హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Riding Tips: వర్షంలో బైక్ నడుపుతున్నారా..? ఈ టిప్స్ చదివి రైడింగ్ చేస్తే హాయిగా ఉంటది!

Riding Tips: వర్షంలో బైక్ నడుపుతున్నారా..? ఈ టిప్స్ చదివి రైడింగ్ చేస్తే హాయిగా ఉంటది!

వర్షంలో బైక్ నడుపుతున్నారా..? ఈ టిప్స్ చదివి నడిపితే.. మీ రైడింగ్ చేస్తే హాయిగా ఉంటది!

వర్షంలో బైక్ నడుపుతున్నారా..? ఈ టిప్స్ చదివి నడిపితే.. మీ రైడింగ్ చేస్తే హాయిగా ఉంటది!

భారతదేశంలో వర్షాకాలం (Monsoon) మొదలైపోయింది. ఇప్పుడు ఎక్కడ చూసినా రోడ్డు మార్గాలు వరదనీటితో సముద్రాలను తలపిస్తున్నాయి. దీంతో వాహనదారులకు ఇక్కట్లు తప్పడం లేదు. ముఖ్యంగా టూవీలర్ రైడర్లు (Two Wheeler Riders) అధిక ఇబ్బందులు పడాల్సి వస్తోంది.

ఇంకా చదవండి ...

భారతదేశంలో వర్షాకాలం (Monsoon) మొదలైపోయింది. ఇప్పుడు ఎక్కడ చూసినా రోడ్డు మార్గాలు వరదనీటితో సముద్రాలను తలపిస్తున్నాయి. దీంతో వాహనదారులకు ఇక్కట్లు తప్పడం లేదు. ముఖ్యంగా టూవీలర్ రైడర్లు (Two Wheeler Riders) అధిక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. నీటితో నిండిపోయి సరిగా కనిపించిన ఈ జారుడు రోడ్ల (Slippery Roads)పై టూవీలర్లు ప్రమాదాల(Accidents)కు గురయ్యే అవకాశం ఎక్కువ. అందుకే ఈ కాలంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మంచి గ్రిప్ ఉన్న కొత్త టైర్స్ ఉండాలి

ఒక్క వర్షాకాలంలో మాత్రమే కాదు ఏ కాలంలోనైనా బైక్ టైర్లు మంచి గ్రిప్‌తో ఉండేలా చూసుకోవాలి. అరిగిపోయిన టైర్లతో తడి రోడ్లపై ప్రయాణం చేస్తే జారి కింద పడే ప్రమాదాలు ఎక్కువ. అలానే తడి, పొడి వాతావరణాల్లో రోడ్డుపై మంచి కంట్రోల్ అందించే టైర్స్‌ను ఎంచుకోవాలి. కొత్త టైర్స్ ఉన్నా లేదా టైర్ల కండిషన్ మంచిగా ఉన్నా కూడా ఈ కాలంలో చాలా నెమ్మదిగా ప్రయాణించడమే మంచిది. అలానే తడి రోడ్డుపై డిస్క్ బ్రేక్ లేదా డ్రమ్ము బ్రేక్‌ని చాలా నెమ్మదిగా నొక్కాలి. ఈ ముసురు కాలంలో ముందున్న వాహనాలకు మరీ దగ్గరగా వెళ్లకుండా కనీస దూరం పాటించాలి.

రెయిన్‌ కోట్/రైడింగ్ గేర్ తప్పనిసరి

వర్షంలో తడుస్తూ బైక్ రైడ్ (Ride)చేస్తున్నప్పుడు చాలా చలి వేస్తుంది. ఈ చలి తట్టుకోలేక కొందరు రైడింగ్‌పై ఎక్కువగా దృష్టి పెట్టలేరు. అలాంటప్పుడు ప్రమాదాలు జరిగే రిస్క్ ఎక్కువ. అందుకే టూవీలర్ రైడర్లు తప్పనిసరిగా నాణ్యమైన రైడింగ్ గేర్ లేదా రైయిన్ కోటు కొనుక్కోవాలి. వర్షాకాలంలో రెయిన్‌ కోట్‌, రెయిన్‌ షూస్‌, హెల్మెట్ వేసుకోకుండా టూవీలర్‌తో బయటికి రాకూడదు. అలానే వర్షంలో రోడ్డుపై ఉన్న ట్రాఫిక్ సరిగా కనిపించదు. మీకు మాత్రమే కాకుండా ఇతర వాహనదారులకు కూడా ఇదే సమస్య ఎదురవుతుంది. అందుకే మీ టూవీలర్ ఇతర వాహనదారులకు కూడా కనిపించేలా హెడ్‌లైట్ టర్న్ ఆన్ చేయాలి.

ఇదీ చదవండి: Sexual Health: శృంగారం కోసం ఈ మందులు వాడుతున్నారా ? అంతే సంగతులు .. ఎలాంటి నష్టాలు ఉంటాయంటే..?


నిదానమే ప్రధానం

వానలో ప్రయాణిస్తున్నప్పుడు ఎగుడు దిగుడు గుంతలు, బురద రోడ్లు, నీటితో నిండిన ప్రాంతాలు, వీధికుక్కలు, పాదచారులు, పొగమంచు వాతావరణం వంటివన్నీ టూవీలర్లకు ప్రమాద కారకాలే. అందువల్ల చాలా జాగ్రత్తగా రోడ్డును పరిశీలిస్తూ ముందుకు కొనసాగాలి. దగ్గరికి వచ్చేంత వరకూ నీటితో నిండిన కొన్ని గుంతలు రోడ్డు లాగానే కనిపిస్తాయి. వీటిని చూడగానే వెంటనే గట్టిగా బ్రేక్ వేయకూడదు. పక్కకు కూడా వేగంగా తిప్పకూడదు. నెమ్మదిగా బ్రేక్ వేస్తూ స్టడీగా ఉండి ఈ గుంత మీదుగా బైక్‌ను పోనివ్వాలి.

బ్రేక్ ఇవ్వాలి

వీలైతే వర్షం వస్తున్నప్పుడు కాసేపు రైడింగ్‌కి బ్రేక్ ఇచ్చి.. వాన చినుకులు పూర్తిగా వెలిసిన తర్వాతే బయలుదేరాలి. అలానే నీళ్లు నిలిచిన రోడ్లపై ప్రయోగాలు చేయకూడదు. కొందరు వాన నీరును పైకి చిందించేలా నీళ్లు ఉన్న రోడ్డుపై నడుపుతారు. అదంత శ్రేయస్కరం కాదు. ఎందుకంటే ఆ నీటి కింద భారీ గుంతలు ఉండొచ్చు. వర్షాకాలంలో మలుపుల్లో ఎంత నెమ్మదిగా టర్న్ తీసుకుంటే అంత మంచిది.

రైడింగ్‌పై ట్రైనింగ్

టూవీలర్ నడపడం వచ్చినా కొన్ని పరిస్థితులలో తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు అందరికీ తెలియకపోవచ్చు. అదే ఒక ట్రైనింగ్ స్కూల్లో చేరితే ఏ రోడ్డులో ఎలా నడపాలి, భిన్నమైన వాతావరణ పరిస్థితులలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది తెలుస్తుంది.

Published by:Mahesh
First published:

Tags: Bike rides, Driving licence, Monsoon rains, Sports bike

ఉత్తమ కథలు