Home /News /life-style /

AS POTENTIAL CAREGIVERS SYMPTOMS YOU MUST WATCH OUT FOR IN PATIENTS WITH DIABETES SRD

Advertisement : డయాబెటిస్ ఉన్న వ్యక్తులను చూసుకుంటున్నారా! ఈ లక్షణాలను జాగ్రత్తగా గమనించండి.

Netra Suraksha

Netra Suraksha

Advertisement : నిష్ణాతులుగా ఉండవలసిన ఒక వ్యాధి డయాబెటిస్‌. డయాబెటిస్ మరియు దాని సంబంధిత సమస్యల వల్ల ప్రతి సంవత్సరం మిలియన్ల కొద్దీ మరణాలు సంభవిస్తున్నాయి.

  NetraSuraksha సెల్ఫ్ చెక్ ఇక్కడ చేసుకోండి.

  ఆరోగ్యం విషయానికి వస్తే మనమందరం సరైన చర్యలు తీసుకోవడంలో కష్టపడుతుంటాం. మనకి ఏం చేయాలో తెలుసు, వ్యాయామం చేయాలని తెలుసు, విటమిన్లు తీసుకోవాలి, తీపి పదార్థాలు తినకూడదు అలాగే నిజంగా ఆకలిగా ఉన్నప్పుడే తినాలి అని...కానీ మనం ఏమి పాటించం. మన నిత్య జీవిత ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది: వయస్సు, సామాజిక, ఆర్థిక స్థితి, పెళ్ళయ్యిందా లేదా అనే దానితో సంబంధం లేదు. మనం మనకు ప్రియమైన వారిపై శ్రద్ధ తీసుకోవడం మొదలు పెట్టాక ఇవన్నీ పరిగణలోకి రావు.

  మనందరి వయస్సు పెరుగుతూనే ఉంటుంది, అలాగే మన తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులు, మన అత్త-మామలు ఇంకా ఎందరో బంధువులకు మనం ఒక సపోర్ట్ సిస్టమ్, ఈ బాధ్యత ఏదొక సమయంలో మనం తీసుకోవలసి వస్తుంది. మరి ఆ బాధ్యతను సరిగ్గా ఎలా నిర్వర్తించాలి? సమాచారం, సమాచారం, సమాచారం. మనకి ఎంత తెలిస్తే, మనం అంతగా గమనిస్తాం అలాగే అంతే త్వరగా వివిధ సందర్భాలలో ప్రతిస్పందిస్తాం. సమయం ఎప్పుడూ కీలకమైన విషయమే.

  సంభావ్య సంరక్షకులుగా, మనమందరం నిష్ణాతులుగా ఉండవలసిన ఒక వ్యాధి డయాబెటిస్‌. డయాబెటిస్ మరియు దాని సంబంధిత సమస్యల వల్ల ప్రతి సంవత్సరం మిలియన్ల కొద్దీ మరణాలు సంభవిస్తున్నాయి: ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ అట్లాస్2019 ప్రకారం, ఈ సంఖ్య 2019లో 4.2 మిలియన్లకు చేరుకుంది. డయాబెటిస్‌ ఒక్కటే లేదా హైపర్‌టెన్షన్‌తో కలిపి ఉన్నప్పుడు, ప్రపంచవ్యాప్తంగా 80% చివరి దశ మూత్రపిండ వ్యాధికి కారణమవుతుంది. డయాబెటిస్‌ మరియు దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి రెండూ హృదయ సంబంధ వ్యాధులతో బలంగా సంబంధం కలిగి ఉంటాయి1. ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ ఉన్న వారిలో 40 నుండి 60 మిలియన్ల మంది డయాబెటిక్ ఫుట్ మరియు దిగువ అవయవ సమస్యలతో బాధపడుతున్నారు1. దీర్ఘకాలిక పుండ్లు మరియు అవయవాలు తీసివేయాల్సి రావడం జీవిత నాణ్యతలో గణనీయమైన తగ్గుదలకు కారణమవుతుంది మరియు ముందస్తు మరణ ప్రమాదాన్ని పెంచుతుంది1.

  మీ కుటుంబం అలాగే మీకు తెలిసనవారిలో డయాబెటిస్‌తో బాధపడుతున్నావారు ఉన్నట్లయితే, ఈ సమస్యల గురించి ఈరోజే చదవడం మరియు తెలుసుకోవడం ప్రారంభించండి. మధుమేహానికి సంబంధించిన అన్ని సమస్యలలానే, ముందస్తు రోగనిర్ధారణ వలన రికవరీకి ఉత్తమ అవకాశాలు ఉంటాయి.

  డయాబెటిస్‌ వల్ల వచ్చే సమస్యలలో అంతగా తెలియని, కానీ బహుశా అత్యంత భయానకమైనది కంటి చూపును కోల్పోవడం. డయాబెటిస్ సంబంధిత కంటి సమస్యలు ప్రధానంగా డయాబెటిక్ రెటినోపతి, డయాబెటిక్ మాక్యులార్ ఎడిమా, కంటి శుక్లం మరియు గ్లకోమాతో పాటు డబుల్ విజన్ మరియు ఫోకస్ చేయలేకపోవడం వల్ల ఏర్పడతాయి1. వీటిలో, డయాబెటిక్ రెటినోపతి వినాశకరమైన వ్యక్తిగత, సామాజిక మరియు ఆర్థిక పరిణామాలతో పనిచేసే వయస్సులో ఉన్న వారిలో అంధత్వానికి ప్రధాన కారణాలలో ఒకటిగా గుర్తించబడింది 1. ఇది అన్నింటిలో అతి రహస్యంగా దాడి చేసే వ్యాధి, ఎందుకంటే వ్యాధి యొక్క ప్రారంభదశలలో, దీని లక్షణాలు ఏవీ కనిపించవు. దీని అర్థం మీరు లక్షణాలను చూడటం ప్రారంభించే సమయానికి, మీ కంటి చూపుకు కోలుకోలేని నష్టం జరిగిపోయి ఉండవచ్చు.

  సంరక్షకునిగా మరియు శ్రేయోభిలాషిగా మీరు గమనించవలసిన కొన్ని లక్షణాలు ఇక్కడ ఉన్నాయి.

  చదవడంలో ఇబ్బంది

  ఇది క్లిష్టమైనది, ఎందుకంటే మన కళ్ళు వయస్సుతో బలహీన పడతాయని సాధారణ జ్ఞానం చెబుతుంది. అయినప్పటికీ, మనం చదివినప్పుడు, మన కంటిలోని ఒక భాగాం, మాక్యులా అనిపిలుస్తారు – ఇది పదునైన దృష్టికి అంకితం చేయబడిన భాగం2. మనం డ్రైవింగ్ చేసేటప్పుడు మరియు ముఖాలపై దృష్టి కేంద్రీకరించేటప్పుడు ఉపయోగించే కంటి భాగం ఇదే. డయాబెటిస్ మాక్యులాలో వాపుకు దారి తీస్తుంది – డయాబెటిక్ రెటినోపతి క్లస్టర్‌లో భాగమైన డయాబెటిక్ మాక్యులార్ ఎడీమా అని పిలువబడే పరిస్థితి3.

  కళ్లద్దాలు మార్చిన తర్వాత కూడా చదవడానికి ఇబ్బందిగా ఉన్నట్లు మీరు గమనించినట్లయితే, దానిని నిర్లక్ష్యం చేయవద్దు. రెటీనా సొసైటీ ఆఫ్ ఇండియా జాయింట్ సెక్రటరీ డాక్టర్ మనీషాఅగర్వాల్ ప్రకారం, ఇది డయాబెటిక్ రెటినోపతి ప్రారంభ సంకేతాలలో ఒకటి, మరియు చూసే దృశ్యంలో నలుపు లేదా ఎరుపు మచ్చలు ఉండటం, మేఘాలు కమ్మినట్టు ఉండటం లేదా కంటిలో రక్తస్రావం కారణంగా ఆకస్మిక బ్లాక్‌అవుట్‌ల వరకు పెరుగుతుంది.

  తప్పక కంటి వైద్యుడిని సందర్శించాలని చెప్పండి మరియు మీరు వైద్యుడిని కలిసే వరకు దృష్టికి సంబంధించిన ఏవైనా ఇతర లక్షణాల లాగ్‌ను మీ వద్ద ఉంచండి. విషయం కంటికి సంబంధించినది అయినప్పుడు, అన్ని వివరాలు కీలకమే.

  మేఘావృతమైన దృష్టి

  మేఘావృతమైన దృష్టి వివిధ మార్గాల్లో కనపడుతుంది – కొందరు వ్యక్తులు సాధారణ రంగుల మందగింపు గురించి ఫిర్యాదు చేస్తారు, వారు రంగులలోని వైవిధ్యాల మధ్య తేడాను గుర్తించలేకపోవచ్చు (తెల్లని గోడకు ఎదురుగా ఉన్న తెల్లటి దీపాన్ని చూడలేకపోవడం వంటివి), వారు రాత్రి సమయంలో చూడటానికి కష్టపడవచ్చు మరియు చాలా స్పష్టమైన సంకేతం - అస్పష్టమైన, ఫిల్మ్‌లా లేదా పొగ మంచు కప్పినట్టు, ముసుగులో నుండి ప్రపంచాన్ని చూస్తున్నట్లుగా అనిపించడం. వాస్తవానికి, మీ చూపు విషయంలో జరుగుతున్నది సరిగ్గా ఇదే4.

  కంటి శుక్లం కంటి లెన్స్‌ను ప్రభావితం చేస్తుంది, లెన్స్‌పైనే డిపాజిట్ల పొరను సృష్టిస్తుంది. డయాబెటిస్‌ ఉన్నవారికి క్యాటరాక్ట్ అనే ఈ క్లౌడీలెన్స్‌లు వచ్చే అవకాశం ఉంది. డయాబెటిస్ లేనివారి కంటే డయాబెటిస్ ఉన్నవారికి చిన్న వయస్సులోనే కంటి శుక్లం ఏర్పడుతుంది. అధిక గ్లూకోజ్ స్థాయిలు లెన్స్‌లలో నిక్షేపాలు పెరగడానికి కారణమవుతాయని పరిశోధకులు భావిస్తున్నారు5.

  కంటిలో ఒత్తిడిగా ఉన్న భావన

  కంటిలో వాపు ఉందని చెప్తున్నారేమో గమనించండి - తరచుగా, వ్యాకోచం కనిపించడానికి చాలాకాలం ముందు బాధితులలో వాపు కనిపిస్తుంది. అనేక కంటి వ్యాధులు మరియు రుగ్మతలు వాపుకు కారణమవుతాయి, డయాబెటిస్ ఉన్న వ్యక్తులు ఎల్లప్పుడూ గ్లాకోమా ఉందేమో చూసుకుంటూ ఉండాలి6.

  డయాబెటిస్‌ గ్లాకోమా వచ్చే అవకాశాలను రెట్టింపు చేస్తుంది 3,6, డయాబెటిస్‌ గ్లాకోమా వచ్చే అవకాశాలను రెట్టింపు చేస్తుంది, దీనికి త్వరగా చికిత్స చేయకపోతే దృష్టి నష్టం మరియు అంధత్వానికి దారి తీస్తుంది. వయస్సు పెరిగే కొద్దీ ప్రమాదం కూడా పెరుగుతుంది6. కంటిలో ఒత్తిడి పెరిగినప్పుడు గ్లకోమా వస్తుంది. ఒత్తిడి రెటీనా మరియు ఆప్టిక్ నరాలకి రక్తాన్ని తీసుకు వెళ్ళే రక్తనాళాలను కుంచించేస్తుంది. రెటీనా మరియు నాడి దెబ్బ తినడం వల్ల చూపు క్రమంగా పోతుంది6.

  ముదురు రంగు ఫ్లోటర్స్

  మనమందరికి ఎప్పటికప్పుడు మన దృష్టిలో ఫ్లోటర్స్ వస్తాయి – ఆ ఆసక్తికరమైన, పారదర్శకమైన చిన్న చిన్న లూప్‌లు మీరు ఎలాంటి డిజైన్‌లు లేని రంగు గోడవైపు లేదా ఆకాశం వైపు చూసినప్పుడు మాత్రమే గమనించవచ్చు. ఇది పూర్తిగా సాధారణమైన విషయం. అయితే, మీరు మందపాటి ఫ్లోటర్‌లు లేదా ముదురు రంగులో కనిపించే ఫ్లోటర్‌లు ఉన్నట్టు ఫిర్యాదులు విన్నట్లయితే, మీరు దీన్ని చాలా సీరియస్‌గా తీసుకోవాలి7.

  తరచుగా, ఈ లక్షణం చాలా తక్కువ సేపు ఉంటుండవచ్చు, రోగి ఫ్లోటర్స్ గురించి చెప్పకపోవచ్చు. కాబట్టి, మీరే అడగండి. ప్రత్యేకించి మీరు చదవడంలో ఇబ్బంది లేదా డ్రైవింగ్ చేయడం లేదా ముఖాలు చూడడంలో ఇబ్బంది గురించి కూడా వింటున్నట్లయితే. డయాబెటిక్ రెటినోపతియొక్క తరువాతి దశలలో, రక్తనాళాలు కంటిలోని విట్రస్ ద్రవంలోకి లీక్అవుతాయి, దీని వలన ఈ ఫ్లోటర్స్ మరియు డార్క్ ప్యాచ్‌లు ఏర్పడతాయి 8. ఇబ్బంది ఏమిటంటే ఇవి వాటికవే నయం కావచ్చు8, సమస్యగా మారకపోవచ్చు. కాబట్టి సంరక్షకుడైన మీతో అవి ప్రస్తావించబడే అవకాశాలు చాలా తక్కువ. దీనిని డయాబెటిస్ ఉన్న వ్యక్తి దృష్టికి తీసుకురావడం ఉత్తమం, తద్వారా ఇది వారు మీకు ఫిర్యాదు చేయాలి అనే విషయం అని వారికి తెలుస్తుంది!

  డయాబెటిస్ ఉన్నవారికి వచ్చే అన్నికంటి రుగ్మతలలో, డయాబెటిక్ రెటినోపతి అత్యంత ప్రమాదకరమైనది1. చాలా దేశాల్లో, DR అనేది వినాశకరమైన వ్యక్తిగత మరియు సామాజిక ఆర్థిక పరిణామాలతో పనిచేసే వయస్సులో ఉన్న జనాభాలో అంధత్వానికి ప్రధానకారణాలలో ఒకటిగా గుర్తించబడింది, అయినప్పటికీ సమర్థవంతంగా దీనిని నివారించవచ్చు మరియు చికిత్స చేయవచ్చు1.

  ఏది ఏమైనప్పటికీ, డయాబెటిక్ రెటినోపతి నివారించదగినది అనే వాస్తవం దీనిని మరింత విషాదకరమైనదిగా మార్చింది! UK వంటి దేశాలలో, కంటి స్క్రీనింగ్ విధానం ప్రవేశ పెట్టబడింది, శ్రామిక జనాభాలో అంధత్వానికి ప్రధాన కారణం డయాబెటిక్ రెటినోపతి. నిజానికి, వేల్స్‌లో, కొత్తగా దృష్టిలోపం మరియు అంధత్వ రావడంలో 40-50% తగ్గింపును చూశారు – కేవలం 8 సంవత్సరాలలో1.

  దీని ద్వారా ఏమి రుజువు అవుతోంది? మీ కంటి వైద్యుని వద్ద (కళ్లద్దాల దుకాణంలో కాదు!) నిర్వహించబడే సాధారణ, నొప్పి లేకుండా కంటి పరీక్ష డయాబెటిక్ రెటినోపతిని ప్రారంభ దశలలోనే ఆపగలదు! ఇది ప్రారంభ దశలలో లక్షణ రహిత వ్యాధి కాబట్టి, ఆ దశలో నిర్ధారించుకోవడం వల్ల చూపు కోల్పోయే ప్రమాదం జరగలేదని అర్థం, మరియు రోగులు వారి వైద్యుల సిఫార్సులను అనుసరించడం ద్వారా వ్యాధి పురోగతిని నిరోధించవచ్చు.

  అందుకే Network18 ఇంకా Novartis కలిసి డయాబెటిక్ రెటినోపతీ బారినపడే అవకాశం ఎక్కువ వారికి అవగాహన కల్పించడానికి 'Netra Suraksha' – డయాబెటిస్‌పై భారతదేశ పోరాటం కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమం భారతదేశం కోసం పనిచేసే వాస్తవ ప్రపంచ పరిష్కారాలతో ముందుకు రావడానికి థింక్ ట్యాంక్‌లతో పాటు వైద్యం మరియు విధాన రూపకల్పనలో అత్యుత్తమ నిపుణులను ఒక చోటకి చేరుస్తుంది. డయాబెటిక్ రెటినోపతి గురించి రౌండ్ టేబుల్ చర్చలు, వివరణాత్మక వీడియోలు మరియు కథనాల ద్వారా అవగాహన పెంచడం కూడా ఈ కార్యక్రమం లక్ష్యం, వీటిని మీరు News18.comలోని Netra Suraksha కార్యక్రమం పేజీలో యాక్సెస్ చేయవచ్చు.

  సంభావ్య సంరక్షకులుగా, మన స్వంత ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడంకూడా చాలా కీలకం. ప్రతిఒక్కరూ వారి స్వంత మరియు వారి ప్రియమైన వారికి ప్రమాదాన్ని అంచనా వేయడానికి డయాబెటిక్ రెటినోపతీ స్వీయ చెకప్ ఆపై, ఒక అలవాటులా వార్షిక కంటి పరీక్షలను రొటీన్‌గా చేయాలని మేము సిఫార్సు చేస్తున్నాము. వార్షిక రక్త పరీక్షలు మరియు ఇతర క్రియాశీల స్క్రీనింగ్‌ల వంటి ఆరోగ్య చర్యలతో ఈ పరీక్షను బండిల్ చేయండి. అన్నింటికంటే కీలకంగా, మీరు ఏ వ్యాధిని అయినా త్వరగా కాకుండా మెల్లగా తెలియాలని అనుకోగలరా?
  ఆలస్యం చేయకండి.

  References:

  1. IDF Atlas, International Diabetes Federation, 9th edition, 2019

  2. https://socaleye.com/understanding-the-eye/ 18 Dec, 2021

  3. https://www.niddk.nih.gov/health-information/diabetes/overview/preventing-problems/diabetic-eye-disease 18 Dec, 2021

  4. https://www.mayoclinic.org/diseases-conditions/cataracts/symptoms-causes/syc-20353790 18 Dec 2021

  5. https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC3589218/ 18 Dec, 2021

  6. https://my.clevelandclinic.org/health/diseases/4212-glaucoma 19 Dec, 2021

  7. https://www.medicalnewstoday.com/articles/325781#causes 29 Dec, 2021

  8. https://www.mayoclinic.org/diseases-conditions/diabetic-retinopathy/symptoms-causes/syc-20371611 18 Dec, 2021

  (This is a Partnered content)
  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Diabetes

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు