Hair Loss: జుట్టు రాలకుండా అరికట్టేందుకు 8 ఉత్తమమైన మార్గాలు

Hair Loss: హెయిర్ స్టైలిషింగ్ కోసం చాలామంది హెయిర్ డ్రయ్యర్స్, కర్లర్స్ వాడుతుంటారు. అయితే ఎక్కువగా వేడివి ఉపయోగించడం వల్ల జుట్టు చిట్లిపోవడం, గడ్డిలా మారి, రాలిపోవడం జరుగుతుంది. అందుకని వీటికి ఎంత దూరంగా ఉంటే అంతమంచిది.

Krishna Kumar N | news18-telugu
Updated: November 1, 2020, 3:16 AM IST
Hair Loss: జుట్టు రాలకుండా అరికట్టేందుకు 8 ఉత్తమమైన మార్గాలు
Hair Loss: జుట్టు రాలకుండా అరికట్టేందుకు 8 ఉత్తమమైన మార్గాలు
  • Share this:
ప్రజెంట్ పొల్యూషన్ ప్రపంచంలో మనం ఎదుర్కొనే అతి పెద్ద సమస్యల్లో ఒకటి జుట్టురాలడం. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ సమస్యను పూర్తిగా తగ్గించడం కష్టమైన పనే. అయితే ఈ సమస్యకు ప్రముఖ డెర్మటాలజిస్ట్, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ పంకజ్ చతుర్వేది, మరో డెర్మటాలజిస్ట్ చిరంజీవ్ చాబ్రాలు సరికొత్త చిట్కాలు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం.

జుట్టును కాపాడే చిట్కాలు :

* బయటికి వెళ్లినప్పుడు కచ్చితంగా తలని స్కార్ఫ్, టోపీ సాయంతో కవర్ చేయాలి. ముఖ్యంగా పొల్యూషన్ ఏరియాలో తిరిగినప్పుడు ఈ చిట్కాని తప్పకుండా పాటించాలి.

* తలలో ఎప్పటికప్పుడు దుమ్ము పేరుకుపోయి స్కాల్ఫ్‌పై చుండ్రులా తయారవుతుంది. అందువల్ల రెగ్యులర్‌గా షాంపూతో తలని శుభ్రం చేసుకోవాలి. మగవారు వీలైతే రోజూ... లేదా రోజు విడిచి రోజు, మహిళలు వారానికి రెండు లేదా మూడుసార్లు తలస్నానం చేయాలి.

* హెయిర్ స్టైలిషింగ్ కోసం చాలామంది హెయిర్ డ్రయ్యర్స్, కర్లర్స్ వాడుతుంటారు. అయితే ఎక్కువగా వేడివి ఉపయోగించడం వల్ల జుట్టు చిట్లిపోవడం, గడ్డిలా మారి రాలిపోవడం జరుగుతుంది. అందుకని వీటికి ఎంత దూరంగా ఉంటే అంతమంచిది.

* జుట్టుకి తేమని అందించడం కూడా చాలా ముఖ్యం. చాలా మంది జిడ్డుగా ఉంటుందని నూనె వాడరు. అయితే... తలస్నానం చేసే ముందురోజు జొజొబా, బాదం వంటి ఆయిల్స్‌ని తలకి మసాజ్ చేసి మర్నాడు ఉదయం తలస్నానం చేయడం వల్ల మంచి ఉపయోగం ఉంటుంది.

reasons of hairloss
ప్రతీకాత్మక చిత్రం


* మంచి కండీషనర్ కూడా జుట్టుని కాపాడుతుంది. కాబట్టి వారంలో కచ్చితంగా మంచి కండిషనర్‌ని ఉపయోగించడం వల్ల జుట్టు పాడవ్వకుండా ఉంటుంది.

* సహజసిద్ధమైన హెయిర్ మాస్క్‌లు వేయడం కూడా చాలా ముఖ్యం.  ఇందుకు ఒక అరటిపండులో పాలు, కోకో పౌడర్లు కలిపి స్మూత్ పేస్ట్‌లా చేసి తలకు పెట్టి 20 నుంచి 30 నిమిషాలు ఉంచి మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. దీనివల్ల జుట్టు పట్టుకుచ్చులా మెరుస్తుంది.

hair loss 875
ప్రతీకాత్మక చిత్రం


* షాంపూ, కండీషనర్‌లు ఏవి పడితే అవి ఉపయోగించకూడదు. మీ జుట్టు జిడ్డుగా ఉన్నట్లైతే... ఆయిలీ ఫ్రీ షాంపూని ఉపయోగించండి. అదే... మీ శిరోజాలు డ్రైగా ఉంటే కచ్చితంగా మాయిశ్చరైజింగ్ షాంపూతో తలస్నానం చేయడం మంచిది.

* బయటకి వెళ్లే సమయంలో హానికరమైన UV కిరణాలు పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే కచ్చితంగా సన్‌స్క్రీన్ క్రీమ్, స్ప్రేలు వాడడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
Published by: Krishna Kumar N
First published: November 1, 2020, 3:05 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading