సీఈవో బంపర్ ఆఫర్...ఏడాదికి రూ.36 లక్షల జీతం...పనేంటో తెలుసా ?

తనతో పాటు ఎవరైతే వరల్డ్ టూర్ వస్తారో వాళ్లకు ఏడాదికి రూ.36 లక్షల జీతం ఇస్తానని ప్రకటించాడు. అంతే కాదు...వేతనంతో పాటు హెల్త్ ఇన్సురెన్స్, ఇతర పారితోషికాలు కూడా అదనంగా ఇస్తానని తెలిపాడు.

news18-telugu
Updated: April 11, 2019, 6:24 PM IST
సీఈవో బంపర్ ఆఫర్...ఏడాదికి రూ.36 లక్షల జీతం...పనేంటో తెలుసా ?
తనతో పాటు ఎవరైతే వరల్డ్ టూర్ వస్తారో వాళ్లకు ఏడాదికి రూ.36 లక్షల జీతం ఇస్తానని ప్రకటించాడు. అంతే కాదు...వేతనంతో పాటు హెల్త్ ఇన్సురెన్స్, ఇతర పారితోషికాలు కూడా అదనంగా ఇస్తానని తెలిపాడు.
  • Share this:
ఆస్ట్రేలియాకు చెందిన మాథ్యూ లెప్రె ఒక మిలియనీర్...వ్యాపారంలో బోర్ కొట్టేసింది. ఇంకేముంది ప్రపంచ పర్యటనలకు రెడీ అయిపోయాడు. అయితే ఒక్కడే వరల్డ్ టూర్ చేస్తే ఏం బాగుంటుందని, తనకో జోడీ కావాలని కోరుకున్నాడు. అయితే ఇక్కడే సమస్య ఎదురైంది. ఎవరు మాత్రం పనులన్నీ వదులుకొని వరల్డ్ టూర్ వస్తారు. అందుకే తనకో జోడీ కావాలని ఒక బంపర్ ఆఫర్‌ను వదిలాడు. అదేంటో తెలుసా...తనతో పాటు ఎవరైతే వరల్డ్ టూర్ వస్తారో వాళ్లకు ఏడాదికి రూ.36 లక్షల జీతం ఇస్తానని ప్రకటించాడు. అంతే కాదు...వేతనంతో పాటు హెల్త్ ఇన్సురెన్స్, ఇతర పారితోషికాలు కూడా అదనంగా ఇస్తానని తెలిపాడు. ఇదంతా ఒక వీడియో చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో వదలడంతో ఔత్సాహికులు మాథ్యూను సంప్రదించేందుకు క్యూ కడుతున్నారు. ఇప్పటి వరకూ ఏకంగా 40 వేల అప్లికేషన్లు పోటెత్తాయి. అయితే విచిత్రం ఏమిటంటే వచ్చిన అప్లికేషన్లలో 75 శాతం అమ్మాయిలే కావడం విశేషం. వారిలో కూడా 25 సంవత్సరాల లోపు అమ్మాయిలే ఎక్కువగా ఉన్నారట. మరి ఈ లక్కీచాన్స్ కొట్టేసేది ఎవరో... మాథ్యూ చేతిలోనే ఉంది.

First published: April 11, 2019, 6:24 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading