కోటీశ్వరులు విపరీతంగా ఖర్చు పెడతారని అనుకుంటున్నారా? వీటికి మాత్రం డబ్బును అస్సలు బయటకు తీయరు..!

ప్రతీకాత్మక చిత్రం

డబ్బుంటే ఏదైనా చేయగలరని, ఖర్చు పెట్టేందుకు ధనవంతులు ఎలాంటి సంకోచం లేకుండా ఏ పరిస్థితుల్లోనైనా ముందుంటారని మనలో చాలామందికి ఓ భావన ఉంది. కొంత వరకు ఇది నిజమే అయినా డబ్బున్నవారిలో చాలా మంది కొన్ని సందర్భాల్లో డబ్బును ఖర్చు పెట్టేందుకు..

  • Share this:
డబ్బుంటే ఏదైనా చేయగలరని, ఖర్చు పెట్టేందుకు ధనవంతులు ఎలాంటి సంకోచం లేకుండా ఏ పరిస్థితుల్లోనైనా ముందుంటారని మనలో చాలామందికి ఓ భావన ఉంది. కొంత వరకు ఇది నిజమే అయినా డబ్బున్నవారిలో చాలా మంది కొన్ని సందర్భాల్లో డబ్బును ఖర్చు పెట్టేందుకు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు. అంతేకాకుండా ఏ విలాస వస్తువు కొనుగోలు చేయాలన్నా లెక్కలు కడతారు. అది అవసరమా కాదా అన్నది ఆలోచిస్తారు. వారు డబ్బుకు ఎంతో విలువనిస్తారు. వ్యూహాత్మకంగా ఆలోచించి పెట్టుబడులు పెడతారు. అందుకే ఎక్కువ విలువ లేని వస్తువులను కొనుగోలు చేయడానికి ఇష్టపడరు. కాబట్టి ధనవంతులు ఎక్కువగా డబ్బు వృథా చేయని కొన్ని సాధారణ విషయాలేంటో తెలుసుకుందాం. ఈ చిట్కాలు పాటిస్తే మనమూ ధనవంతులు అయ్యే అవకాశాలుంటాయి.

హఠాత్తుగా కొనుగోలు చేయడం..
ఏదైనా వస్తువు చూసేందుకు ఆకర్షణీయంగా ఉండి, అధిక ధర ఉన్నప్పుడు ఆ వస్తువును వెంటనే కొనుగోలు చేయకూడదు. ఎందుకంటే ఏ వస్తువైనా కొనుగోలు చేసేందుకు హఠాత్తుగా నిర్ణయం తీసుకోకూడదు. అది అవసరం అనిపిస్తే దాన్ని కొనుగోలు చేసేందుకు ముందుగా ప్లాన్ చేసుకొని కొనుక్కోవాలి. చాలా మంది క్రెడిట్ బ్యాలెన్స్ తగ్గిపోవడానికి ప్రధాన కారణం ఇదే. ఏదో ఆకర్షణీయంగా ఉందని కాకుండా ఆలోచించి అవసరమైతేనే కొనుగోలు చేయాలి. డబ్బున్నవారికి ఎలాంటి వస్తువునైనా, ఎప్పుడైనా కొనుగోలు చేసే స్వేచ్ఛ ఉంటుంది. కానీ నిజంగా అవసరమైతేనే కొనుగోలు చేస్తారు.

అదనపు టీవీ సబ్ స్క్రిప్షన్లు..
డిజిటల్ టీవీ ఛానళ్లు, ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కు చెందిన సబ్ స్క్రిప్షన్లు మీలో ఎంతమందికి ఉన్నాయో ఓ సారి ఆలోచించండి. ధనవంతులు టీవీ ముందు కూర్చొని సమయం గడిపేది చాలా తక్కువ. అందుకోసం వారు మెరుగైన ఫ్లాట్ ఫాం లేదా మంచి డిజిటల్ ఛానెల్ కోసం చూస్తారు. కాబట్టి మీరు జంబో డిజిటల్ ప్యాకేజీ సబ్ స్క్రైబ్ చేసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి.

లగ్జరీ వస్తువులు..
ధనవంతులు రోజూవారీ జీవనశైలిలో భాగంగా విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేయరంటే మీరు నమ్ముతారా. చూసేందుకు ఖరీదైన బట్టలు, హ్యాండ్ బ్యాగులు, లగ్జరీ కార్లు, బూట్లు కొనడం ఆశాజనకంగా అనిపించవచ్చు. కానీ ఇది మీ బ్యాంక్ బ్యాలెన్స్ త్వరగా ప్రభావితం చేస్తుంది. ఒకటి, రెండు సార్లు సరదా కోసం విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేయడం వరకు సరే.. కానీ మీ నిజంగా అవసరం లేని వస్తువులను కూడా ఖరీదుపెట్టి కొనే విషయంలో మరోసారి ఆలోచించాలి.

బడ్జెట్ కంటే ఖరీదైన ఇల్లు కొనడం..
మీ బడ్జెట్ కంటే చాలా ఎక్కువగా ఇంటిపై పెట్టుబడి పెట్టడం అంత తెలివైన పని కాదు. బాగా బేరమాడి మీకు అనువైన ఇంటిని మీ బడ్జెట్ ధరలో తీసుకోవాలి. ఎందుకంటే మీరు దాన్ని భరించగలరు. మీరు భరించలేని ఇంటిని కొనుగోలు చేస్తే డబ్బు ఎక్కువగా ఖర్చు చేయాలి. అంతేకాకుండా అదనంగా పునర్నిర్మాణాలు, ఇంటీరియర్లు మిమ్మల్ని పూర్తిగా ఇబ్బందిపెడతాయి.

అధిక సంఖ్యలో క్రెడిట్ కార్డులు..
ఎక్కువ సంఖ్యలో క్రెడిట్ కార్డులను కలిగి ఉండటం వల్ల అధిక ఛార్జీలను చెల్లించాలి. డబ్బు ఎక్కువగా ఉన్నవారు ఒకటి లేదా రెండు క్రెడిట్ కార్డులు మాత్రమే ఉంచుతారు. తద్వారా వేర్వేరు ఖాతాల నుంచి లావాదేవీల గురించి ఆందోళన చెందాల్సిన పని ఉండదు. అనేక బ్యాంకు ఖాతాలను నిర్వహించడం కంటే సురక్షితమైన ఒక బ్యాంకు ఖాతాలో పెట్టుబడి పెట్టడం చాలా సులభమైన పని.

దీర్ఘకాలం ఉండే వస్తువులపై ఖర్చు చేస్తారు..
ధనవంతులు ఊరికే వృథా చేయని వస్తువుల్లో ఫోన్లు, గ్యాడ్జెట్లు కూడా ఉన్నాయి. ఎప్పటికప్పుడు మార్కెట్లో వచ్చే తాజా ఫోన్లు లేదా ఖరీదైన గ్యాడ్జెట్లను మారుస్తూ డబ్బు వృథా చేయరు. బదులుగా ఇప్పటికే వారి వద్ద ఉన్న ఫోన్ తో హాయిగా ఉంటారు. యాత్రలకు వెళ్లినప్పుడు కూడా సౌకర్యవంతమైన హోటల్లోనే ఉండేందుకు ఇష్టపడతారు. ఎందుకంటే వీరు డబ్బు విలువను అర్థం చేసుకుంటారు. ఎక్కువగా కాలం ఉండే వస్తువులపై ఖర్చు చేస్తారు. కాబట్టి దీర్ఘకాలంలో ముఖ్యమైన విషయాలకు కొంత డబ్బు ఖర్చు చేయడం మంచిది.

అదనపు పెనాల్టీలు..
డబ్బు ఆదా చేసేటప్పుడు ప్రజలు చేసే అతిపెద్ద తప్పు ఏంటంటే తమ ఆర్థిక బకాయిలను క్రెడిట్ కార్డు కంపెనీలకు చెల్లించడం మర్చిపోతారు. కొన్ని సందర్భాల్లో ఎక్కువ పెనాల్టీ కూడా కట్టాల్సి ఉంటుంది. కాబట్టి ప్రజలు తమ క్రెడిట్ కార్డు బిల్లులను చెల్లించాల్సిన అవసరం వచ్చినప్పుడు అదనపు చెల్లింపులను నివారించడానికి ప్రణాళికాబద్దంగా ఉండాలి.
First published: