హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

#NewYear2019: న్యూ ఇయర్ పార్టీకి వెళ్తున్నారా? ఈ విషయాలు మర్చిపోవద్దు...

#NewYear2019: న్యూ ఇయర్ పార్టీకి వెళ్తున్నారా? ఈ విషయాలు మర్చిపోవద్దు...

డ్రగ్స్, హుక్కా, పేకాటపై నిషేధం ఉంటుంది. రేవ్ పార్టీలకు అనుమతి లేదు. అసభ్యకర, అర్థనగ్న నృత్యాలు నిర్వహిస్తే కొత్త సంవత్సరంలో ఊచలు లెక్కించాల్సిందే. అందుకే అలాంటి పార్టీలు నిర్వహిస్తున్నట్టు తెలిస్తే మీరు వెళ్లకపోవడం మంచిది. పోలీసులకు సమాచారం ఇవ్వండి. ఇప్పటికే పాతనేరస్తులపై కన్నేశారు పోలీసులు. ముంబై, గోవా లాంటి ప్రాంతాల నుంచి డ్రగ్స్ సరఫరా చేసేవారిపై నిఘా పెట్టారు.

ఇంకా చదవండి ...

  ఈ ఏడాదికి బైబై చెప్పే సమయం వచ్చేసింది. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు కౌంట్‌డౌన్ మొదలైంది. సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకు 'హ్యాపీ న్యూ ఇయర్' అరుపులతో హైదరాబాద్ హోరెత్తిపోనుంది. సాయంత్రం నుంచే పార్టీలో స్పెండ్ చేసేందుకు కుర్రకారు సిద్ధమైపోయారు. హైదరాబాద్‌లోని బడాబడా హోటళ్ల నుంచి చిన్నచిన్న హోటల్స్ వరకు న్యూ ఇయర్ వేడుకలు నిర్వహిస్తున్నాయి. మరి మీరు కూడా న్యూ ఇయర్ పార్టీకి రెడీ అవుతున్నారా? మరి పార్టీలో చేయాల్సినవేంటీ? పార్టీ పేరుతో చేయకూడనివి ఏంటీ? పార్టీకి వెళ్లే ముందు ఈ విషయాలు మర్చిపోవద్దు.

  న్యూ ఇయర్ పార్టీ సెలబ్రేషన్స్ ప్రతీ ఏడాది హైదరాబాద్‌లో ధూమ్‌ధామ్‌గా జరుగుతుంటాయి. ఈసారీ అదే రేంజ్‌లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. డీజే డ్యాన్సులు, లైవ్ పర్ఫామెన్స్‌లు, సెలబ్రిటీల తళుకులు... రాత్రంతా సందడే సందడి అంతా ఇంతా కాదు. న్యూ ఇయర్ పార్టీ అంటే... విందు, మందు, చిందు మామూలే కదా? అందుకే పార్టీ పేరుతో దారి తప్పితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు పోలీసులు. డిసెంబర్ 31న పెద్ద ఎత్తున వేడుకలు జరుగుతాయి కాబట్టి పోలీసులూ ఆ స్థాయిలోనే చర్యలు తీసుకుంటున్నారు.

  న్యూ ఇయర్ పార్టీకి వెళ్తున్నారా? ఈ విషయాలు మర్చిపోవద్దు... | Are you planning to attend new year party 2019? Do's and Don'ts list is hereAre you planning to attend new year party 2019? Do's and Don'ts list is here

  తేడా వస్తే జైలుకే...

  హైదరాబాద్‌లో, శివారు ప్రాంతాల్లోని హోటళ్లు, రెస్టారెంట్లు, ఫామ్ హౌజ్, రిసార్టుల్లో న్యూ ఇయర్ పార్టీలు నిర్వహించేవారితో గతంలోనే సమావేశమయ్యారు పోలీసులు. పార్టీల పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు కూడా. న్యూ ఇయర్ వేడుకలకు డిసెంబర్ 31 రాత్రి 8 గంటల నుంచి అర్థరాత్రి 1 గంట వరకే అనుమతి ఉంటుంది. డ్రగ్స్, హుక్కా, పేకాటపై నిషేధం ఉంటుంది. రేవ్ పార్టీలకు అనుమతి లేదు. అసభ్యకర, అర్థనగ్న నృత్యాలు నిర్వహిస్తే కొత్త సంవత్సరంలో ఊచలు లెక్కించాల్సిందే. అందుకే అలాంటి పార్టీలు నిర్వహిస్తున్నట్టు తెలిస్తే మీరు వెళ్లకపోవడం మంచిది. పోలీసులకు సమాచారం ఇవ్వండి. ఇప్పటికే పాతనేరస్తులపై కన్నేశారు పోలీసులు. ముంబై, గోవా లాంటి ప్రాంతాల నుంచి డ్రగ్స్ సరఫరా చేసేవారిపై నిఘా పెట్టారు.

  న్యూ ఇయర్ పార్టీకి వెళ్తున్నారా? ఈ విషయాలు మర్చిపోవద్దు... | Are you planning to attend new year party 2019? Do's and Don'ts list is hereAre you planning to attend new year party 2019? Do's and Don'ts list is here

  ట్రాఫిక్ ఆంక్షలు ఇవే...

  -డిసెంబర్ 31 రాత్రి ఔటర్ రింగ్ రోడ్డుపై రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు ఆంక్షలు విధించారు పోలీసులు. ఎయిర్ పోర్టు వెళ్లేవారిని మాత్రమే ఓఆర్ఆర్‌పై అనుమతిస్తారు. -సిటీ మొత్తం డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించనున్నారు. కాబట్టి తాగి బండి నడిపితే అడ్డంగా బుక్కైపోతారు జాగ్రత్త.

  - సిటీలోని ఫ్లైఓవర్లు రాత్రి 10 గంటల నుంచి అర్థరాత్రి 2 గంటల వరకు మూసేస్తారు. బేగంపేట ఫ్లైఓవర్‌పై మాత్రమే వాహనాలను అనుమతిస్తారు.

  - డిసెంబర్ 31 రాత్రి రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి కాబట్టి ప్రమాదాలను నియంత్రించేందుకు 'జీరో యాక్సిడెంట్ డే' నిర్వహిస్తున్నారు పోలీసులు.

  - ఖైరతాబాద్ సర్కిల్ నుంచి నెక్లెస్‌రోడ్, ఎన్టీఆర్ మార్గ్ వైపు వాహనాలను అనుమతించరు. ఆ రూట్‌లో వచ్చే వెహికిల్స్‌ని రాజ్ భవన్ మీదుగా మళ్లిస్తారు.

  - బీఆర్‌కే భవన్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వైపు వాహనాలను అనుమతించరు. తెలుగుతల్లి సర్కిల్ నుంచి ఇక్బాల్ మినార్, లక్డీకాపూల్, అయోధ్య మీదుగా వెళ్లాలి.

  - లిబర్టీ సర్కిల్ నుంచి అప్పర్ ట్యాంక్‌బ్ండ్ వైపు వచ్చే వాహనాలను బీఆర్‌కే భవన్, ఇక్బాల్ మినార్ వైపు మళ్లిస్తారు.

  - మింట్ కాంపౌండ్ నుంచి సచివాలయం మీదుగా ఎన్‌టీఆర్‌వైపు వాహనాలను అనుమతించరు.

  - సికింద్రాబాద్ నుంచి అప్పర్ ట్యాంక్‌బండ్ మీదుగా లిబర్టీ వైపు వచ్చే వాహనాలు సెయిలింగ్ క్లబ్, కవాడిగూడ క్రాస్ రోడ్స్, లోయర్ ట్యాంక్ బండ్ మీదుగా వెళ్లాలి.

  - భారీ వాహనాలు, లారీలు, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల రాకపోకలపై అర్థరాత్రి రెండు గంటల వరకు నిషేధం ఉంది.

  న్యూ ఇయర్ పార్టీకి వెళ్తున్నారా? ఈ విషయాలు మర్చిపోవద్దు... | Are you planning to attend new year party 2019? Do's and Don'ts list is hereAre you planning to attend new year party 2019? Do's and Don'ts list is here

  అర్థరాత్రి వరకు మెట్రో సేవలు

  న్యూ ఇయర్ పార్టీ సెలబ్రేట్ చేసుకొని అర్థరాత్రి ఇంటికి వెళ్లాలనుకునేవారికి మెట్రో రైలు సేవలు అందనున్నాయి. అర్థరాత్రి వరకు మెట్రో రైళ్ల సర్వీసుల్ని నడుపుతామని మెట్రో యాజమాన్యం ప్రకటించింది. మియాపూర్, ఎల్‌బీనగర్, నాగోల్ నుంచి అర్థరాత్రి 12 గంటలకు చివరి రైలు అందుబాటులో ఉంటుంది. అమీర్‌పేట్‌ ఇంటర్‌ఛేంజ్ స్టేషన్ నుంచీ అన్ని వైపులకు రాత్రి 12:30 గంటలకు చివరి మెట్రో రైలు బయలుదేరుతుంది. సో... త్వరగా పార్టీ ముగించుకుంటే దర్జాగా మెట్రోలోనే ఇంటికి వెళ్లొచ్చు. మద్యం మత్తులో వాహనాలు నడిపి సమస్యలు కొనితెచ్చుకోవడం కన్నా... మెట్రోలో లేదా ప్రైవేట్ ట్యాక్సీలో ఇంటికి వెళ్లడం మంచిది.

  సో... బుద్ధిగా న్యూ ఇయర్ పార్టీ చేసుకొని అంతే బుద్ధిగా ఇంటికి వెళ్తే కొత్త సంవత్సరానికి ఘన స్వాగతం పలకొచ్చు. న్యూ ఇయర్ పార్టీ ముసుగులో అడ్డదారులు తొక్కినా, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డా... కొత్త సంవత్సరం చాలా బ్యాడ్‌గా మొదలవుతుంది.

  ఇవి కూడా చదవండి:

  ఎస్‌బీఐలో జీరో బ్యాలెన్స్ అకౌంట్ తెరవండి ఇలా...

  ఫేక్ మొబైల్ యాప్స్‌ని అడ్డుకోవడానికి 5 టిప్స్

  తగ్గిన క్రెడిట్ స్కోర్ పెంచుకోవడానికి 10 మార్గాలు

  బ్యాంకులు మినిమమ్ బ్యాలెన్స్‌ని ఎలా లెక్కిస్తాయి? తెలుసుకోండి

  First published:

  Tags: Hyderabad Metro, New Year 2019, TS Police

  ఉత్తమ కథలు