Home /News /life-style /

మీకు తెలుసా? 5 సెకన్ల రూల్ ప్రకారం.. నేల మీద పడిన ఫుడ్ సురక్షితమేనా?

మీకు తెలుసా? 5 సెకన్ల రూల్ ప్రకారం.. నేల మీద పడిన ఫుడ్ సురక్షితమేనా?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

5seconds rule: నేల మీద పడిన ఫుడ్ తినడం వల్ల డయేరియా, ఫుడ్ పాయిజనింగ్ సమస్యలు రాక మానదు. నివేదికల సూచనల ప్రకారం కొన్ని రకాల బ్యాక్టిరియాలు డస్ట్ బీన్ల కంటే ప్రమాదమట.

మీరు మీకు ఇష్టమైన పిజ్జా (Pizza) తినేటప్పుడు చేయి జారి కింద పడితే ఏం చేస్తారు? దాన్ని తీసుకుని తింటారా? లేదా వదిలేస్తారా? 5 సెకన్ల రూల్ ను కొంతమంది అవలంభిస్తున్నారు. అంటే జాగ్రత్తగా 5 సెకన్ల కంటే తక్కువ సమయంలో కిందపడిన ఆహారాన్ని ఏమీ అంటుకోకపోతే తీసుకుని తినవచ్చు. దీనివల్ల ఏం కాదు. దీన్ని మీరు నమ్ముతున్నారా? కానీ, అది ఎంత వరకు సురక్షితమో మీకు తెలుసా?

ఈ గొప్ప రూల్ ప్రకారం ఏ ఫుడ్ అయినా నేల మీద పడితే.. 5 సెకన్లపాటు దానికి ఏ బ్యాక్టిరియా (Bacteria) అంటదు. కాబట్టి వాటిని తినవచ్చు.
కానీ , ఇది సేఫ్ పద్ధతి కాదు. ఏ ఆహార పదార్థమైనా నేల మీద పడితే అది పాడవ్వకుండా ఉండదు. దాన్ని ఒక్క సెకన్ కూడా నమ్మడానికి వీలు లేదు. కచ్చితంగా బ్యాక్టిరియా చేరుతుంది. మీ ఇల్లు ఎంత శుభ్రంగా కనిపించినా.. కనిపించని బ్యాక్టిరియాలు ఎన్నో ఉంటాయి. ఇంటి ఫ్లోర్ మాత్రమే కాదు, కిచెన్ కౌంటర్, సింక్లు కూడా మీరు అనుకున్నంత సేఫ్ కాదు.

ఇది కూడా చదవండి: పెళ్లిలో మీరు మరింత అందంగా కనిపించాలంటే.. ఈ చిట్కా


అటువంటి ఫుడ్ తినడం వల్ల డయేరియా, ఫుడ్ పాయిజనింగ్ సమస్యలు రాక మానదు. నివేదికల సూచనల ప్రకారం కొన్ని రకాల బ్యాక్టిరియాలు డస్ట్ బీన్ల కంటే ప్రమాదమట. అయినా, 5 సెకన్ల రూల్కి కూడా ఎలాంటి సైంటిఫిక్ రుజువు లేదు. అందుకే ఈ రూల్ని మీరు నమ్మే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి.

ఎవరు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి?

నేల మీద పడిన ఆహారాన్ని తినడం చాలా ప్రమాదం. అది కూడా ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో కొవిడ్ కొత్తరకం సౌత్ ఆఫ్రికా నుంచి కూడా వచ్చేసింది. ఇలాంటి సమయంలో ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి సులభంగా వ్యాపిస్తుంది.

ఇది కూడా చదవండి: గుడ్డుతో ఈ 5 ఫుడ్స్ ను తీసుకుంటే ఎంత ప్రమాదమో తెలుసా?




దీనివల్ల శ్వాసనాళాలకు కూడా ప్రమాదం ఏర్పడుతుంది. శరీరంలోని ఇతర భాగాలు కూడా ప్రభావితం చెందుతాయి. బ్యాక్టిరియా అందరిపై ప్రభావం చూపకపోవచ్చు, కానీ, కొందరికీ ఎక్కువ ప్రభావితం చేస్తుంది.ముఖ్యంగా ..
చిన్నపిల్లలు, ముసలివారు, గర్భవతులు, ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉన్నవారు దీనిపై మరింత అప్రమత్తంగా ఉండాలి.
Published by:Renuka Godugu
First published:

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు