AS NAVANEET KAUR IS SUFFERING FROM SPONDYLOSIS IS THERE ANY TREATMENT RNK
Spondylosis Treatment: నవనీత్ రాణా బాధపడుతున్న స్పాండిలోసిస్ వ్యాధి లక్షణాలు? చికిత్స ఏంటి?
ప్రతీకాత్మక చిత్రం
Spondylosis Treatment: స్పాండిలోసిస్‌లో వ్యాధి వల్ల సంభవించే నొప్పి ప్రధానంగా నడుము ప్రాంతం నుండి మొదలవుతుంది. ఈ వ్యాధి 16 ఏళ్ల వయస్సు నుండి ప్రారంభమవుతుంది. ఈ వ్యాధి చాలా బాధాకరంగా మారుతుంది.
Spondylosis Treatment: అమరావతి స్వతంత్ర ఎంపీ నవనీత్ రాణా (Navneet rana) స్పాండిలోసిస్‌తో బాధపడుతున్నారు. స్పాండిలోసిస్ (Spondylosis) అంటే ఏమిటి? దానికి చికిత్సలు ఏమిటో తెలుసుకుందాం. నిజానికి ఇది ఒక సాధారణ వ్యాధి. ఒక విధంగా దీనిని గౌట్ వ్యాధి అని కూడా అంటారు. ఈ వ్యాధి తక్కువ నొప్పితో మొదలై వెన్ను ,మెడలో భారాన్ని కలిగిస్తుంది. అదనంగా శరీరంలోని చాలా భాగాలలో నొప్పి వ్యాపిస్తుంది. అంతేకాదు ఈ వ్యాధి వల్ల వెన్నెముకలో భారంగా మారుతుంది. కొన్నిసార్లు ఈ వ్యాధితో బాధపడే రోగులకు చాలా నొప్పి ఉంటుంది. శస్త్రచికిత్స అవసరం. జీ న్యూస్నినివేదిక ప్రకారం.. భారతదేశంలో ప్రతి సంవత్సరం 10 మిలియన్ల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. దీని ఇతర లక్షణాలు ఏంటి? చికిత్సలు ఏంటో తెలుసుకుందాం.
స్పాండిలోసిస్ వెన్నునొప్పికి కారణం..
స్పాండిలోసిస్‌లో నొప్పి ప్రధానంగా నడుము ప్రాంతంలో ప్రారంభమవుతుంది. ఈ వ్యాధి 16 ఏళ్ల వయస్సు నుండి మొదలవుతుంది. వయస్సుతో సంబంధం లేకుండా ఈ వ్యాధి చాలా బాధాకరంగా మారుతుంది. ఇది కొన్నిసార్లు మీ గుండెపై కూడా ప్రభావం చూపుతుంది. ఇది 45 ఏళ్లలోపు పురుషులు ,స్త్రీలలో సర్వసాధారణం.
స్పాండిలోసిస్ పరీక్ష..
స్పాండిలోసిస్ను నిర్ధారించడానికి HLA-B27 పరీక్షను ఉపయోగిస్తారు. HLA-B27 అనేది రక్త పరీక్షల ద్వారా కనుగొన్న ఒక రకమైన జన్యువు. ఇది రక్త నమూనాను తీసుకొని ల్యాబ్‌లో పరీక్షిస్తారు. అదనంగా MRI స్పాండిలోసిస్ ఉందో లేదో అర్థం పరీక్షిస్తుంది.
చికిత్స -
వ్యాధి వచ్చిన తర్వాత సకాలంలో మందులు వాడాలి. కండరాల వ్యాయామం, స్టెరాయిడ్ ఇంజెక్షన్లు సహాయపడతాయి. అంతేకాదు ఈ వ్యాధి బారిన పడిన రోగులు ఫిజియోథెరపీ కూడా చేయించుకోవచ్చు. వ్యాధి తీవ్రతరమైనప్పుడు శస్త్రచికిత్స చేయించుకోవాలి. కాగా, దేశద్రోహం ఆరోపణలపై జైలులో ఉన్న రానా దంపతులకు బుధవారం బెయిల్ మంజూరైంది. ఎంపీ నవనీత్ రాణా, ఆమె భర్త ఎమ్మెల్యే రవి రాణాలకు ముంబై సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
(Disclaimer: The information and information given in this article is based on general assumptions. news18 Telugu does not confirm the same. Please contact the relevant expert before implementing them)
Published by:Renuka Godugu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.