Home /News /life-style /

ARE YOU WORKING FROM BED AND HERE ARE THE SIDE EFFECTS WHICH CAN IMPACT YOUR HEALTH GH SRD

Working from Bed: బెడ్‌పై కూర్చొని ఆఫీస్ వర్క్ చేస్తున్నారా..? అయితే, జాగ్రత్త.. లేదంటే..

Image Credit : Shutterstock

Image Credit : Shutterstock

Working from Bed: కరోనా తరువాత చాలామంది ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేసే విధానానికి అలవాటుపడ్డారు. ఇది వర్కింగ్ లైఫ్‌స్టైల్‌లో చాలా మార్పులకు కారణమైంది.

కరోనా తరువాత చాలామంది ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేసే విధానానికి అలవాటుపడ్డారు. ఇది వర్కింగ్ లైఫ్‌స్టైల్‌లో చాలా మార్పులకు కారణమైంది. ఆఫీస్ డెస్క్ వాతావరణం నుంచి ఇంట్లో బెడ్‌పై కూర్చొని పనిచేసేలా వర్కింగ్ కల్చర్ మారింది. అయితే ఇలాంటి పద్ధతులు మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని చెబుతున్నారు వైద్య నిపుణులు.ఇంటి నుంచి పనిచేసేవారు ఆఫీస్‌లో మాదిరిగా కాకుండా తమ ల్యాప్‌టాప్‌లను ఒళ్లో పెట్టుకొని సోఫాలు లేదా మంచంపై కూర్చొని పని చేస్తారు. అయితే పని చేసేటప్పుడు సరైన పద్ధతిలో కూర్చోకపోతే శారీరక, మానసిక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని పరిశోధనల్లో తేలింది. మంచం మీద కూర్చొని పనిచేసేటప్పుడు, వారి శరీరం వంగి ఉంటుంది. దీనివల్ల మెడ, వీపు, వెన్నెముక సమస్యలు ఎదురవుతాయి. ఈ సైడ్ ఎఫెక్ట్స్‌తో పాటు మానసిక ఆరోగ్యంపైన కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది. బెడ్‌పై కూర్చొని పని చేయడం వల్ల ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. ఇది వ్యక్తుల మానసిక, భావోద్వేగ శ్రేయస్సుపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు.

** దీని ప్రభావం ఎలా ఉంటుంది?

* మూడ్ స్వింగ్స్
ఆఫీస్‌ వాతావరణం లేదా ఇంట్లోని ఇతర గదులతో పోలిస్తే బెడ్‌రూమ్‌లలో వెలుతురు సరిగా ఉండదు. కొంతమంది పనిచేసేటప్పుడు ఎలాంటి అంతరాయం కలగకూడదని కిటికీలను సైతం మూసి ఉంచుతారు. దీంతో మనకు సహజంగా శక్తినిచ్చే సూర్యరశ్మి లేకపోవడం వల్ల గదిలో లైటింగ్ మసకగా ఉంటుంది. ఈ డిమ్ లైటింగ్ మిమ్మల్ని అలసిపోయేలా చేస్తుంది. ఫలితంగా మనసును ప్రతికూలంగా ప్రభావితం చేస్తూ మూడ్ స్వింగ్స్‌కి కారణం కావచ్చు.

* తక్కువ ఉత్పాదకత
మంచంపై నుంచి పని చేసే పద్ధతి నిద్ర నాణ్యతను ప్రభావితం చేయవచ్చు. ఇది పని ఉత్పాదకత (work productivity), శక్తి స్థాయిలను తగ్గిస్తుంది. ఇవన్నీ ఒత్తిడిని పెంచడం ద్వారా మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.

* ఒత్తిడి, ఆందోళన
బెడ్‌రూమ్‌లో ఉండే కొద్దిపాటి వెలుతురు.. వ్యక్తుల పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. ఇది తీవ్ర ఆందోళన లేదా ఒత్తిడిని కలిగిస్తుంది. దీర్ఘకాలంలో దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది.

* ఇతర సమస్యలు
దీంతోపాటు కళ్లు ఎక్కువగా స్ట్రెయిన్ అవుతాయి. ఫలితంగా తెలియని అనాసక్తి వేధిస్తుంది. దీంతో బెడ్‌పై కూర్చొని పనిచేసే అలవాటు సెక్స్ వంటి బలమైన బంధాలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది.

** బెడ్‌పై నుంచి పనిచేయడం వల్ల ఎదురయ్యే సైడ్ ఎఫెక్ట్స్

* ఊబకాయం
మంచం మీద నుండి పని చేయడం వల్ల విరామ సమయాల్లో అలాగే బెడ్‌పై పడుకుంటారు. ఇలా ఏమాత్రం కదలకుండా ఉండటం వల్ల శారీరక కదలికలు తగ్గుతాయి. ఇది అధిక బరువు, ఊబకాయానికి దారితీస్తుంది.

* శరీర భంగిమపై ప్రభావం (Poor posture)
సాధారణంగా కుర్చీలో కూర్చొని పని చేస్తున్నప్పుడు శరీరం సరైన భంగిమలో ఉంటుంది. కానీ బెడ్‌పై కూర్చొని వర్క్ చేయడం వల్ల శరీరం వంగిపోతుంది. వెన్నుకు ఆధారం లేకపోవడంతో బాడీ పోస్టర్‌లో మార్పులు రావచ్చు. దీంతోపాటు మెడ, చేతి, మణికట్టు నొప్పులు సైతం ఎదురవ్వచ్చు.

* నిద్ర నాణ్యత తగ్గిపోవడం
సాధారణంగా మనం బెడ్‌ను పడుకోవడానికి ఉపయోగిస్తాం. కానీ రోజంతా బెడ్‌పై కూర్చోని పనిచేయడం వల్ల.. రాత్రివేళ నిద్ర సరిగా పట్టకపోవచ్చు. ఎక్కువ సమయం మెలకువగా ఉంటే నిద్ర నాణ్యత దెబ్బతింటుంది. ఇది అన్ని సమస్యలకు మూల కారణం అవుతుంది.

* ఎసిడిటీ
ఎక్కువ సమయం కదలకుండా మంచం మీద ఒకే చోట కూర్చోవడం వల్ల ఎసిడిటీ, ఛాతిలో మంట వంటి గ్యాస్ట్రిక్ సమస్యలు సైతం ఎదురవ్వచ్చు.

* పనిపై ప్రభావం
బెడ్‌పై కూర్చొని పనిచేయడం వల్ల పరధ్యానంలోకి వెళ్లవచ్చు. కొన్నిసార్లు మగతగా, నిద్ర వచ్చినట్లు అనిపిస్తుంది. ఫలితంగా పనిపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టలేరు.

** ఈ అలవాటు నుంచి ఎలా బయటపడాలి?

ఆఫీస్‌లో మాదిరిగా ఇంట్లో వర్కింగ్ డెస్క్ ఏర్పాటు చేసుకోవడం మంచిది. అక్కడి నుంచి మాత్రమే వర్క్ చేయడం అలవాటు చేసుకోవాలి. మీ ల్యాప్‌టాప్ ఛార్జర్ వైర్లు, ఇతర పని సంబంధిత వస్తువులను డెస్క్‌పై ఉంచుకోండి. బెడ్‌కు బదులుగా టేబుల్, కుర్చీ ఉపయోగిస్తూ వర్క్ చేసుకోవచ్చు. ఇలా రోజంతా పని చేసేటప్పుడు శరీర భంగిమను సరిగ్గా ఉంచుకోవచ్చు. దీంతోపాటు సరైన పని వాతావరణం కోసం ఆఫీస్‌లో మాదిరిగా ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటూ వర్క్‌పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టవచ్చు.
Published by:Sridhar Reddy
First published:

Tags: Health, Health Tips, Side effects, Work From Home

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు