Home /News /life-style /

ARE YOU OVERWEIGHT THEN DO THIS ASANA REDUCTION IS GUARANTEED PRV

Weight loss: అధిక బరువుతో బాధపడుతున్నారా? అయితే ఈ ఆసనం వెయ్యండి.. తగ్గడం గ్యారెంటీ..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

బరువు(weight) తగ్గడం(reduce) కోసం ఆహారం తినకుండా మానేసి ఆరోగ్యాన్ని పాడు చేసుకునే వారు కొందరైతే .. జిమ్ కి వెళ్తూ, లేనిది పోనివి తింటూ డబ్బును ఖర్చు పెట్టే వారు మరి కొంతమంది. ఎన్ని ప్రయత్నాలు చేసిన బరువు తగ్గడం లేదా. అయితే ఈ ఆసనం(asana) వేయండి చాలు.. సులువుగా బరువు తగ్గుతారు. ఇంతకీ అది ఏ ఆసనం అంటారా..

ఇంకా చదవండి ...
    స్థూలకాయుల (obese) సమస్యలు వర్ణనాతీతం. సన్నగా నాజూకుగా(slim) కనిపించాలని అందరికీ ఉంటుంది. ఇందుకోసం అనేక ప్రయత్నాలు చేసి విసిగి చెంది ఉంటారు. బరువు(weight) తగ్గడం(reduce) కోసం ఆహారం తినకుండా మానేసి ఆరోగ్యాన్ని పాడు చేసుకునే వారు కొందరైతే .. జిమ్ కి వెళ్తూ, లేనిది పోనివి తింటూ డబ్బును ఖర్చు పెట్టే వారు మరి కొంతమంది. ఎన్ని ప్రయత్నాలు చేసిన బరువు తగ్గడం లేదా. అయితే ఈ ఆసనం(asana) వేయండి చాలు.. సులువుగా బరువు తగ్గుతారు. ఇంతకీ అది ఏ ఆసనం అంటారా… సీతాకోక చిలుక(butterfly) ఆసనం(asana)... అవును దీని ద్వారా మీ అధిక బరువు(heavy weight) సమస్యకు చెక్ పెట్టవచ్చు.. ముందు ప్రశాంతంగా కూర్చోవాలి. రెండు పాదాలను మధ్యలోకి తీసుకువచ్చి రెండు కాళ్ల వేళ్లను పట్టుకోవాలి. తరువాత కాళ్లను పైకి కిందకు అంటూ ఓ 25 సార్లు చేయాలి. ఇలా క్రమంగా చేస్తూ మోకాలిని కూడా నేలకి తాకించచొచ్చు. ప్రతిరోజు ఈ ఆసనం వేస్తే శరీరం చురుగ్గా మారడం కాకుండా ఒత్తిడి నుండి ఉపశమనం పొందవచ్చు.

    పొట్ట, తొడల దగ్గర ఉన్న కొవ్వు సులువుగా కరుగుతుంది. నడుము సన్నగా మారుతుంది. ఉదయాన్నే(early morning) గోరువెచ్చని నీరు తాగి ఈ ఆసనం వేయడం వల్ల చాలా ప్రయోజనాలు పొందవచ్చు. ఉండాల్సిన బరువు కంటే అధిక బరువు ఉన్నవారు, ఎక్కువ దూరం నడవలేకపోవడం, నడిచిన ఆయాస పడడం, కూర్చోవడానికి ఇబ్బంది పడటం, కూర్చున్న తర్వాత లేవలేకపోవడం వంటి అన్ని సమస్యలకు ఈ ఆసనం ద్వారా సులువుగా చెక్ పెట్టవచ్చు .. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ రోజు నుంచి మీరు కూడా ఈ ఆసన ప్రయత్నం(try) చేయండి. బరువును తగ్గించుకోండి. అయితే ఈ ఆసనం కొంచెం వ్యాయామం తెలిసిన వారి దగ్గర చేస్తే బాగుంటుంది.

    జీర్ణశక్తి మెరుగుపడటానికి అయితే..  ఉష్ట్రాసనం

    వజ్రాసనంలో కూర్చోవాలి. సీటు భాగం మడమల మీద ఉంచాలి. ఎడమ చెయ్యి అరచేతితో భూమి మీద నొక్కుతూ శ్వాస తీసుకుంటూ సీటు భాగాన్ని కుడిచేతిని పైకి లేపి, కుడి చేతిని వీలైనంత పైకి వెనుకకు స్ట్రెచ్ చేసి పొట్ట భాగాన్ని ముందుకు నెట్టాలి. మోకాలు నుంచి తొడవరకు నిలువు రేఖలో ఉండేటట్లుగా చూడాలి. దీనిని అర్థ ఉష్ట్రాసనం అంటారు. శ్వాస వదులుతూ యధాస్థితి వజ్రాసనంలోకి వెనుకకు రావాలి. దీనివల్ల జీర్ణశక్తి మెరుగుపడడానికి, ఊపిరితిత్తులు వ్యాకోచం చెందడానికి, రుతుక్రమ సమస్యలు పోవడానికి అన్నింటికంటే ప్రత్యేకంగా లోయర్ బ్యాక్ సమస్యలు తీరుతాయి.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Health benefits, Heath tips, Life Style, Weight loss

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు