Home /News /life-style /

AVOID DOING THESE THINGS ON WITH EMPTY STOMACH HEALTH TIPS IN TELUGU SU

Empty Stomach: ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు వీటికి దూరంగా ఉండండి.. లేకపోతే సమస్యలు తప్పకపోవచ్చు..

;ప్రతీకాత్మక చిత్రం

;ప్రతీకాత్మక చిత్రం

ఆరోగ్యకరమైన పద్దతిలో మీ రోజును ప్రారంభిస్తే.. అది మీకు రోజంతా శక్తివంతంగా ఉండేందుకు సహాయపడుతుంది. ముఖ్యంగా ఉదయం పూట చేసే వ్యాయామం, తీసుకునే ఆహారం.. ప్రతి ఒక్కరి దినచర్యను చాలా ప్రభావితం చేస్తోంది.

    ఆరోగ్యకరమైన పద్దతిలో మీ రోజును ప్రారంభిస్తే.. అది మీకు రోజంతా శక్తివంతంగా ఉండేందుకు సహాయపడుతుంది. ముఖ్యంగా ఉదయం పూట చేసే వ్యాయామం, తీసుకునే ఆహారం.. ప్రతి ఒక్కరి దినచర్యను చాలా ప్రభావితం చేస్తోంది. ఉదయం పూట తీసుకునే ఆహారాన్ని చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకోవడం ముఖ్యం. ఎందుకంటే అది మీకు రోజంతా జీర్ణ సమస్యలు ఎదురుకాకుండా చూస్తుంది. అయితే ఖాళీ కడుపుతో(Empty Stomach) ఉన్న సమయంలో చేయకూడని తప్పులను పోషకాహార నిపుణురాలు పూజా మఖిజా(Pooja Makhija) ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వివరించారు. ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు ఈ తప్పులు కనుక చేస్తే ఇబ్బందులు తప్పవని అంటున్నారు. రోజంతా ఆరోగ్యంగా ఉండాలంటే.. జీర్ణ సమస్యలు ఎదురుకాకుండా చూసుకోవాలని అనుకుంటే.. ఈ తప్పులు అసలు చేయకూడదని చెబుతున్నారు. మరి అవేంటో చూసేద్దాం..

    కెఫిన్ (Caffeine)..
    చాలామంది తమ రోజును కప్పు కాఫీ లేదా టీతో ప్రారంభిస్తారు. అయితే ఖాళీ కడుపుతో తిసుకునే మొదటి ఆహారం గురించి ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని పూజా చెబుతున్నారు. ఖాళీ కడుపుతో కాఫీ తాగడం వల్ల ఆమ్లత్వం ఏర్పడుతుందని.. ఇది హైడ్రోక్లోరిక్ యాసిడ్ స్రావాన్ని ప్రేరేపిస్తుందని అంటున్నారు. అందుకే ఉదయాన్నే ఖాళీ కడుపున కాఫీ తాగకుండా ఉండడం మేలు అని పూజా చెబుతున్నారు.

    మద్యం (Alcohol)..
    ఖాళీ కడుపుతో ఉన్న సమయంలో మద్యం తాగడం చాలా హాని కలిగించే అంశం. కడుపులో ఎలాంటి ఆహారం లేకపోవడం వల్ల.. ఆల్కహాల్ నేరుగా రక్తప్రవాహంలోకి వెళుతుంది. ఇది.. పల్స్ రేటులో తాత్కాలిక తగ్గుదల, అలాగే రక్తపోటుకు దారి తీసే అవకాశం ఉంది. ఇది కడుపు, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, కాలేయం, మెదడును ప్రభావితం చేసే అవకాశం లేకపోలేదు. అందుకే ఖాళీ కడుపుతో ఉన్న సమయంలో ఆల్కహాల్ తీసుకోకుండా ఉండటం మంచిదని పూజా సూచిస్తున్నారు. ఆహారం తీసుకోవడం వల్ల ఆల్కహాల్ రక్తప్రవాహంలో ప్రయాణించే రేటును తగ్గించడంలో సహాయపడుతుంది.

    చూయింగ్ గమ్ (Chewing gum)..
    ఖాళీ కడుపుతో చూయింగ్ గమ్ నమలడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని అంటున్నారు పోషకాహార నిపుణురాలు పూజా. ఎందుకంటే చుయింగ్ గమ్ నమలడం వల్ల జీర్ణవ్యవస్థ ఎక్కువ ఆమ్లాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ యాసిడ్ మీ కడుపులోని లైనింగ్‌పై ప్రభావం చూపుతుంది. ఆ సమయంలో కడుపులో ఎలాంటి ఆహారం ఉండదు కాబట్టి.. అల్సర్ వచ్చే ప్రమాదం లేకపోలేదు.

    షాపింగ్ (Shopping )..
    ఖాళీ కడుపుతో షాపింగ్ చేసే వ్యక్తులు అవసరమైన దానికంటే ఎక్కువ షాపింగ్ చేయడమే కాకుండా.. అధిక కేలరీలు ఉన్న ఆహారం, ఎక్కువ జంక్ ఫుడ్ కొనుగోలు చేస్తున్నారని కార్నెల్ యూనివర్శిటీ పరిశోధనా బృందం నిర్వహించిన రెండు అధ్యయనాల్లో తేలిందని పూజా అన్నారు.






    అరవడం (Don't argue)..
    ఆకలి వేస్తున్న సమయంలో కోపం రావడం సహజంగా జరుగుతుంది. ఉదయం పూట లేవగానే ఆకలి వేస్తే ఆ కోపం మరింత ఎక్కువగా ఉంటుంది. అయితే ఆకలితో ఉన్నప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే ఇలాంటి సమయాల్లో కోపం తెచ్చుకోకుండా.. అల్పాహారం తీసుకోవడం ఉత్తమం.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Health Tips, Lifestyle

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు