Aromatherapy : టెన్షన్ పెరిగిపోతోందా... అరోమాథెరపీ ఫాలో అవ్వండి...

టెన్షన్ పెరిగిపోతోందా... అరోమాథెరపీ ఫాలో అవ్వండి... (credit - twitter - Aromatherapy Oil Diffusers)

Health benefits of Aromatherapy : టెన్షన్‌కి ఎంత త్వరగా చెక్ పెడితే అంత మంచిది. అందుకు అరోమాథెరపీ బాగా పనిచేస్తుంది.

 • Share this:
  Health benefits of Aromatherapy : టెన్షన్ అనేది సర్వ రోగాలకూ దారి తీస్తుంది. తలనొప్పి, షుగర్, బీపీ, హార్ట్ ఎటాక్, బరువు పెరిగిపోవడం, పొట్టలో గడబిడ, ఇర్రిటేషన్, డిప్రెష్షన్, నిద్రలేమి... ఇలా ఎన్నో వ్యాధులకు ఇది దారితీస్తుంది. కానీ... సింపుల్‌గా అరోమాథెరపీతో... దీనికి చెక్ పెట్టొచ్చు. ఇంట్లోనైనా, ఆఫీస్‌లోనైనా పని చేస్తున్నప్పుడు ఒత్తిడి రావడం మామూలే. కానీ... దాన్ని ఓ స్థాయికి మించకుండా చూసుకోవాలి. మనలో అలసట పెరిగే కొద్దీ పని ఎక్కువగా చెయ్యలేం. కానీ చెయ్యాల్సిన పనైతే తగ్గదు. కాబట్టి... పని చేస్తూనే... ఒత్తిడి రాకుండా ఉండాలంటే... సువాసన పరిమళాల్ని మనం పీల్చాలి. సుగంధ వాసనలు మనలో... కొత్త ఉత్తేజాన్ని ఇస్తాయి. టెన్షన్‌ను పటాపంచలు చేస్తాయి.

  సువాసనలు, సెంట్ స్మెల్, అగరబత్తుల వాసనలు... మన మూడ్ మారుస్తాయి. ఒక్కసారిగా మనలో తెలియని ఆనందం కలుగుతుంది. దీన్నే అరోమాథెరపీ అంటారు. ఈ సెంట్ తైలాల్ని మొక్కల పూలు, మూలికలు, వేర్లు, ఆకులు నుంచి తయారుచేస్తారు. ఆ తైలాలు గాల్లో కలుస్తాయి. వాటిని మనం పీల్చినప్పుడు... మన బాడీలోకి అవి వెళ్లినప్పుడు... మన మైండ్ వాటిని గ్రహిస్తుంది. వాటిలో ఉండే సుగుణాలు... మన మెదడును శాంతపరుస్తాయి. భారాన్ని దించేస్తాయి. తేలికగా అయ్యేలా చేస్తాయి.

  Benefits of Aromatherapy (అరోమా థెరపీ వల్ల లాభాలు) :
  - అనారోగ్యాల్ని నయం చేసే గుణాలు.
  - వ్యాధి నిరోధక శక్తి పెంపు.
  - తలనొప్పికి చెక్
  - కొత్త ఉత్సాహం, ఆనందం
  - రక్త ప్రసరణ సజావుగా సాగుతుంది.
  - జలుబు తగ్గిపోతుంది.

  Neroli Oil (నెరోలీ ఆయిల్) : ఇది ఒత్తిడిని అమాంతం తగ్గించేస్తుంది. పని ప్రదేశంలో ప్రశాంతమైన ఫీల్ కలిగిస్తుంది. ఏకాగ్రతను పెంచుతుంది. ఈ తైలాన్ని ఒక్క చుక్కను ఏ టిష్యూ పేపర్ పైనో వేసి... మన దగ్గర (కంప్యూటర్ దగ్గర లేదా టేబుల్ పైన) పెట్టుకుంటే... కొన్ని క్షణాల్లో సువాసలు గాల్లో వస్తుంటాయి. అవి పీల్చేయాలి.

  Basil oil (తులసి తైలం) : నెగెటివ్ ఆలోచనలను ఇది పోగొడుతుంది. వేడెక్కిన బుర్రను కూల్ చేస్తుది. ఏకాగ్రత పెరుగుతుంది. స్పష్టమైన ఆలోచనలు వస్తాయి. పని చెయ్యాలనే ఉత్సాహం కలుగుతుంది. ఓ గిన్నెలో కొద్దిగా నీరు తీసుకొని... అందులో ఓ చుక్క కంటే తక్కువే తులసి తైలం వెయ్యాలి. ఇప్పుడు ఓ టవల్ లేదా కర్చీఫ్ లాంటి క్లాత్‌ను నీటిలో ముంచాలి. ఆ క్లాత్ తడిగా ఉన్నా పర్వాలేదు... దాన్ని బాడీ లేదా ముఖంపై కప్పుకొని నిద్రపోవాలి. తెల్లారితే ఫుల్ ఖుషీగా ఉంటారు.

  Rosemary oil (రోజ్ మేరీ ఆయిల్) : మెమరీ పవర్ తగ్గుతున్నా, చిరాకు పెరుగుతున్నా రోజ్ మేరీ తైలం బాగా ఉపయోగపడుతుంది. ఇది ఎనర్జీని ఇస్తుంది. వ్యాధినిరోధక శక్తిని పెంచేస్తుంది. స్నానం చేసేటప్పుడు... ఓ రెండు చుక్కలు నీటిలో వేసుకొని... ఆ నీటితో స్నానం చేస్తే... సువాసనే సువాసన.

  అంతెందుకు బాత్‌రూంలో చెడు వాసనలు వస్తుంటే... అక్కడ కూడా రోజ్ మేరీ తైలం రెండు చుక్కల్ని టాయిలెట్ పేపర్ పైనో, ఇంకెక్కడైనా వేసి ఉంచితే... ఆటోమేటిక్‌గా చెడు స్మెల్ పోయి సువాసన వెదజల్లుతుంది.

  Lemon Oil (నిమ్మకాయ తైలం) : రకరకాల రోగాలు మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఉన్నప్పుడు... నిమ్మకాయ ఆయిల్ యాంటీ వైరల్‌లా పనిచేస్తుంది. చాలా మంది దీన్ని డిఫ్యూజర్ (diffuser)లో వేసి వాడతారు. ఓ క్లాత్‌పై వేసు కూడా వాడొచ్చు.

  Tea tree Oil (టీట్రీ ఆయిల్) : ఆఫీస్ లేదా ఇళ్లలోని ప్రదేశాలు, కీబోర్డ్స్, మౌస్, లంచ్ టేబుల్స్, డైనింగ్ టేబుల్స్, టెలిఫోన్స్ ఇలా వేటినైనా సరే... ఈ ఆయిల్ ఓ చుక్క నీటిలో వేసి... ఆ నీటిలో ఓ క్లాత్ ముంచి... దానితో శుభ్రం చేసుకుంటే... ఇల్లంతా పరిమళ భరితం అవుతుంది.
  Published by:Krishna Kumar N
  First published: