Home /News /life-style /

ARE YOU SUFFERING FROM HAIR FALL THEN FOLLOW THESE KIND OF TIPS TO OVERCOME HAIR LOSS PROBLEM PRV

hair fall treatment: మీ జుట్టు బలంగా ఉండటం లేదా? ఎక్కువగా రాలిపోతుందా? అయితే ఈ జాగ్రత్తలు తీసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

జుట్టు ఆడవారిలోనే కాదు మగవారికీ అందాన్ని చేకూరుస్తాయి. మనలో చాలామందికి వారి ఆహారపు అలవాట్లు, జీన్స్ వల్ల జుట్టు పెరగకపోవడం, ఉన్న జుట్టు ఊడిపోవడం (hair fall) జరుగుతుంది. నువ్వులు, బచ్చలి కూర, మెంతి కూర (Sesame, spinach, dill) వంటివి తీసుకుంటే జుట్టుకి చాలా మేలు చేస్తాయి.

ఇంకా చదవండి ...
    వాతావరణంలో కాలుష్యం (pollution), మనం తీసుకునే ఆహారంలో పోషకాల లోపం వంటి కారణాలవల్ల ప్రతి ఒక్కరికి జుట్టురాలే (hail fall) సమస్య, అతి పెద్ద సమస్యగా మారిపోయింది. ఇందు కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి, ఎన్నో డబ్బులు కూడా ఖర్చు చేసి, విసుగు చెంది ఉంటారు చాలామంది. జుట్టు రాలిపోతుండటాన్ని ( hair loss) చూసి తట్టుకోలేడు. ఇక అమ్మాయిలైతే (girls) మరేమరి. కేశాలు వారి అందాన్ని రెట్టింపు చేస్తాయని చెప్పడలో అతిశయోక్తి లేదు. అందుకే జుట్టు మీద అధిక శ్రద్ధ తీసుకుంటారు. మహిళల కురులు  (women hairs) మగవారికీ ఇష్టమే. కేశాలు ఎంత బాగా ఉంటే అంత అందంగా  (beauty) కనిపిస్తారు. జుట్టు ఎంత బాగుంటే అన్ని రకాల హెయిర్​ స్టైల్స్​ను ఫాలో అవుతారు. అయితే జుట్టు ఆడవారిలోనే కాదు మగవారికీ అందాన్ని చేకూరుస్తాయి. మనలో చాలామందికి వారి ఆహారపు అలవాట్లు, జీన్స్ వల్ల జుట్టు పెరగకపోవడం, ఉన్న జుట్టు ఊడిపోవడం (hair fall) జరుగుతుంది. జుట్టు (hair) రాలిపోతుంటే విలవిలలాడిపోతూ ఉంటారు చాలా మంది.

    ఒత్తుగా పెరిగే జుట్టు కావాలంటే..

    నువ్వులు, బచ్చలి కూర, మెంతి కూర (Sesame, spinach, dill) వంటివి తీసుకుంటే జుట్టుకి చాలా మేలు చేస్తాయి. ఇక ఇవి జుట్టు ఆరోగ్యానికి కూడా చాలా మంచివని నిపుణులు చెబుతున్నారు. అలాగే జుట్టుకి బృంగరాజ్ కూడా మంచి మేలు చేస్తుంది. బృంగరాజ్ వల్ల జుట్టు ఆరోగ్యంగా (healthy hair) ఇంకా పటిష్టంగా ఉంటుంది. అలానే దృఢంగా ఇంకా సాఫ్ట్ గా ఉంటుంది. ఇక ఒత్తుగా పెరిగే జుట్టు కావాలంటే మానసిక ఆరోగ్యం చాలా బాగుండాలి. ఇక దానితో పాటు రోజు వ్యాయామం చేయడం కూడా మీకు ప్రయోజనాలని ఇస్తుంది. కాబట్టి ఈ విధంగా మీరు చెయ్యడం వలన మీ జుట్టుని అందంగా మార్చుకోవడానికి వీలు అవుతుంది.

    మహిళలు తలకి పట్టించే నూనెలో వేప, కరివేపాకు, మందారం వంటివి ఉపయోగించడం చాలా మంచిది. పైగా వీటి వలన ఎలాంటి జుట్టు సమస్య అనేది కూడా వుండదు. ఇక బ్రహ్మి మీ జుట్టుని అందంగా అలాగే బాగా మెరిసే లాగ చేస్తుంది. హెయిర్ ఆయిల్స్‌తో తలని బాగా మసాజ్ చేస్తూ ఉంటే జుట్టు ఆరోగ్యంగా ఉండి బాగా ఒత్తుగా పెరుగుతుంది.

    రోజు కూడా కొబ్బరి నూనెని వాడండి. దీని వల్ల తలలో వేడి బాగా తగ్గి జుట్టు బాగా ఒత్తుగా పెరుగుతుంది .అలాగే తల స్నానం చేసిన తరువాత జుట్టు ఆరిపోవడానికి హెయిర్ డ్రయర్ వాడకండి. జుట్టు నాచురల్ గా ఆరిపోయే విధంగా ట్రై చెయ్యండి. డ్రయర్ వలన జుట్టు ఊడిపోయే ప్రమాదం వుంది.

    (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Hair fall, Hair Loss

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు