Wellness: మీ భార్యకు అందులో ఆసక్తి లేదని బాధపడుతున్నారా...అయితే ఇలా చేస్తే మిమ్మల్ని వదిలిపెట్టరు...

ప్రతీకాత్మకచిత్రం

ఇద్దరి అభిరుచులతోపాటు, భావప్రాప్తి విషయంలో తేడా ఉంటుంది. అయితే మీరు ఊహించినదానికి అలాగే జరిగిన దానికి తేడా ఉంటే మాత్రం, మీకు అసంతృప్తి కలిగే అవకాశం ఉంది.

  • Share this:
    రెండు చేతులు కలిస్తే చప్పట్లు అలాగే ఇద్దరు తనువులతో పాటు మనస్సులు కూడా కలిస్తేనే సుఖ సంసారం సాధ్యం అవుతుంది. లేకపోతే అలాంటి కలయికకు అసలు అర్థం అనేది ఉండదు. సాధారణంగా స్త్రీ పురుషుల్లలో సెక్స్ కు సంబంధించినంత వరకూ  ఇద్దరికీ వేర్వేరు కోరికలు ఉండే వీలుంది. అలాగే ఇద్దరి అభిరుచులతోపాటు, భావప్రాప్తి విషయంలో తేడా ఉంటుంది. అయితే మీరు ఊహించినదానికి అలాగే జరిగిన దానికి తేడా ఉంటే మాత్రం, మీకు అసంతృప్తి కలిగే అవకాశం ఉంది. అయితే అలాంటి పరిస్థితి ఎందుకు వస్తుందో తెలుసుకుందాం ఇలాంటి సందర్భాల్లోనే జాగ్రత్తగా  వ్యవహరించాల్సి ఉంటుంది. శృంగారంలో మగవాళ్ళు గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలను ఇక్కడ చర్చిద్దాం. బయట సినిమాల్లో చూపించినట్టుగా రొమాంటిక్ గా మీ జీవితం లేదని కొందరు బాధపడుతుంటారు. అయితే సినిమాలకు వాస్తవానికి చాలా తేడా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో పురుషుడికి శృంగారం పట్ల ఆసక్తి మీ భార్యకి ఉండకపోవచ్చు. అలాగే ఆమెకు కోరిక ఏంటనేది తెలియాల్సి ఉంది.

    శృంగారంలో భావప్రాప్తి పొందడం చాలా అనేది చాలా ముఖ్యం. అయితే దీన్ని పొందేందుకు ఎలాంటి రహస్యం లేదు. ఒకవేళ ఉందని మీరు భావిస్తే, అది ఒక రెసిపీలాగా ఉంటుందే తప్ప అందులో ఎలాంటి ఫీలింగ్ ఉండదు. అదీగాక మీ భార్య, ఆ సీక్రెట్ సూత్రంను మార్చేసే అవకాశం ఉంటుంది. అందువల్ల సూత్రం జోలికి వెళ్ళకుండా ఆనందించడం అలవాటు చేసుకోండి.

    మహిళలు తమ అందం విషయంలో అభద్రతా భావానికి లోనవడం చాలా సహజం. తమ కంటే కొద్దిగా అందంగా ఉన్నవారు కనిపించినపుడు ఇలా జరుగుతుంటుంది. అలా కాకపోయినా చాలామంది ఈ విషయంలో ఫీలవుతుంటారు. అందుకే ఆమె గురించి మీరు మాట్లాడాలి. అందం గురించి వర్ణించాలి. అప్పుడే ఆమెలో అభద్రతాభావం తగ్గి కోరికలు పెరుగుతాయి. మీ పార్ట్ నర్ తో కేవలం శృంగారం కోసమే కాకుండా ఆమె సంతోషాన్ని గుర్తించి నడుచుకోవాల్సి ఉంటుంది. ఆ సంతోషంలో జరిగే కలయిక మధురంగా ఉంటుంది.
    First published: