Home /News /life-style /

AVOID FEEDING YOUR PETS THESE HUMAN FOODS UMG GH

Pet Food Safety: మీ పెంపుడు జంతువులకు ఈ ఫుడ్ పెడుతున్నారా..? అయితే చాలా డేంజర్..!

మీ పెంపుడు జంతువులకు మనుషుల ఆహారం ఇస్తున్నారా..?

మీ పెంపుడు జంతువులకు మనుషుల ఆహారం ఇస్తున్నారా..?

మనుషులు తినే రుచికరమైన హోమ్ ఫుడ్స్‌, స్వీట్స్ తినేందుకు కుక్కలు చాలా ఆసక్తి చూపుతాయి. కానీ మనుషులు తినే స్వీట్స్‌, కేక్స్‌తో పాటు మరికొన్ని ఫుడ్స్‌ కుక్కల ఆరోగ్యానికి చాలా హాని చేస్తాయి. ఆ ఫుడ్స్ ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా ప్రజలు కుక్క (Dog), పిల్లి (Cat), ఇంకా తదితర జంతువులను పెంచుకుంటారు. వీరు తమ పెట్ (Pet) విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వాటిని కాపాడుకుంటారు. వేళకు కడుపునిండా ఆహారం కూడా అందిస్తారు. ఈ పనులు చేస్తే చాలు తమ పెంపుడు జంతువులు (Pet Animals) ఆరోగ్యంగా ఉంటాయని ఓనర్స్ అనుకుంటారు. కానీ వారు తెలుసుకోవలసిన ముఖ్య విషయం మరొకటి ఉంది. అదేంటంటే వారు తమ పెంపుడు కుక్కలు లేదా పిల్లులకు తాము తినే ప్రతి ఆహారాన్ని పెట్టకూడదు. మనుషులు తినే రుచికరమైన హోమ్ ఫుడ్స్‌, స్వీట్స్ తినేందుకు కుక్కలు చాలా ఆసక్తి చూపుతాయి. కానీ మనుషులు తినే స్వీట్స్‌, కేక్స్‌తో పాటు మరికొన్ని ఫుడ్స్‌ కుక్కల ఆరోగ్యానికి చాలా హాని చేస్తాయి. ఆ ఫుడ్స్ ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

భారతీయుల్లో దాదాపు చాలామంది తమ పెంపుడు జంతువులకు ఇంటి భోజనమే పెడతారు. వాటికి ప్రత్యేకమైన పోషకాహారం అందించాలని ఆలోచన చేసేవారు తక్కువ. నిజానికి పెంపుడు జంతువుల మెరుగైన ఆరోగ్యంలో సరైన పోషకాహారం కీలక పాత్ర పోషిస్తుంది. కుక్కల విషయానికి వస్తే వాటి వయసు, పరిమాణం, లింగం, జీవసంబంధమైన అంశాల ఆధారంగా వివిధ పోషకాహారాలు అవసరమవుతాయి. అందువల్ల, తమ పెంపుడు జంతువుకు సరైన పోషకాహారం ఏంటో తెలుసుకునేందుకు ఓనర్లు వెటర్నరీ డాక్టర్‌ను కలవాలి. పెంపుడు జంతువు రుచి, ఇష్టాల ఆధారంగా పొడి లేదా తడి ఆహారం లేదా రెండింటిని కలిపి ఇవ్వొచ్చు. వాటి ఆరోగ్యం ఎప్పుడూ మెరుగ్గా ఉంచేందుకు తరచుగా వెటర్నరీ డాక్టర్‌ను కలిసి సలహాలను అడిగి తెలుసుకోవాలి.



అసోసియేషన్ ఆఫ్ అమెరికన్ ఫీడ్ కంట్రోల్ ఆఫీసర్స్ (AAFCO) ప్రకారం, గర్భంతో ఉన్న కుక్క, పాలిచ్చే తల్లి కుక్కకి దాని జాతి, పిల్లల సంఖ్యను బట్టి అడల్ట్ డాగ్‌కు అవసరమైన పోషణ కంటే 1.5-3 రెట్ల మధ్య పోషకాహారం అందించాలి. ప్రసవానంతరం అవి బలహీనపడతాయి కాబట్టి కొవ్వు ఉన్న ఆహారం, రోగనిరోధక శక్తిని పెంచడానికి పోషక విలువలు ఉన్న సూపర్‌ఫుడ్స్‌ అందించాలి. చిన్న కుక్క పిల్లలు ఇతర జంతువుల పాల ఉత్పత్తులను ఆరగించి అరిగించుకోగలవు. కానీ పెద్ద కుక్కలకు పాల వంటి డెయిరీ ప్రొడక్ట్స్ పెడితే వాటిలో కడుపు నొప్పి సమస్యలు రావచ్చు. పెద్ద కుక్కలకు పెరుగు లేదా మజ్జిగ అన్నం పెట్టొచ్చు. జున్ను పెట్టిన వాటికి ఎలాంటి అజీర్తి సమస్యలు తలెత్తవు.

పెంపుడు జంతువులకు పెట్టకూడని ఆహారాలు
ద్రాక్ష, ఉల్లిపాయలు, డ్రై ఫ్రూట్స్, టీ, కాఫీ, స్వీట్లు వంటి ఆహార పదార్థాలు విషపూరితం కాగలవు కాబట్టి వీటిని జంతువులకు పెట్టకూడదు. వెటర్నరీ డాక్టర్లు సూచించే పెట్ ట్రీట్‌లు ఆహారంగా అందించాలి. గోధుమ పిండి చపాతీలను మీ పెంపుడు జంతువులకు దూరంగా ఉంచాలి. చపాతీలలోని గ్లూటెన్‌ జంతువుల్లో విరేచనాలు, సమస్యలకు దారి తీస్తుంది. ఆహారంలో ఉప్పు, కెమికల్ ప్రిజర్వేటివ్స్ ఉన్న ఫుడ్స్ కూడా వీటికి హానికరమే!
Published by:Mahesh
First published:

Tags: Animals, Cat, Pet dog, Stray dogs

తదుపరి వార్తలు