Hair fall treatment: జుట్టు ఎక్కువగా రాలిపోతుందా? అయితే ఈ నూనె ప్యాక్​ వాడండి.. సమస్యను దూరం చేయవచ్చు

ప్రతీకాత్మక చిత్రం

చాలామందికి వారి ఆహారపు అలవాట్లు, జీన్స్ వల్ల జుట్టు పెరగకపోవడం, ఉన్న జుట్టు ఊడిపోవడం (hair fall) జరుగుతుంది. జుట్టు (hair) రాలిపోతుంటే విలవిలలాడిపోతూ ఉంటారు చాలా మంది.

  • Share this:
    జుట్టు (hair) ఆడవారిలోనే కాదు మగవారికీ అందాన్ని చేకూరుస్తాయి. కాకపోతే మగవారు బట్టతల వస్తుందని తెలిసే సరికి పట్టించుకోవడం మొదలెడతారు . జుట్టు (hair) రాలిపోతుండటాన్ని (loss) చూసి తట్టుకోలేడు. ఇక అమ్మాయిలైతే (girls) మరేమరి. కేశాలు వారి అందాన్ని రెట్టింపు చేస్తాయని చెప్పడలో అతిశయోక్తి లేదు. అందుకే జుట్టు మీద అధిక శ్రద్ధ తీసుకుంటారు. మహిళల కురులు  (women hairs) మగవారికీ ఇష్టమే. కేశాలు ఎంత బాగా ఉంటే అంత అందంగా  (beauty) కనిపిస్తారు. జుట్టు ఎంత బాగుంటే అన్ని రకాల హెయిర్​ స్టైల్స్​ను ఫాలో అవుతారు. అయితే. ఇక సెలెబ్రెటీలైతే సరే సరి వారి కోసం పర్సనల్ హెయిర్​ స్పెషలిస్టులను పెట్టుకుంటారు. అయితే మనలో చాలామందికి వారి ఆహారపు అలవాట్లు, జీన్స్ వల్ల జుట్టు పెరగకపోవడం, ఉన్న జుట్టు ఊడిపోవడం (hair fall) జరుగుతుంది. జుట్టు (hair) రాలిపోతుంటే విలవిలలాడిపోతూ ఉంటారు చాలా మంది.

    సహజ సిద్ధమైన పద్దతుల ద్వారా జుట్టురాలడాన్ని ఆపవచ్చు అంటున్నారు నిపుణులు. అయితే ఆ రెమెడీ ని ఇప్పుడు మీరు కూడా ఒక సారి తెలుసుకోండి. సాధారణంగా కలబంద (aloe vera) వల్ల మనుషులకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. వీటి ఉపయోగాల గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కలబంద, కొబ్బరి నూనె (coconut oil), ఉల్లిపాయ రసం మిక్స్ చేసి జుట్టుకు పూయడం వల్ల జుట్టు రాలే సమస్య నుంచి బయటపడవచ్చు. అయితే ఈ నూనె ప్యాక్​ను ఎలా తయారు చేయాలంటే..

    మొదటగా ఉల్లిపాయను మెత్తగా రుబ్బుకోవాలి. దీని నుంచి రసం తీసి, కలబంద పేస్ట్ లో కొబ్బరి నూనె, ఈ ఉల్లిపాయ రసం కలిపి బాగా మిశ్రమంలా తయారు చేయాలి. ఈ మిశ్రమాన్ని రోజు జుట్టు మీద పూయాలి. తద్వారా మీ జుట్టు అందంగా, మందంగా, పొడవుగా, బలంగా కనిపిస్తుంది. జుట్టు రాలడానికి ప్రధాన కారణాల్లో చుండ్రు (dandruff) కూడా ఒకటి. సరైన మొత్తంలో పోషకాలను మన శరీరానికి అందించకపోతే ఇతర సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి రోజువారి దినచర్యలో ఈ ఉల్లిపాయ రసాన్ని జుట్టుకు పట్టించడం వల్ల జుట్టు రాలే సమస్య నుండి బయటపడవచ్చు.  ఉల్లిపాయ రసానికి, తేనె (honey)ను కూడా జోడించి,  జుట్టు కుదుళ్లకు పట్టించడం వల్ల జుట్టు రాలే (hair fall) సమస్య నుండి బయటపడవచ్చు.

    (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)



    ఇది కూడా చదవండి: బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేస్తే ఏమవుతుంది ? అసలు బ్రహ్మ ముహూర్తం ఎప్పుడు ఉంటుంది?

     
    Published by:Prabhakar Vaddi
    First published: