందేమోనన్న భయం కలుగుతోందా..? అయితే ఈ ఏడు ఆహారపదార్థాలను ఓ లుక్కేయండి. మీ మెనూలో ఇవి ఉంటే, రోజూ వీటిని మీరు తినడం, తాగడం చేస్తోంటే వీలయినంత త్వరగా వాటికి గుడ్ బై చెప్పండి. ఇంతకీ ఆ ఏడు ఆహారపదార్థాలేంటంటే..

  • Share this:
మనం తినే ఆహారాన్ని బట్టే మనకు అందం, ఆరోగ్యం వస్తుంది. అందమంటే మన చర్మ సౌందర్యం, జుట్టు వంటికి అవసరమైన పోషణ అందించేది మనం తినే ఆహారమే. కాబట్టి ఆరోగ్యకరమైన తిండి, పోషకాహారాలున్న ఆహారాన్ని తింటే నిగనిగలాడే, పొడవైన, ఒత్తైన, ఆరోగ్యకరమైన జుట్టు మీసొంత మవుతుంది. ఒక్కోసారి సడన్ గా మీ జుట్టు ఊడటం మొదలుకావచ్చు. దీనికి కారణం మీరు తింటున్న తిండిలో కొన్ని పోషకాలు లేకపోవటమే. రుచితో పాటు న్యూట్రిషిన్స్ ఉన్న ఆహారం చాలా ముఖ్యం కనుక బలమైన తిండి తినండి. కొందరేమో తల పల్చడబుతోందంటే ఆ ఏముంది జెనెటిక్స్ , తీవ్ర ఒత్తిడి అందుకే ఇలా అని అలాగే ఉండిపోతారు. మరికొందరేమో ఇంకా ఎక్కువ ఖరీదైన తలనూనెలు, షాంపూలు, క్రీములు, లోషన్లు ఉపయోగించటం లేదా పదేపదే సెలూన్లో ట్రీట్మెంట్లు తీసుకోవటం వంటివి చేస్తుంటారు. కానీ ఈ క్రమంలో రసాయనాలు అత్యధికంగా మీ జుట్టుపై దుష్ప్రభావం చూపి కేశాల ఆరోగ్యం మరింత పాడై, ఇంకా ఎక్కువ జుట్టు రాలటం మొదలవుతుంది. అందుకే మీరు తినే తిండిలో ఏముంది, ఏంలేదు ఒకసారి చెక్ చేసుకుంటే సరి..

చక్కెర
తియ్యని చక్కరె మీకు అనేక ఛేదు విషయాలే మోసుకొస్తుంది. ఇన్సులిన్ రెసిస్టన్స్ వల్ల స్థూలకాయం, డయాబెట్స్, స్త్రీ, పురుషుల్లో బట్ట తల వంటి సమస్యలను తెస్తుంది. ఇన్సులిన్ రెసిస్టన్స్ కు ప్రధాన కారణం మనం తినే ఆహారంలో ఉన్న చక్కెర, రీఫైన్డ్ కార్బోహైడ్రేట్లే. కాబట్టి చక్కెరతో చేసిన పదార్థాల వినియోగానికి ఎంత దూరం ఉంటే మీ కురుల ఆరోగ్యం అంతబాగున్నట్టు లెక్క. ఇప్పటికే మీకు జుట్టు రాలే సమస్య ఉంటే చక్కెరకు శాశ్వతంగా గుడ్ బై కొట్టండి.

హై గ్లైసమిక్ ఇండెక్స్
గ్లైసమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువ ఉన్న ఆహారంతో జుట్టు రాలుతుంది. రీఫైన్డ్ ఫ్లోర్, బ్రెడ్, చక్కెర వంటి వాటిలో గ్లైసమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవి హార్మోనల్ ఇంబాలెన్స్ కు దారి తీసి, ఇన్సులిన్ స్థాయిలను విపరీతంగా పెంచి, జుట్టు రాలేలా ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. కాబట్టి జీఐ ఎక్కువ ఉన్న ఆహారం తినకండి.

Avoid these seven food items if you are facing Hair loss problem జుట్టు రాలుతోందా..? బట్టతల భయమా.. అయితే వీటికి మాత్రం దూరంగా ఉండండి..!
మద్యం (ఫైల్ ఫొటో)


ఆల్కహాల్
ఆల్కహాల్ సేవనంతో వచ్చే ప్రమాదాలు అన్నీ ఇన్నీ కావు. జుట్టు రాలడం కూడా ఆల్కహాల్ సేవనం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్టే. జుట్టు అంటే అది ప్రొటీన్ తో తయారవుతుంది. కెరాటిన్ అనే ప్రొటీన్ తో తయారయ్యే జుట్టుకు ఆల్కహాల్ అత్యంత ప్రమాదకారి. ఆల్కహాల్ ప్రొటీన్లను బలహీనపరుస్తుంది కనుక జుట్టు కూడా విపరీతంగా రాలుతుంది. అందుకే ఆల్కహాల్ ఎక్కువ తీసుకునేవారిలో పోషకాల లేమి అనేది సహజంగానే ఉంటుంది.

డైట్ సోడా
అస్పర్టేమ్ అనే కృత్రిమ స్వీట్నర్ వేసి తయారు చేసే డైట్ సోడా వెంట్రుకలను బలహీనపరుస్తుంది. కుదుళ్లను బలహీనపరచి జుట్టు రాలేలా చేసే సైడ్ ఎఫెక్ట్ డైట్ సోడాతో ఉంటుంది. మీకు జుట్టు రాలుతుంటే డైట్ సోడాలు తక్షణం తాగటం ఆపేయండి.

జంక్ ఫుడ్
జంక్ ఫుడ్ లో ఉన్న శాచురేటెడ్ వంటి రకాల ఫ్యాట్ లతో ఊబకాయం రావటమేకాదు గుండె జబ్బుల ప్రమాదాలకు దారితీస్తుంది. ఇందులో భాగంగా జుట్టు కూడా ఊడుతుంది. నూనెలు ఎక్కువ ఉన్న పదార్థాలు రోజూ తినటం వంటివాటివల్ల కూడా మీ జుట్టు రాలటం తారాస్థాయికి చేరుతుంది.

రా ఎగ్ వైట్స్
గుడ్లలో ఉన్న ప్రొటీన్ వెంట్రుకలకు చాలా మంచిది. కానీ పచ్చి ఎగ్ వైట్స్ తీసుకోవటం వల్ల బయోటిన్ లోపం ఏర్పడుతుంది. కెరాటిన్ ను ఉత్పత్తి చేయటంలో ఈ బయోటిన్ అనే విటమిన్ సహకరిస్తుంది. పచ్చి గుడ్ల సొన తాగటంతో బయోటిన్ లోపం తలెత్తి.. జుట్టుకు పోషణ తగ్గి రాలటం పెరుగుతుంది.

food items, hair fall, obesity, keratin, జుట్టు రాలడం, ఊబకాయం, కెరాటిన్, బట్టతల, ఆహారపదార్థాలు,
చేపలు (ఫైల్ ఫొటో)


చేపలు
చేపల్లో అత్యధికంగా ఉన్న పాదరసం నిల్వలకారణంగా చేపలు ఎక్కువగా తినేవారిలో కొందరికి ఉన్నట్టుండి జుట్టు ఊడిపోతుంది. వాతావరణంలో వస్తున్న భారీ మార్పుల కారణంగా మిథైల్ మెర్క్యురీ నిల్వలు చేపల్లో విపరీతంగా పెరుగుతున్నాయి. సముద్ర చేపలైనా టూనా ఫిష్ వంటివాటిలో మెర్క్యురీ చాలా ఎక్కువ. చేపలతో వెంట్రుకలు బాగా పెరుగుతాయి కానీ మీరు ఎలాంటి చేపలు తింటున్నారనేదానిపైనే ఇదంతా ఆధారపడి ఉంటుంది.
Published by:Hasaan Kandula
First published: